అన్వేషించండి

TTD Employees: ఇంటి దొంగలపై టీటీడీ కొరడా.. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణంలో ఆరుగురిపై వేటు

శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణంపై చర్యలు చేపట్టిన టీటీడీ..సేవా టిక్కెట్ల అవకతవకల్లో ప్రమేయం ఉన్న ఇంటి దొంగలపై టీటీడీ కొరడా ఝలిపించింది. ఆరుగురిపై వేటు వేసింది.

తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం విదేశాల నుండి భక్తులు వస్తుంటారు. క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దర్శనం కోసం భక్తులు పరితప్పించి పోతుంటారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని  దర్శించుకోవడానికి తిరుమలలో సర్వదర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేకు దర్శనం ద్వారా దర్శించుకునే భాగ్యం లభిస్తోంది. వీరిలో వీఐపీ బ్రేక్ దర్శనం మినహా మిగిలిన భక్తులకు స్వామి వారిని దర్శించుకునే భాగ్యం లభించేది ఆరు సెకండ్లు నుంచి పన్నెండు సెకండ్లు మాత్రమే కాగా శని, ఆదివారాలు మినహా స్వామి వారికి నిత్యం ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. సేవా సమయంలో స్వామి వారిని అరగంట నుంచి గంట సమయం పాటు ఎలాంటి ఆటంకాల లేకుండా శ్రీవారిని దర్శించుకునే భాగ్యం ఆర్జిత సేవా భక్తులకు లభిస్తుంది. ఇంతటి భాగ్యం లభించడంతో దేశంలో మరే ఇతర దేవాలయాల్లో లేనంత డిమాండ్ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లకు లభించింది. 

2070 వరకూ బల్క్ బుకింగ్ 

ఒకానొక్క సమయంలో తిరుమలకు వచ్చిన భక్తులకు అప్పటికప్పుడు టికెట్లు జారీ చేసిన టీటీడీ.. అటు తర్వాత భక్తుల రద్దీ పెరగడంతో టిక్కెట్ల జారీ విధానంలో మార్పులు తెచ్చి అడ్వాన్స్ రిజర్వేషన్ పద్ధతిలో 90 రోజుల ముందుగా రిజర్వ్ చేసుకునే పద్దతిని ప్రవేశ పెట్టింది. ఈ విధానంలో టీటీడీ సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శించి భక్తుల పంపిన డీడీలను తమ సొంతానికి వాడుకోవడం మొదలు పెట్టిన విషయం వెలుగులోకి రావడంతో ఆర్జిత విభాగాన్ని టీటీడీ కంప్యూటరీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ లైన్, అడ్వాన్స్ రిజర్వేషన్, కరెంటు బుకింగ్ ద్వారా సేవా టికెట్ల విక్రయాన్ని ప్రారంభించింది. అయితే అప్పటి వరకూ భక్తులే స్వయంగా తమకు అవసరమైన సేవా టికెట్లను అన్ లైన్, అడ్వాన్స్ రిజర్వేషన్ పద్ధతిలో పొందేవారు. 2004 నుంచి ఆర్జితంలో బల్క్ బుకింగ్ ప్రారంభమైంది. దీంతో టిక్కెట్ల జారీలోని లొసుగులను సొమ్ము చేసుకోవాలనుకున్న ఇంటి దొంగలు ఒకే వ్యక్తి,ఒకే కుటుంబానికి చెందిన వారిపై బల్క్ బుకింగ్ ప్రారంభించారు. సుప్రభాతం, అర్చన, తోమాల, అభిషేకం,వస్త్రం సేవలను కుప్పలు తెప్పలుగా సంపన్నులకు జారీ చేశారు టీటీడీ సిబ్బంది. ఇందులో ఉస్మానాబాద్ కు చెందిన కటికర్ అనే వ్యక్తికి 30 వేల సేవా టికెట్లను కేటాయించారంటే బల్క్ బుకింగ్ ఏ స్ధాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. 2010 లెక్కల ప్రకారం అర్జితం విభాగంలో  సుప్రభాతం, అర్చన, తోమాల సేవా టికెట్లు 2030 వరకూ శుక్రవారం జరిగే అభిషేకం టికెట్లు 2056వ సంవత్సరం వరకూ వస్త్రం సేవా టికెట్లు 2070 వరకూ బల్క్ బుకింగ్ ద్వారా రిజర్వు చేయించారు. అయితే 2008వ సంవత్సరం అక్టోబర్ నెలలో టీటీడీ విక్రయించిన వస్త్రం టిక్కెట్ల కంటే అదనంగా భక్తులు రావడంతో తొలిసారిగా ఆర్జిత లీలలు బయటకు వచ్చాయి.

