Tirumala : సమ్మె చేస్తున్న కార్మికుల సంగతి తేల్చేస్తారా? టీటీడీ పాలకమండలి భేటీపై అందరి దృష్టి
తిరుమలలో కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ఉద్యోగుల సమస్యకు పరిష్కారం లభిస్తుందా.. ఇవాళ జరిగే టీటీడీ పాలక మండలి సమావేశంలో ఏం తేల్చనున్నారు.
![Tirumala : సమ్మె చేస్తున్న కార్మికుల సంగతి తేల్చేస్తారా? టీటీడీ పాలకమండలి భేటీపై అందరి దృష్టి A Meeting Of The Governing Body Of The Tirumala Tirupati Temple Will Be Held Today In Tirumala Tirumala : సమ్మె చేస్తున్న కార్మికుల సంగతి తేల్చేస్తారా? టీటీడీ పాలకమండలి భేటీపై అందరి దృష్టి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/22/21d097a83bea806a849b71c0869f26fe_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ఇవాళ సమావేశం కానుంది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్యక్షతన.. అన్నమయ్య భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మొత్తం 57 అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది.
టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షన జరిగే ఈ పాలక మండలి భేటీలో చర్చించే అంశాల్లో ప్రధానంగా ఎఫ్‌ఎంఎస్ కార్మికుల సమస్యలపై చర్చిస్తారని తెలుస్తోంది. టీటీడీలో అవుట్ సోర్సింగ్ ద్వారా సేవలందిస్తున్న మూడు ప్రైవేటు సంస్థలలో రెండు సంస్థల ఒప్పందం టీటీడీ పొడిగించలేదు. దీంతో వాటిలోని కార్మికులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో వారు ఆందోళనబాట పట్టారు. సీఎం జగన్‌ను కలిసి కూడా తమ ఆవేదన వ్యక్తం చేసుకున్నారీ కార్మికులు. న్యాయం చేస్తాని ఇటీవలే తిరుపతిలో పర్యటించిన సీఎం వాళ్లకు హామీ ఇచ్చారు.
కళ్యాణకట్టలో పని చేసే పీస్ రేట్ అంశంతోపాటుగా, ఆభరణాల్లో స్టోన్స్ రీ ప్లేస్మెంట్ అంశంపై కూడా చర్చించనున్నారు. తిరుమలలో సామాన్య భక్తులు బస చేసే వసతి గదులు మరమ్మత్తులు, గీజర్లు ఏర్పాటు అంశం ప్రస్తావనకు రానుంది.
మరో మూడేళ్ళ పాటు తిరుమలలోని ఏపి టూరిజానికి సందీప్ హోటల్ లీజ్ పెంచేం అంశాన్ని పరిశీలించనున్నారు. టిటిడి ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.. వైకుంఠ ఏర్పాట్లపై పాలక మండలిలో కీలక చర్చలు కొనసాగే అవకాశం ఉంది.
Also Read: జగన్ హామీ నెరవేరలేదు.. పైగా జైలు పాలయింది..! టీటీడీ పారిశుద్ధ్య కార్మికులు రాధ దీన స్థితి...
Also Read: కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ .. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
Also Read: మాస్క్ లేని వారిని రానిస్తే వ్యాపార సంస్థల మూసివేత..ఏపీ ప్రభుత్వ కొత్త కోవిడ్ రూల్స్ !
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)