Jagan Siddham Meeting: రాప్తాడులో ఏపీ సీఎం జగన్ సిద్ధం సభ- ఆ వాహనాలపై ఎస్పీ ట్రాఫిక్ ఆంక్షలు
Siddham Meeting In Rapthadu: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధం సభను అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

YS Jagan Siddham Meeting: అనంతపురం జిల్లా : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధం సభను అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే సీఎం జగన్ సిద్ధం సభ నిర్వహణ కారణంగా వాహనాల మళ్లింపు ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. భారీ గూడ్స్ వాహనాలకు మాత్రమే మళ్లింపు ఆంక్షలు విధించినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఆదివారం మధ్యహ్నాం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మాత్రమే మళ్లింపు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. అత్యవసర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, కార్లు, తదితర మిగితా అన్ని రకాల వాహనాలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు... బెంగుళూరు నుండీ హైదరాబాదుకు వయా అనంతపురం మీదుగా హైవే-44 పై వెళ్లవచ్చునని వివరించారు.
- బెంగుళూరు నుంచి వయా అనంతపురం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లాల్సిన భారీ గూడ్స్ వాహనాలను మామిళ్లపల్లి వద్ద డైవర్షన్ చేశారు. మామిళ్లపల్లి నుండీ కనగానపల్లి, నూతిమడుగు, కళ్యాణదుర్గం, అనంతపురం మీదుగా జాతీయ రహదారి-44 మీదుగా వెళ్లాలి
- హైదరాబాద్ నుంచి వయా అనంతపురం మీదుగా బెంగుళూరు వైపు వెళ్లాల్సిన భారీ గూడ్స్ వాహనాలకు అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి జాతీయ రహదారి-44 వద్ద రాకపోకలు మళ్లించారు. సోములదొడ్డి, తడకలేరు, గుత్తిరోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, బుక్కరాయసముద్రం, నార్పల, బత్తలపల్లి, ధర్మవరం, మామిళ్లపల్లిల మీదుగా వెళ్లాలి
- చెన్నై, కదిరి వైపు నుంచి వయా ఫంగల్ రోడ్డు మీదుగా జాతీయ రహదారి-44 పై హైదరాబాద్ వెళ్లాల్సిన భారీ గూడ్స్ వాహనాలు బత్తలపల్లి వద్ద మళ్లించారు. బత్తలపల్లి నుండీ నార్పల, బుక్కరాయసముద్రం, ఎన్టీఆర్ మార్గ్, గుత్తిరోడ్డు, తడకలేరు, సోములదొడ్డి వద్ద జాతీయ రహదారి-44 మీదుగా వెళ్లాలి
* హైదరాబాద్ నుండీ వయా అనంతపురం మీదుగా కదిరి, చెన్నై వైపు వెళ్లాల్సిన భారీ గూడ్స్ వాహనాలు సోములదొడ్డి వద్ద డైవర్షన్ చేశారు. సోములదొడ్డి నుండీ తడకలేరు, గుత్తిరోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, బుక్కరాయసముద్రం, నార్పల, బత్తలపల్లిల మీదుగా వెళ్లాలి
- భారీ గూడ్స్ వాహనాలు మినహా మిగితా అన్ని రకాల వాహనాలు యథావిధిగా అనంతపురం మీదుగా హైవే-44 పై వెళ్లవచ్చు
- ప్రజలు, వాహనదారులు అసౌకర్యానికి గురికాకుండా మళ్లింపు ఆంక్షలు భారీ గూడ్స్ వాహనాలకు మాత్రమే పరిమితం చేశారు. ప్రజలు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.





