భక్తుడు రిజర్వు చేసుకున్న టిక్కెట్టు తిరస్కరించినట్లు సమాచారం అందించిన ఆర్జిత సేవ సిబ్బంది వాటిని మరోకరికి అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు టీటీడీ విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది. అటెండర్ నుంచి పర్యవేక్షకుడి స్థాయి అధికారి వరకు ఈ కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు స్పష్టంగా తేలింది. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు విజిలెన్స్ అధికారులు యాజమాన్యానికి నివేదిక అందించడంతో టీటీడీ యాజమాన్యం 6 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇంతటితో ఈ కేసు ముగిసిందని టీటీడీ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

రెండు టిక్కెట్లు 70 వేల రూపాయలకు
2010 మే నెలలో 1500 రూపాయల విలువ చేసే రెండు అభిషేకం టిక్కెట్లను ఓ వ్యక్తి 70 వేల రూపాయలకు విక్రయించడంతో ఆర్జిత విభాగం ఆక్రమాలు మళ్లీ వెలుగు చూశాయి. ఈ ఘటనపై అప్పటి ఈవో ఐ.వై.ఆర్.కృష్ణారావు విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఆర్జిత సేవ టిక్కెట్ల కుంభకోణంపై నివేదిక సమర్పించాలని కోరారు. దీంతో విచారణ చేపట్టిన విజిలెన్స్ విభాగం ఈవోకు ప్రాథమిక నివేదిక సమర్పించగా... నివేదికను పరిశీలించిన ఈవో టిక్కెట్ల బుకింగ్ లో భారీ కుంభకోణం జరిగినట్లు నిర్ధారణకు వచ్చి ప్రభుత్వ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగానికి కేసును బదిలీ చేశారు. అప్పట్లో ఈ విషయం టీటీడీలో సంచలనం రేపింది. ఈ కేసు విషయంమై  విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగానికి చీఫ్ గా భాధ్యతలు నిర్వర్తిస్తున్న మాజీ డీజీపీ దినేష్ రెడ్డి నేతృత్వంలో ఓ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం టీటీడీలోని రికార్డులను పరిశీలించింది. 

సీఐడీ రంగంలోకి..
ఆర్జిత విభాగంతో పాటు సిఫార్సు ఉత్తరాలతో బల్క్ గా సేవా టిక్కెట్లను పొందిన వారిని విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సంచలన నివేదికను ప్రభుత్వానికి, టీటీడీకి సమర్పించింది. ఆర్జిత సేవ టిక్కెట్ల కుంభకోణం కేసులో 2004 నుంచి 2010 వరకూ టీటీడీ పాలకమండలి సభ్యులుగా పనిచేసిన వారితో సహా టీటీడీ ఉద్యోగులలో 56 మంది ప్రమేయం ఉందని టీటీడీకి నివేదికను ఇచ్చారు.. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అందజేసిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య, టీటీడీ యాజమాన్యం నిందితులపై కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకొని, ఆ మేరకు తిరుమల టూటౌన్ పోలీసులకు అప్పటి అలయ డిప్యూటీ ఈవో గోపాలక్రిష్ణ 13 మందిపై ఫిర్యాదు చేశారు. టీటీడీ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్న సమయంలో ప్రభుత్వం కేసును సీఐడీకి బదిలీ చేసింది. కేసు సీఐడీకి బదిలీ కావడంతో తిరుమల పోలీసులు ప్రేక్షకపాత్ర వహించే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగ్గిన సీఐడీ అధికారులు తిరుమలలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం పరిశీలించిన రికార్డులను తిరిగి పరిశీలించి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఇచ్చిన నివేదికనే ప్రభుత్వానికి, టీటీడీ యాజమాన్యానికి సమర్పించింది.

