News
News
X

Vikarabad Crime: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య... మామను చంపిన కోడలు...

వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్నాయి. తన సంబంధానికి అడ్డుతగులుతున్నాడని మామను హత్యచేసిందో కోడలు.

FOLLOW US: 

వివాహేతర సంబంధాలు ఎంతటి నేరానికైనా చేయిస్తున్నాయి. కుటుంబాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. తెలంగాణ వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో దారుణ ఘటన జరిగింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని మామను హత్య చేసింది ఓ కొడలు. ప్రియుడితో కలిసి మామ కిష్టయ్య (75)ను శుక్రవారం అర్ధరాత్రి మామ కిష్టయ్య గొంతు నులిమి చంపింది కోడలు మంగమ్మ. మంగమ్మ భర్త నర్సింహులు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అనంతరం మంగమ్మకు నఫీస్​అనే వ్యక్తితో బంధం ఏర్పడింది. ఈ సంబంధం సరికాదని మంగమ్మకు మామ కిష్టయ్య సూచించాడు. దీంతో మామ కోడళ్ల మధ్య వాగ్వాదం జరిగిట్లు తెలుస్తోంది. కిష్టయ్యను అడ్డుతొలగించుకోవాలని ప్రియుడితో కలిసి ఫ్లాన్ వేసింది. మంగమ్మ శుక్రవారం అర్ధరాత్రి కిష్టయ్య నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి హత్య చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగమ్మ అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ఆమె ప్రియుడు నఫీస్ కోసం గాలిస్తున్నారు. 

Also Read: దేవరగట్టులో కర్రల సమరం... బన్ని ఉత్సవాల్లో చెలరేగిన హింస.. వంద మందికి గాయాలు

చాంద్రాయణగుట్ట మర్డర్ కేసు

హైదరాబాద్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. తన పాస్‌పోర్ట్ విడిపించడం లేదనే కత్తితో నరికి చంపానని నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. కిలో బంగారాన్ని దుబాయ్​నుంచి హైదరాబాద్​కు అక్రమంగా రవాణా చేయించడంతో పాటు సీజ్​చేసిన తన పాస్​ పోర్టును విడిపించడంలో జాప్యం చేస్తున్న వ్యక్తి హత్యకు ప్లాన్ చేశాడు ఆదిల్ జాఫ్రి. బుధవారం సాయంత్రం కారులో వెళ్తున్న హామిద్​ బిన్​అల్​జుబేదిని ఆదిల్​ జాఫ్రితో మరో ముగ్గురితో కలిసి నడిరోడ్డుపై హత్య చేశాడు. చాంద్రాయణగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. 

Also Read: గచ్చిబౌలిలో హత్య కేసు ఛేదించిన పోలీసులు.. ప్రియుడితో కలిసి ప్లాన్ ప్రకారం భర్తను రప్పించి, ఆపై దారుణం

చాంద్రాయణగుట్ట ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ వర్మ తెలిపిన వివరాల ప్రకారం బార్కాస్​ కు చెందిన హామిద్​ బిన్​ అల్​ జుబేది మీలినియం ట్రావెల్స్, వెస్టన్ యూనియన్​ మనీ వ్యాపారం చేస్తు్న్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఆదిల్ జాఫ్రి స్నేహితులు. 2019లో దుబాయ్ నుంచి వస్తున్న ఆదిల్ జాఫ్రిని కిలో బంగారాన్ని హైదరాబాద్​కు వచ్చేటప్పుడు తీసుకురమ్మని హామిద్​ బిన్​ అల్​ జుబేది చెప్పాడు. కిలో బంగారానికి ఇంకా డబ్బులు కూడా ట్రాన్స్​ఫర్​ చేశాడు అల్​జుబేది. బంగారం తీసుకుని వస్తున్న ఆదిల్​ జాఫ్రిని ఎయిర్​పోర్టు అధికారులు పట్టుకున్నారు. అక్రమ బంగారం రవాణా కింద కేసులు నమోదు చేసి పాస్​పోర్టును సీజ్​ చేశారు. తాను మళ్లీ దుబాయ్​కు వెళ్లాళని తన పాస్​ పోర్టు తనకు ఇప్పించాలని జాఫ్రి, అల్​ జుబేదిపై ఒత్తిడి తెచ్చాడు. దీనిపై కోర్టులో కేసు నడుస్తుందని, ఖర్చుల నిమిత్తం వచ్చినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాడు. 

Also Read: సామూహిక అత్యాచారమా? ప్రేమ వ్యవహారమా? నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారిన కేసు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 16 Oct 2021 02:58 PM (IST) Tags: telangana news telangana latest news Breaking News Crime News Vikarabad murder father in law murder

సంబంధిత కథనాలు

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు !  విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Crime News : గజ్జెల శబ్దం - గుప్త నిధులు ! ఇంటిని తవ్వించేసుకున్నాడు !

Crime News : గజ్జెల శబ్దం - గుప్త నిధులు !  ఇంటిని తవ్వించేసుకున్నాడు !

జైలుకు చేరని సిక్కోలు క్రైం కథలు- భయం గుప్పెట్లో ప్రజలు

జైలుకు చేరని సిక్కోలు క్రైం కథలు- భయం గుప్పెట్లో ప్రజలు

Srikakulam Crime Stories: కంచికి చేరని క్రైం కథలు, ఏళ్ల తరబడి కొనసాగుతున్న దర్యాప్తులు!

Srikakulam Crime Stories: కంచికి చేరని క్రైం కథలు, ఏళ్ల తరబడి కొనసాగుతున్న దర్యాప్తులు!

Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

టాప్ స్టోరీస్

Horoscope Today 17th August 2022: ఈ మూడు రాశులవారికి అంత అనుకూలసమయం కాదిది జాగ్రత్త, ఆగస్టు 17 రాశిఫలాలు

Horoscope Today 17th August 2022:  ఈ మూడు రాశులవారికి అంత అనుకూలసమయం కాదిది జాగ్రత్త,   ఆగస్టు 17 రాశిఫలాలు

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ-  పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?