అన్వేషించండి

Jagan Bail : రేపు బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పు ఉంటుందా ? ఉండదా ? వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో ఉత్కంఠ !

సెప్టెంబర్ 15న జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్లపై తీర్పు చెబుతామని సీబీఐ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. అయితే కోర్టును మార్చాలని ఎంపీ పిటిషన్ దాఖలు చేయడంతో ఉత్కంఠ నెలకొంది.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై రేపు తీర్పు వస్తుందా లేదా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. గతంలో న్యాయస్థానం ప్రకటించిన దాని ప్రకారం బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో బుధవారం వెల్లడి కావాల్సి ఉంది. అయితే సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పుపై తనకు నమ్మకం లేదని విచారణ వేరే కోర్టుకు మార్చాలని రఘురామకృష్ణరాజు హఠాత్తుగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తీర్పును వాయిదా వేయాలని కోరారు. వైఎస్‌ జగన్‌కు చెందిన  మీడియా సంస్థల్లో తీర్పు గురించి గతంలో ముందుగానే చెప్పారని ఇలా చేయడం ద్వారా  తీర్పును ప్రభావితం అవుతుందని  అందుకే వేరే కోర్టుకు బదిలీ చేయాలని కోరినట్లుగా ఆయన చెప్పారు. Also Read : టాలీవుడ్ పెద్దలకు సీఎం జగన్ నుంచి పిలుపు... ఈ నెల 20న చిరంజీవి బృందం భేటీ...

లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది.  తీర్పును హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. బుధవారం హైకోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత ఈ అంశంపై తీర్పు చెప్పే అవకాశం ఉంది. ఆ తర్వాతే సీబీఐ కోర్టు తీర్పులను వెల్లడించే అవకాశం ఉంది. అప్పటి వరకూ సస్పెన్స్ కొనసాగనుంది. ఒక రఘురామకృష్ణరాజు పిటిషన్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినట్లయితే విచారణ కోర్టును హైకోర్టు మార్పు చేస్తుంది. అలా చేయడం వల్ల మళ్లీ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంటుంది. అంటే పిటిషన్‌పై తీర్పు కొత్త కోర్టులోనే వస్తుంది. ఒక వేళ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేస్తే మాత్రం సీబీఐ కోర్టు వెంటనే తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. Also Read : మెగాస్టార్ చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్... ఎందుకంటే..!

జగన్మోహన్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారంటూ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ ముగిసింది. ఆగస్టు 25వ తేదీన తీర్పు చెబుతామని సీబీఐ కోర్టు చెప్పింది.  అయితే ఆ రోజున విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై వాదనలతో సమయం ముగిసిపోవడం, తీర్పు కాపీ ఇంకా రెడీ కాకపోవడంతో రెండు పిటిషన్లపై సెప్టెంబర్ 15వ తేదీన తీర్పు చెబుతామని న్యాయమూర్తి ప్రకటించారు. అటు జగన్మోహన్ రెడ్డి ఇటు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పు ఒకే రోజు రావాల్సి ఉంది.

Also Read : వీళ్ల వేషాలు చూసి ఫ్లాటయితే బుక్కయినట్లే ! ఈ జంట ఎన్ని కోట్లకు జనాల్ని ముంచారో తెలుసా..?

అయితే ప్రస్తుతం రఘురామకృష్ణరాజు జగన్ బెయిల్ రద్దు అంశాన్ని మాత్రమే ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వాయిదా వేయాలని..వేరే కోర్టుకు మార్చాలని పిటిషన్ వేశారు. అంటే విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు చెప్పడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే జగన్ విషయంలో తీర్పు ఆగిపోయినా విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం తీర్పు రావడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. 
Also Read: Revanth Reddy: తెలంగాణలో రేవంత్ రెడ్డి మెగా ప్లాన్! ఇప్పటికే అమల్లోకి.. సక్సెస్ అవుతుందా? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana : తెలంగాణలో రేషన్ కార్డు లేకుండానే ఆరోగ్యశ్రీ సేవలు
తెలంగాణలో రేషన్ కార్డు లేకుండానే ఆరోగ్యశ్రీ సేవలు- రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Free Bus Service: ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం, అధికారిక ప్రకటన
ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం, అధికారిక ప్రకటన
Supreme Court : విద్యుత్ కమిషన్‌పై కేసీఆర్‌కు  స్వల్ప ఊరట - జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశం
విద్యుత్ కమిషన్‌పై కేసీఆర్‌కు స్వల్ప ఊరట - జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశం
War 2 Shooting: హైదరాబాద్‌లో 'వార్‌ 2' షూటింగ్‌ - యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్‌!
హైదరాబాద్‌లో 'వార్‌ 2' షూటింగ్‌ - యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్‌!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PCB Threatened BCCI Regarding 2025 Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ సస్పెన్స్‌లో కొత్త అప్‌డేట్ | ABP Desamటీ20ల్లో ఓపెనర్లుగా ఈ నలుగురిలో ఎవరికి ఛాన్స్ | ABP DesamAnant Ambani gifts 2Cr Worth Watches |పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ కి కళ్లు చెదిరే గిఫ్టులిచ్చిన అంబానీVizianagaram Fort Lesser Known Story | దేశానికి ఆఖరి కోటగా చెప్పే విజయనగరం కోటపై ఆసక్తికర విషయాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana : తెలంగాణలో రేషన్ కార్డు లేకుండానే ఆరోగ్యశ్రీ సేవలు
తెలంగాణలో రేషన్ కార్డు లేకుండానే ఆరోగ్యశ్రీ సేవలు- రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Free Bus Service: ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం, అధికారిక ప్రకటన
ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం, అధికారిక ప్రకటన
Supreme Court : విద్యుత్ కమిషన్‌పై కేసీఆర్‌కు  స్వల్ప ఊరట - జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశం
విద్యుత్ కమిషన్‌పై కేసీఆర్‌కు స్వల్ప ఊరట - జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశం
War 2 Shooting: హైదరాబాద్‌లో 'వార్‌ 2' షూటింగ్‌ - యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్‌!
హైదరాబాద్‌లో 'వార్‌ 2' షూటింగ్‌ - యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్‌!
Anganwadi Workers: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలపై కీలక ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలపై కీలక ఆదేశాలు
Rakshit Shetty: కన్నడ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదు - పర్మిషన్ లేకుండా ఆ పనిచేశాడంటూ ఆరోపణలు
కన్నడ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదు - పర్మిషన్ లేకుండా ఆ పనిచేశాడంటూ ఆరోపణలు
Samantha: ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నా-  విడాకులపై సమంత షాకింగ్ కామెంట్స్
ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నా- విడాకులపై సమంత షాకింగ్ కామెంట్స్
Allu Arjun: అట్లీ అవుట్‌, అల్లు అర్జున్‌ని కలిసిన మరో స్టార్‌ డైరెక్టర్‌! - ఎవరంటే..! 
అట్లీ అవుట్‌, అల్లు అర్జున్‌ని కలిసిన మరో స్టార్‌ డైరెక్టర్‌! - ఎవరంటే..! 
Embed widget