ఆర్జిత సేవ టిక్కెట్ల కుంభకోణం తెరపైకి

ఆర్జిత సేవ కుంభకోణంలో దర్యాప్తు అంశాన్ని ప్రక్కన పెట్టిన టీటీడీ అప్పటి వరకు టిక్కెట్లు నమోదు చేసుకునేందుకు ఎలాంటి నియమ నిబంధనలు లేకపోవడం కారణంగా ఇంత భారీ కుంభకోణం చోటు చేసుకుందని నిర్ధారించుకొని ఆ తరువాత కాలంలో సేవా టిక్కెట్ల జారీ విధివిధానాలపై పూర్తి స్థాయిలో సమక్షించి టిక్కెట్లు నమోదు చేసుకునే విధానాలలో మార్పులు చేసింది. బల్క్ బుకింగ్ ను రద్దు చేసి ఒక్క భక్తుడు ఏడాదికి ఒక్క టిక్కెట్టు మాత్రం పొందడానికి అర్హుడని నిబంధనలు పెట్టింది. ఒకటి కంటే ఎక్కువ టిక్కెట్లను పొందిన వారిని రద్దు చేసి సామాన్య భక్తులకు లక్కి డిప్ ద్వారా పొందే ఏర్పాటు చేసింది.  దీంతో సామాన్య భక్తులకు స్వామి వారి ఆర్జిత సేవా టిక్కెట్లను పొందే భాగ్యం దక్కింది. దీంతో ఆ తరువాత ‌కాలంలో ఈ కేసు మాత్రం మరుగున పడిపోయింది. గతేడాది ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఈవో జవహార్ రెడ్డి టీటీడీలో పెండింగ్ లో ఉన్న కేసులపై దృష్టి సారించి పెండింగ్ కేసులన్నీ త్వరగతిన పరిష్కరించాలని సంబంధిత విభాగాధిపతులను ఆదేశాలు జారీ చేశారు.  దీంతో తిరిగి ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణం తెరపైకి వచ్చింది. దీనిపై శాఖాపరమైన విచారణ జరిపించిన ఈవో జవహర్ రెడ్డి ఈ కేసులో ప్రత్యక్షంగా హస్తమున్న ప్రస్తుతం ఉద్యోగులుగా కొనసాగుతున్న ఆరుగురు ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

చర్యలకు రంగం సిద్ధం
ఇందులో ప్రస్తుతం సూపరింటెండెంట్లు హోదాలో వున్న సూర్యనారాయణరెడ్డి, చోడెం మధుసూధన్, సీనియర్ ఆసిస్టెంట్లు హేమాద్రిరెడ్డి, బాలకృష్ణ, జూనియర్ ఆసిస్టెంట్ నారాయణరాజు, అటెండర్ శ్రీనివాసులను సర్వీస్ నుంచి తొలగించగా.. అప్పట్లో ఆర్జిత విభాగంలో ఏఈవోగా విధులు నిర్వర్తించి ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవోగా కోదండరామ స్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న పార్వతి దేవిపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారస్సు చేశారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. ఇక ఈ కేసులో ప్రమేయం ఉన్న రిటైర్డ్ అయినా పలువురు ఉద్యోగులకు అందుతున్న బెనిఫెట్స్ లో కోతను విధించడంతో పాటు పరోక్షంగా ప్రమేయం ఉన్న మరో 40 మంది ఉద్యోగులపై కూడా శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధం చేశారు టీటీడీ అధికారులు. 

Also Read: Tirumala Tirupathi Devastanam: టీటీడీ గోవిందుని గోపథకం...పంచగవ్యాలతో సరికొత్త ఉత్పత్తులు తయారీ...

టాప్ హెడ్ లైన్స్

Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Breaking News: టాక్సిక్ మూవీ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు చేసిన పోలీసులు
టాక్సిక్ మూవీ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు చేసిన పోలీసులు
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Embed widget