X

Chandrababu Phone Call: మెగాస్టార్ చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్... ఎందుకంటే..!

టీడీపీ అధినేత చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేశారు. ఇటీవల ప్రమాదంలో గాయపడిన హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

FOLLOW US: 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవికి సోమవారం ఫోన్ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీనటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం మెరుగుపడాలని చంద్రబాబు ఆకాంక్షించారు. హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

Also Read: Tollywood: టాలీవుడ్ పెద్దలకు సీఎం జగన్ నుంచి పిలుపు... ఈ నెల 20న చిరంజీవి బృందం భేటీ... చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చ

నిలకడగా సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం

హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం హెల్త్‌ బులిటెన్‌ను విడుదలచేశారు. సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. వెంటిలేటర్‌ అవసరం క్రమంగా తగ్గుతోందన్నారు. ప్రస్తుతానికి ఐసీయూలోనే ఉండి అతడికి చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌ లో పేర్కొన్నాయి. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయి ధరమ్ తేజ్‌ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. హైదరాబాద్​లోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మెడికవర్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం సాయి ధరమ్ తేజ్ ను అపోలో ఆసుపత్రికి తరలించారు. 

Also Read: Chaitanya Thanks Sam: సమంతకు థాంక్స్ చెప్పిన చైతూ.. ఇప్పటికైనా మీకు అర్థమవుతోందా..!

అపోలో కృష్ణంరాజు

సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకుని సినీ ప్రముఖులు...ఆయన్ను పరామర్శించేందుకు హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి వెళ్తున్నారు. మంగళవారం ప్రముఖ నటుడు కృష్ణంరాజు అపోలో ఆసుపత్రికి వచ్చారు. సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై కృష్ణంరాజు చర్చించారు. త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని కృష్ణంరాజు తెలిపారు. త్వరలో యూకే వెళ్లాల్సి ఉన్నందున రొటీన్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి అపోలోకి వచ్చినట్లు కృష్ణంరాజు కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

Also Read: Drushyam2 Release Date: దృశ్యం2 ఓటీటీకే వస్తుందా? విడుదల ఎప్పుడు?

Also Read: Shriya Saran: శ్రీవారిని దర్శించుకున్న శ్రియ.. ముద్దుపెట్టి ప్రేమను వ్యక్తం చేసిన భర్త

Tags: chiranjeevi Chandrababu Sai Dharam Tej Sai Dharam Tej Accident apollo chandrababu phone call

సంబంధిత కథనాలు

Covid 19 Vaccine For Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై అపోలో శుభవార్త.. వారికి ఉచితంగా టీకాలపై ప్రకటన

Covid 19 Vaccine For Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై అపోలో శుభవార్త.. వారికి ఉచితంగా టీకాలపై ప్రకటన

Anantapur: తల్లి మృతదేహంతో తహసీల్దారు కార్యాలయంలో ఆందోళన... పాసుపుస్తకం రాలేదని మనస్తాపంతో మహిళా రైతు మృతి..!

Anantapur: తల్లి మృతదేహంతో తహసీల్దారు కార్యాలయంలో ఆందోళన... పాసుపుస్తకం రాలేదని మనస్తాపంతో మహిళా రైతు మృతి..!

Breaking News Live Updates: హుజూరాబాద్ ఉప ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

Breaking News Live Updates: హుజూరాబాద్ ఉప ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Huzurabad by poll: ఈటల గెలిచినా మంత్రి అయ్యేది లేదు... ధరలు పెంచిన బీజేపీని ఎందుకు గెలిపించాలి.... మంత్రి హరీశ్ రావు కామెంట్స్

Huzurabad by poll: ఈటల గెలిచినా మంత్రి అయ్యేది లేదు... ధరలు పెంచిన బీజేపీని ఎందుకు గెలిపించాలి.... మంత్రి హరీశ్ రావు కామెంట్స్
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!

Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Beating the Groom: వరుడిని చితకొట్టాలి.. వధువుపై ఉమ్మేయాలి.. ఎట్టెట్టా? ఇది వాళ్ల ఆచారమట!

Beating the Groom: వరుడిని చితకొట్టాలి.. వధువుపై ఉమ్మేయాలి.. ఎట్టెట్టా? ఇది వాళ్ల ఆచారమట!

Sleeping Bus: ఫుడ్ పెట్టి జోల పాడే ‘స్లీపింగ్ బస్సు’, కుంభకర్ణులకే ప్రత్యేకం... ప్రపంచంలోనే తొలి సర్వీసు

Sleeping Bus: ఫుడ్ పెట్టి జోల పాడే ‘స్లీపింగ్ బస్సు’, కుంభకర్ణులకే ప్రత్యేకం... ప్రపంచంలోనే తొలి సర్వీసు