అన్వేషించండి

Somu Veerraju BJP : కేంద్ర పథకాలకు ఇంకెన్నాళ్లు స్టిక్కర్లు వేస్తారు ? - సీఎం జగన్‌కు సోము వీర్రాజు బహింగ లేఖ

ఏపీ సీఎం జగన్‌కు సోము వీర్రాజు బహిరంగ లేఖరాశారు. కేంద్ర పథకాలకు వైసీపీ స్టికర్లు వేయడం ఏమిటని ప్రశ్నించారు.


Somu Veerraju BJP : కేంద్ర ప‌థ‌కాల‌కు మీ స్టిక్క‌ర్లు , రంగులు ఏంటీ .అంటూ జ‌గ‌న్ పై బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు మండిప‌డ్డారు.. ఈ మేర‌కు తాజాగా సోము సీఎం జగన్ కు మరో లేఖ రాశారు. కేంద్ర పథకాలపై మీ స్టిక్కర్లు ఏంటి? అంటూ సీఎం జగన్ ను నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పథకంపై రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ ఎలా అంటిస్తారని ప్రశ్నించారు. బియ్యం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం అయితే, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు ఏపీ ప్రభుత్వం స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఉచిత బియ్యం అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని రేషన్ బియ్యం వాహనాలపై ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని సోము డిమాండ్ చేశారు. కేంద్ర పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మార్గదర్శకాలు అమలు చేయాలని కోరారు..

 

 

ఏపీ పథకాలన్నీ కేంద్ర నిధులేనని బీజేపీ వాదన           

కేంద్రం ఏపీ ప్రభుత్వానికి కావాల్సినన్ని  నిధులు ఇస్తున్నప్పటికీ.. ఏమీ ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు కొంత కాలంగా ఆరోపిస్తున్నారు.   సీఎం బటన్‌ నొక్కే పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలేనని.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులా ఈ పథకాలు ప్రజల ముందుకు దూసుకొస్తున్నాయని చెబుతున్నారు.  కానీ, ప్రధాని మోదీ గొప్పతనం ప్రజలకు తెలియకూడదనే దుర్బుద్ధితో సీఎం తన స్టిక్కర్‌ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.   రాష్ట్రంలో 2.26 కోట్ల మందికి రేషన్‌ బియ్యం అందిస్తున్నామని చెబుతున్నారు.  

పథకాల పేర్ల విషయంలో కేంద్ర మార్గదర్శకాలు అమలు చేయాలంటున్న బీజేపీ  

రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని- కేంద్ర పథకాల విషయంలో మార్గదర్శకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. సీఎంకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో మాతృభాషకు పెద్దపీట వేస్తే... రాష్ట్రంలో మాత్రం పిల్లలకు ఆంగ్లం చెప్పించేందుకు ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి శిక్షణ ఇప్పిస్తామంటున్నారన్నారు. పాలనను సేవ బాధ్యతగా ప్రధాని మోదీ భావిస్తున్నారని చెప్పారు. బీజేపీ ఒక వ్యక్తికి మేలు చేయడానికి పని చేయదని.. దేశానికి, సమాజానికి మేలు చేయడాన్ని బాధ్యతగా భావిస్తుందని తెలిపారు. 

ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు నిధులు దుర్వినియోగం చేస్తున్నాయన్న బీజేపీ                

ఏపీలోని గత-ప్రస్తుత ప్రభుత్వాలు కేంద్ర నిధులను దుర్వినియోగం చేశాయన్నారు సోము వీర్రాజు. ఏపీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయమని స్పష్టం చేశారు. నాడు-నేడు పేరుతో జరిగే పనులు.. జగనన్న కిట్లల్లో భాగంగా ఇచ్చే యూనిఫారాలన్నీ కేంద్ర నిధులే అని తేల్చి చెప్పారు. ఏపీలో జగన్ ప్రభుత్వం డబ్బింగ్ ప్రభుత్వంగా చెబుతున్నారు  సోము వీర్రాజు.

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల  వద్ద భారీగా పోలీసులు
కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు
Anantapuram News: సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
SpadeX: అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ - ఇస్రో మరో ఘనత, నాలుగో దేశంగా భారత్
అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ - ఇస్రో మరో ఘనత, నాలుగో దేశంగా భారత్
Nimmala Ramanaidu : సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి - సామాన్య రైతులా పొలం పనులు, వ్యవసాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి అని వెల్లడి
సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి - సామాన్య రైతులా పొలం పనులు, వ్యవసాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి అని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Saif Ali Khan | బాలీవుడ్ బడా హీరోలు టార్గెట్ గా హత్యాయత్నాలు | ABP DesamISRO SpaDEX Docking Successful | అంతరిక్షంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఇస్రో ఉపగ్రహాలు | ABP DesamKTR Attended ED Enquiry | ఫార్మూలా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్ | ABP DesamAttack on Saif Ali khan | సైఫ్ అలీఖాన్ పై కత్తిదాడి..తీవ్రగాయాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల  వద్ద భారీగా పోలీసులు
కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు
Anantapuram News: సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
SpadeX: అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ - ఇస్రో మరో ఘనత, నాలుగో దేశంగా భారత్
అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ - ఇస్రో మరో ఘనత, నాలుగో దేశంగా భారత్
Nimmala Ramanaidu : సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి - సామాన్య రైతులా పొలం పనులు, వ్యవసాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి అని వెల్లడి
సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి - సామాన్య రైతులా పొలం పనులు, వ్యవసాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి అని వెల్లడి
KTR: 'కాంగ్రెస్ పెడుతున్న కేసులు మా ఘనతను తుడిచేయలేవు' - ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్
'కాంగ్రెస్ పెడుతున్న కేసులు మా ఘనతను తుడిచేయలేవు' - ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్
Saif Ali Khan Injured: 'దేవర' విలన్ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి... బలమైన కత్తిపోట్లు, తీవ్ర గాయాలతో ఆసుపత్రికి
'దేవర' విలన్ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి... బలమైన కత్తిపోట్లు, తీవ్ర గాయాలతో ఆసుపత్రికి
Congress Arrests: బెయిలబుల్ సెక్షన్లతో బీఆర్ఎస్ నేతల అరెస్టులు - వెంటనే బెయిల్ - వ్యూహాత్మకమేనా ?
బెయిలబుల్ సెక్షన్లతో బీఆర్ఎస్ నేతల అరెస్టులు - వెంటనే బెయిల్ - వ్యూహాత్మకమేనా ?
Crime News: ప్రేమజంట పారిపోయేందుకు సాయం! - మహిళను వివస్త్రను చేసి జుట్టు కత్తిరించేశారు, సత్యసాయి జిల్లాలో అమానవీయం
ప్రేమజంట పారిపోయేందుకు సాయం! - మహిళను వివస్త్రను చేసి జుట్టు కత్తిరించేశారు, సత్యసాయి జిల్లాలో అమానవీయం
Embed widget