TTD News: నేటి నుంచి తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు.. షెడ్యూల్ ఇదే.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
నవంబరు 26, 27వ తేదీల్లో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తిరుమల శ్రీ వరాహ స్వామి వారి ఆలయ విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహా సంప్రోక్షణ వైదిక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనుంది టీటీడీ. నేటి నుండి 29వ తేదీ వరకు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి మహాసంప్రోక్షణ కార్యక్రమానికి ఆగమ పండితులు అంకురార్పణ చేపట్టారు. శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూసిన రాగి రేకులు అమర్చేందుకు 2020, డిసెంబరు 6 నుండి 10వ తేదీ వరకు బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. అప్పట్లో ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల తరహాలో అత్తి చెక్కతో విగ్రహాలను ఏర్పాటు చేశారు. స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తున్నారు.
విమాన గోపురం పనులు పూర్తి కావడంతో జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం రాత్రి 7.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ విష్వక్సేనుల వారిని శ్రీవారి ఆలయం నుండి ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేసి మృత్సంగ్రహణం నిర్వహించారు. రాత్రి 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయంలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు. ఇవాళ ఉదయం 7 నుండి 10 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు కళాకర్షణ, ప్రబంధ పారాయణం, వేదపారాయణం చేపడతారు.
నవంబరు 26, 27వ తేదీల్లో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా, నవంబరు 27వ తేదీన శ్రీ వరాహస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. నవంబరు 28వ తేదీన ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు మహాశాంతి పూర్ణాహుతి, మహాశాంతి తిరుమంజనం చేపడతారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, శయనాధివాసం నిర్వహిస్తారు. నవంబరు 29న ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయంలో పూర్ణాహుతి, ప్రబంధ శాత్తుమొర, వేద శాత్తుమొర నిర్వహిస్తారు. ఉదయం 9.15 నుండి 9.30 గంటల వరకు ధనుర్ లగ్నంలో అష్టబంధన మహాసంప్రోక్షణ జరుగనుంది. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తి ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామి పరిపూర్ణానంద, తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, టీడీపీ ఈస్ట్ గోదావరి
ఎమ్మెల్యే జోగేశ్వరరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా... ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోందని, లాభాల బాట పట్టించేలా చేయాలనీ స్వామి వారిని ప్రార్ధించానన్నారు. టీఎస్ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని తెలిపారు.
స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ.. సింధూ రాజపురంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కోసం తిరుపతికి రావడం జరిగిందన్నారు. రాయలసీమ ప్రస్తుత పరిస్థితుల్లో జలసీమగా మారిందని చెప్పారు. చాలా మంది ఆకలితో అలమటిస్తూన్నారని, మరికొందరు ఆరోగ్యం బాగోలేక మందుల కోసం ఎదురు చూస్తూ దీనస్థితిలో ఉన్నారంటూ తెలిపారు.
Also Read: Raja Rajeshwari Temple: రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: 1008 రకాల కూరగాయలు ఉన్నాయా... ఇప్పటి వరకూ తిన్నారా ఎవరైనా...!
Also Read: సంపాదన పెరగాలన్నా, వచ్చింది నిలవాలన్నా ఇలా చేస్తే మంచిదట...
Also Read: సంపాదన పెరగాలన్నా, వచ్చింది నిలవాలన్నా ఇలా చేస్తే మంచిదట...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి