By: ABP Desam | Updated at : 14 Dec 2021 03:45 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి శనివారం సమావేశం అయింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన సమావేశంలో మొత్తం 57 అంశాలపై చర్చించారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలను ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించారు. జనవరి 13న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు సడలిస్తే సంక్రాంతి తరువాత సర్వదర్శనం పెంపు, ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామన్నారు. టీటీడీ నిర్మించిన చిన్నపిల్లల ఆసుపత్రిలో 11 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె శస్ర్త చికిత్స చేశారన్నారు. చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం కల్పిస్తామన్నారు. 500 ఉదయాస్తమాన సేవా టిక్కెట్లను భక్తులకు కేటాయిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Also Read: మాస్క్ లేని వారిని రానిస్తే వ్యాపార సంస్థల మూసివేత..ఏపీ ప్రభుత్వ కొత్త కోవిడ్ రూల్స్ !
చిన్న పిల్లల ఆసుపత్రికి బోర్డు సభ్యులు కూడా విరాళాలు అందించేందుకు అంగీకరించారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. హనుమంతుడి జన్మస్థలమైనా అంజనాద్రి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. నాదనీరాజనం మండపం వద్ద శాశ్వత ప్రాతిపాదికన మండపాన్ని నిర్మిస్తామన్నారు. భక్తులు సౌకర్యార్థం అన్నమయ్య నడకమార్గాన్ని రోడ్డు మార్గంగా అభివృద్ధి చేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. హిందూ ధర్మప్రచారంలో భాగంగా ప్రతి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టనున్నారు. వర్షం కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద కొట్టుకుపోయిన ఆలయాలను తిరిగి పునః నిర్మిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Also Read: జగన్ హామీ నెరవేరలేదు.. పైగా జైలు పాలయింది..! టీటీడీ పారిశుద్ధ్య కార్మికులు రాధ దీన స్థితి...
వెనుకబడిన ప్రాంతాల భక్తులకు ఉచిత దర్శనం
టీటీడీ ఐటీ విభాగాన్ని పటిష్టవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగ నియామకాలు చేపడతాం. రూ.2.6 కోట్ల వ్యయంతో నూతన పరకామణి మండపంలో యంత్రాలు కొనుగోలు చేస్తాం. శ్రీశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టనున్నాం. తాళ్లపత్ర కందిరీగలను పరిరక్షించడానికి యస్వీ వేద విద్యాలయంలో మ్యాన్యు స్ర్కిప్ట్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నాం. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శనాలు కల్పిస్తాం. భక్తులకు శ్రీవారి నామ కోటి పుస్తకాలను అందిస్తాం. కళ్యాణకట్ట క్షురకులకు ఇచ్చే రేటును 11 నుంచి 15 రూపాయలకు పెంచాం. రూ.3 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు చేస్తాం. రూ.10 కోట్ల వ్యయంతో స్విమ్స్ లో భవనాలు, రూ.12 కోట్ల వ్యయంతో మహిళా యూనివర్సిటీలో హాస్టల్ భవనాలు నిర్మాణం చేపడతాం' అని టీటీడీ పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
Also Read: సమ్మె చేస్తున్న కార్మికుల సంగతి తేల్చేస్తారా? టీటీడీ పాలకమండలి భేటీపై అందరి దృష్టి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Breaking News Live Telugu Updates: టర్కీలో భారీ భూకంపం, పేకమేడల్లా కూలుతున్న భవనాలు
Tirumala News: శ్రీవారి దర్శనానికి వీరికి 24 గంటల టైం, ఈ టోకెన్లు ఉంటే చాలా త్వరగా
Weather Latest Update: నేడు ఈ 13 జిల్లాల్లో అధిక చలి! ఏపీలో వాతావరణం ఎలా ఉంటుందంటే
AP SI Hall Tickets: ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?
DMHO Recruitment: కృష్ణా జిల్లా, డీఎంహెచ్‌వోలో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!
Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్
BRS Chief KCR : దేశమంతా గులాబీ జెండా ఎగరాలి, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటు - కేసీఆర్
Jr NTR: అప్డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!
Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్