అన్వేషించండి

Vangaveeti Radha: చంద్రబాబును కలిసిన వంగవీటి రాధా - ఆ పదవి ఆయనకు ఫైనల్ అయినట్లే !

Andhra Pradesh: టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ చంద్రబాబును కలిశారు. ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి పదవి ఆయనకు ఇస్తారని ఇంత కాలం ప్రచారం జరిగింది. కానీ అది నాగబాబుకు ఖరారైంది.

Vangaveeti Radhakrishna met Chief Minister Chandrababu: టీడీపీలో పార్టీ కోసం పని చేసి పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి వారి స్థాయికి తగ్గ పదవుల్ని ఇచ్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. రాజ్యసభ స్థానాన్ని ఖరారు చేయడంలో నాగబాబుకు నిరాశ ఎదురు కావడంతో ఆయనను మంత్రిని చేయాలని నిర్ణయించుకున్నారు. తాజాగా పార్టీ కోసం పని చేసిన  వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. నిజానికి మంత్రివర్గంలో ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ఆ స్థానాన్ని ఎమ్మెల్సీగా చేసిన .. వంగవీటి రాధాకృష్ణకు ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు నాగబాబుకు కేటాయించాల్సి రావడంతో చంద్రబాబు పిలిపించి మట్లాడినట్లుగా తెలుస్తోంది. 

గత రెండు ఎన్నికల్లో టీడీపీ కోసం విస్తృతం ప్రచారం చేసిన వంగవీటి రాధా 

వంగవీటి రాధాకృష్ణ 2019, 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం  విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఆయన టిక్కెట్ అడగలేదు. ఎక్కడా పోటీ చేయలేదు. ఎన్నికల ప్రచారంలో వంగవీటి రాధాకృష్ణకు మంచి పదవి ఇచ్చి గౌరవిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ఆయనకు మంచి పదవి ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు వంగవీటి రాధాకృష్ణను పిలిపించుకుని ఎమ్మెల్సీ పదవిపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవితో పాటు కేబినెట్ ర్యాంక్ ఉన్న హోదా ఉన్న బాధ్యతలు కూడా అప్పగిస్తామని తెలిపినట్లుగా తెలుస్తోంది.                          

Also REad:  త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా

పలువురు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా - త్వరలో ఉప ఎన్నికలు                      

ఇటీవల పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు.అలాగే మరికొంత మంది రాజీనామాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఉపఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఖాళీ అయ్యే ఎమ్మెల్సీలను మళ్లీ రాజీనామాలు చేసే వారికి ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.అలాంటి ఒప్పందంతోనే రాజీనామాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఆ ఎమ్మెల్సీ పదవుల్ని పార్టీ కోసం పని చేసిన వారికి కేటాయించే అవకాశం ఉంది.              

Also Read:  ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?

ఎంపీ సీటు త్యాగం చేయడంతో  నాగబాబుకు మంత్రి పదవి                                                    

నాగేంద్రబాబును మంత్రి పదవికి ఖరారు చేయడం అనూహ్యంగా మారింది. ఆయన అనకాపల్లి  ఎంపీసీటులో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే కూటమి పొత్తుల్లో భాగంగా ఆ సీటు సీఎం రమేష్ కు వెళ్లడంతో ఆయన పోటీ నుంచి  వైదొలగాల్సి వచ్చింది. సీటు త్యాగం చేసినందుకు ఆయనకు న్యాయం చేయాల్సి ఉంది. రాజ్యసభ సీటును ఖరారు చేస్తారని అనుకున్నా.. ఆర్ కృష్ణయ్య బీజేపీ తరపున నామినేట్ కావడంతో అకామిడేట్ చేయలేకపోయారు. దీంతో సమీకరణాలు మారిపోయినట్లయింది. 

 

టాప్ హెడ్ లైన్స్

JanaSena Candidates List: జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ
జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ
AP Local Body Elections: ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు.. కఠిన చర్యలు తప్పవన్న ఎస్ఈసీ
ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు.. కఠిన చర్యలు తప్పవన్న ఎస్ఈసీ
దుర్గాష్టమి: నవరాత్రుల్లో ఎనిమిదో రోజు విశిష్టత, ఆయుధ పూజ ప్రాముఖ్యత!
దుర్గాష్టమి: నవరాత్రుల్లో ఎనిమిదో రోజు విశిష్టత, ఆయుధ పూజ ప్రాముఖ్యత!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget