అన్వేషించండి

Satyavedu Constituency: సత్యవేడును సాధించేది ఎవరు ? ఇటు జంపింగ్, అటు రెబల్ - వైసీపీ కొత్త ప్రయోగం

Satyavedu AP Elections 2024: ఏపీ, తమిళనాడు సరిహద్దులో ఉన్న సత్యవేడు నియోజకవర్గంలో ఎవరు నెగ్గనున్నారు అని ఓటర్లు సైతం ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.

Satyavedu Assembly constituency: సత్యనేడు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దులో ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. సత్యవేడు నియోజకవర్గంలో సత్యవేడు, వరదయ్యపాలెం, బుచ్చినాయుడు కండ్రిగ, పిచ్చాటూరు, నిండ్ర, నారాయణవనం, నాగలాపురం, కేవీబీ పురం మండలాలు ఉన్నాయి.
2014లో టీడీపీది విజయం, 2019లో వైసీపీ సక్సెస్
2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొనేటి ఆదిమూలంపై టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య తారా చంద్రకాంత్ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జేడీ రాజశేఖర్ పై వైసీపీ అభ్యర్థి కొనేటి ఆదిమూలం గెలిచారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలంను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆయన వైసీపీ పార్టీపై వ్యతిరేక స్వరం వినిపించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆయన ఆ తరువాత టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ పార్టీ నుంచి కొనేటి ఆదిమూలంను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది.

కొందరు అటు, మరికొందరు ఇటు...
నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారిందని స్థానికంగా వినిపిస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా తాము పార్టీని నమ్ముకుని అనేక ఇబ్బందులు పడ్డామని... వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం టీడీపీ నాయకులు, కార్యకర్తల పై కేసులు ఉంటూ ప్రతి గ్రామంలోని వారిపై ఏదో ఒక కారణంతో కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని... వైసీపీ నుంచి గెలిచే అవకాశం లేకపోవడంతో టీడీపీ లో చేరారరన్నారు. నిన్నటి వరకు ఇబ్బంది పెట్టిన వ్యక్తికి ఎలా పని చేస్తామని పార్టీ క్యాడర్ అంటోంది.  మరోవైపు కొందరు టీడీపీ నాయకులు ఆదిమూలంకు మద్దతుగా నిలుస్తున్నారు.

రెబల్ అభ్యర్థిగా జేడీ రాజశేఖర్
టీడీపీ పార్టీకి మొదట్నుంచీ నుంచి పని చేసి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన టీడీపీ నేత జేడీ రాజశేఖర్ ఈసారి రెబల్ గా మరారు. వైసీపీ పార్టీ ఇబ్బందులు పెట్టిన టీడీపీ పార్టీ తో ఉన్న తనకు కాదని తమపై కేసులు పెట్టిన వ్యక్తికి సీటు ఇవ్వడంతో టీడీపీ రెబల్ అభ్యర్థిగా నియోజకవర్గంలో జేడీ రాజశేఖర్ ప్రచారం సైతం చేస్తున్నారు. ఆయన వెనకంటీ ఉన్న నాయకులు సైతం ఆయనకే మద్దతుగా నిలుస్తున్నారు. ఇక మరో వైపు మాజీ ఎమ్మెల్యే హేమలత తన కుమార్తె హెలెన్ కు సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హెలెన్ ను గత రెండేళ్లు క్రితం టీడీపీ పార్టీ ఇన్చార్జి గా ప్రకటించింది. ఆమె సైతం నియోజకవర్గంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. కొత్తగా ఎన్ఆర్ఐ రాజేష్ పేరు తెర పైకి వచ్చింది. నియోజకవర్గంలో ఆర్ధిక, సామాజిక వర్గం బలం ఉందని.. ఆయన సైతం పోటీలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ పార్టీ కొనేటి ఆదిమూలంకు సీటు అని ప్రకటించినా.. ఇంతవరకు ఆయన బయటకు రాలేదు. పార్టీ అధిష్టానం సైతం నాయకులతో మాట్లాడలేదు. దీంతో ఏం జరుగుతుందో అని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు.

వైసీపీ ముందడుగు...? 
సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ కి వెళ్ళడంతో ఆ స్దానాన్ని కొత్త వ్యక్తికి వైసీపీ కేటాయించింది. తిరుపతి ఎంపీ అభ్యర్థికి సన్నిహితంగా ఉండే నూకతోటి రాజేష్ పేరు ప్రకటించింది. ఈయన పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండగా అనూహ్యంగా ఆయన పేరు రావడం వైసీపీ నాయకులలో సైతం కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో వైసీపీ నాయకుల మధ్య సఖ్యత కుదిరింది. జిల్లాకు చెందిన వైసీపీ పెద్ద నాయకులతో కలిసి ప్రచారం సైతం ప్రారంభించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget