Weather Alert: తెలుగు రాష్ట్రాలకు వానలున్నాయి జాగ్రత్త.. కేరళలో వర్ష బీభత్సం
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో వైపు కేరళలో వర్ష బిభత్సం సృష్టించింది.
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి మర్ధబల్ నుండి తూర్పున బంగాళాఖాతం మీదుగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కేంద్రీకృతమై... ఉపరితల ఆవర్తనం 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల వరకు కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలమైన లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లోని ఒక్కటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) October 17, 2021
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలోనూ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షాలు, పెనుగాలల వల్ల అత్యవసర సేవలకు, జనజీవనానికి ఎటువంటి అవాంతరాలు కలుగకుండా నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలతో సిద్ధంగా ఉండాలని రక్షణ, సహాయక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఎక్కువ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Synoptic features of weather inference for Andhra Pradesh in Telugu Language Dated-17.10.2021. pic.twitter.com/PezC6UmK7X
— MC Amaravati (@AmaravatiMc) October 17, 2021
Observational Data of Andhra Pradesh dated 17.10.2021 pic.twitter.com/IjL3qriamW
— MC Amaravati (@AmaravatiMc) October 17, 2021
భారీ వర్షాలు కేరళలో విధ్వంసం సృష్టించాయి. వేల మందికి నిలువ నీడ లేకుండా అయింది. ఆ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడి మృత్యువాతపడ్డవారి సంఖ్య ఆదివారం నాటికి 26కు పెరిగింది. వీరిలో ఒక్క కొట్టాయం జిల్లా వాసులే 13 మంది ఉన్నారు. ఇడుక్కి జిల్లాలో తొమ్మిది మంది, అలప్పుజలో నలుగురు మృతి చెందారు. కేరళలో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ఫోన్లో మాట్లాడారు. కేరళకు అన్నివిధాలా అండగా ఉంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు.
Also Read: 4 రోజుల్లో రూ.1331 కోట్లు లాభం.. ఆ రెండు టాటా కంపెనీలతో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా సంపద
Also Read: Bank Charges: బ్యాంకు ఛార్జీలతో విసిగిపోయారా! ఇలా చేస్తే తక్కువ రుసుములే పడతాయి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి