X

West Godavari: భర్త నిద్రిస్తుండగా అక్కడ వేడి వేడి నీళ్లు పోసిన భార్య

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. అయితే ఓ దంపతుల మధ్య కూడా గొడవలు జరిగాయి. కానీ భార్య ఏం చేసిందో తెలుసా?

FOLLOW US: 

భార్యాభర్తలు అన్నాక.. గొడవ పెట్టుకుంటారు. ఆపై సర్దుకుపోతారు. కొంతమంది మాత్రం.. తమ సైకో తనం బయటకు కనిపించేలా ప్రవర్తిస్తారు. భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు రావడం సహజం. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు తిట్టుకోవడం సాధారణం. కొన్నిసార్లు ఇద్దరూ కొట్టుకుంటారు కూడా. అలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకుంటాయి. కానీ ఓ మహిళ ఏం చేసిందో తెలుసా భర్తతో గొడవపడి.. అక్కడ వేడి.. వేడి నీళ్లు పోసింది. అసలు వివరాళ్లోకి వెళ్తే..

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో దారణం ఘోరం జరిగింది. భర్తపై కోపంతో ఓ మహిళ అతడిపై మరిగే వేడినీళ్లను పోసింది. ఏలూరు పతేబాధ సెంటర్ లో టైలర్ గా పనిచేసే వ్యక్తికి అక్టోబర్ 15న భార్యతో గొడవ జరిగింది. ఇద్దరు తీవ్రస్థాయిలో తిట్టుకున్నారు. కాసేపటి తర్వాత సైలంట్ అయిపోయారు. అయితే అతడి భార్య మాత్రం.. కోపం తగ్గించుకోలేదు. మనసులో పెట్టుకుంది. భర్త నిద్రిస్తున్న టైమ్ లో సల సలా.. మరిగిన నీళ్లను తీసి.. అతడి మర్మాంగపై పోసింది. అతడు ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

గతంలోనూ ఇలాంటి ఘటనే..
 
ఏపీలో ఈ ఏడాది ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.  చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కేశవ, రేఖకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వీరి కాపురం మెుదట  సరిగానే సాగింది. కొన్ని రోజుల తర్వాత కేశవ మద్యానికి బానిసయ్యాడు. ఇంటికొచ్చి భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ జరిగేది. 
 
ఈ క్రమంలో  మే 23వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఇంటి మేడపైకి ఎక్కి గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో కేశవ.. రేఖను దూషించాడు. అక్కడితో ఆగకుండా ఆమెను కొట్టాడు. భర్త చేసిన పనికి కోపంతో రేఖ ఒక్కసారిగా అతడి మర్మాంగంపై కాలితో తన్నింది. 
ఆవేశంలో పలుసార్లు తన్నడంతో నొప్పి భరించలేక మేడపై నుంచి కిందపడి మృతి చెందాడు. దీంతో తన భర్త మద్యం మత్తులో మేడపై నుంచి కిందపడిపోయాడని అందర్నీ నమ్మించింది. ఐతే కేశవ తల్లి మాత్రం తన కొడుకు ప్రమాదవశాత్తూ చనిపోలేదని హత్య చేశారని అనుమానం వ్యక్తం చేసింది.
Tags: West Godavari Wife and Husband hot water eluru

సంబంధిత కథనాలు

Kurnool Crime: కర్నూలు జిల్లాలో జంట హత్యలు... కళ్లలో కారం చల్లి వేట కొడవళ్లతో దాడి... ఆపై పెట్రోల్ తో తగలబెట్టిన ప్రత్యర్థులు

Kurnool Crime: కర్నూలు జిల్లాలో జంట హత్యలు... కళ్లలో కారం చల్లి వేట కొడవళ్లతో దాడి... ఆపై పెట్రోల్ తో తగలబెట్టిన ప్రత్యర్థులు

Employess Strike : సమ్మె చేస్తారు సరే తర్వాతేంటి ? ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్లాన్ బీ ఉందా ?

Employess Strike :  సమ్మె చేస్తారు సరే తర్వాతేంటి ? ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్లాన్ బీ ఉందా ?

Breaking News Live: శంషాబాద్ లో మద్యం మత్తులో కారు నడిపిన యువతి.. ముగ్గురికి తీవ్రగాయాలు 

Breaking News Live: శంషాబాద్ లో మద్యం మత్తులో కారు నడిపిన యువతి.. ముగ్గురికి తీవ్రగాయాలు 

AP Corona Updates: ఏపీలో కరోనా కల్లోలం... ఒక్క రోజే 13 వేలకు పైగా కేసులు, 9 మంది మృతి

AP Corona Updates: ఏపీలో కరోనా కల్లోలం... ఒక్క రోజే 13 వేలకు పైగా కేసులు, 9 మంది మృతి

AP Employees Unions : జీతాల బిల్లులపై ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు .. ఒత్తిడి చేస్తే వెంటనే సమ్మెకు వెళ్తామన్న ఉద్యోగ నేతలు !

AP Employees Unions :  జీతాల బిల్లులపై ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు .. ఒత్తిడి చేస్తే వెంటనే సమ్మెకు వెళ్తామన్న ఉద్యోగ నేతలు !
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Redmi Smart Band Pro: రెడ్‌మీ కొత్త స్మార్ట్ బ్యాండ్ వచ్చేస్తుంది.. ధర రూ.రెండు వేలలోపే.. లాంచ్ ఎప్పుడంటే?

Redmi Smart Band Pro: రెడ్‌మీ కొత్త స్మార్ట్ బ్యాండ్ వచ్చేస్తుంది.. ధర రూ.రెండు వేలలోపే.. లాంచ్ ఎప్పుడంటే?

Covid Vaccine Update: మార్కెట్ విక్రయానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు.. కానీ అక్కడ మాత్రం దొరకవు!

Covid Vaccine Update: మార్కెట్ విక్రయానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు.. కానీ అక్కడ మాత్రం దొరకవు!

Stars Social Talk: దుబాయ్‌లో బన్నీ... బికినీలో దిశా, మాళవిక... రష్యాలో రాశీ ఖన్నా!

Stars Social Talk: దుబాయ్‌లో బన్నీ... బికినీలో దిశా, మాళవిక... రష్యాలో రాశీ ఖన్నా!