అన్వేషించండి

Morning Top 10 News Headlines In Telugu: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసు, కాంగ్రెస్, బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు వంటి మార్నింగ్ న్యూస్

Top 10 Headlines Today: తప్పుడు ప్రచారంతో బుక్కైన వైసీపీ నేతలు, తెలంగాణలో సెంటిమెంట్ మళ్లీ రాజకీయం, సీఎం సీటుపై తెగని మహారాష్ట్ర పంచాయితీ లాంటి టాప్‌ న్యూస్ ఇక్కడ చూడొచ్చు

Morning Top News: 

అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

వైసీపీ సీనియర్ లీడర్‌, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై కేసు నమోదు అయింది.  కొద్ది రోజుల క్రితం ఎర్రావారిపాలెం మండలంలో బాలికపై దాడి జరిగింది. వెంటనే ఆమెపై అత్యాచారం జరిగిందని కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ప్రచారం చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై బాలిక తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు తప్పుడు ప్రచారం చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 వైసీపీ నుంచి జోరుగా  వలసలు

వైఎస్ఆర్‌సీపీకి ఎమ్మెల్సీలు వరుసగా రాజీనామా చేస్తున్నా  వారికి సర్ది చెప్పేందుకు పెద్దగా ఎవరూ ప్రయత్నించడం లేదు. ఏరి కోరి పార్టీలోకి తీసుకు వచ్చిన నేతలు కూడా పదవులకు కూడా రాజీనామాలు చేసి వెళ్తున్నారు. ఈ ట్రెండ్ ఇలా కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా వలసలు ఉంటాయని భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
 రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యాన రైతులకు ఫార్మ్ ఫండ్ స్కీమ్ ద్వారా రూ.75 వేల సబ్సిడీ అందిస్తోంది. ఉద్యాన పంటలు పండించే రైతుల ఖాతాల్లో ఈ పథకం ద్వారా డబ్బులు జమ కానున్నాయి. కరువు పీడిత ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగులో నీటి కొరత సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం ఫార్మ్ ఫండ్ స్కీమ్ ప్రారంభించింది. నీటి లభ్యతను పెంపొందించడం, పంట దిగుబడిని మెరుగుపరచడం, నీటి నిల్వ కోసం ఫామ్ పాండ్‌లను సృష్టించే ఖర్చును సబ్సిడీ చేయడం ద్వారా రైతును ఆర్థికంగా ఆదుకునే లక్ష్యంతో సర్కారు ఈ పథకం రూపొందించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
డిసెంబర్‌ 9 సెంటిమెంట్‌
తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు మొదలయ్యాయి. ఓవైపు దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సిద్ధమవుతుంటే... తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్‌ను ఘనంగా చేసేందుకు రెడీ అవుతోంది. పూర్తి సమాచారాన్ని ఇక్కడచూడండి 
 
మోదీ విశాఖ పర్యటన రద్దు
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దైంది. ఈనెల 29వ తేదీన ఆయన విశాఖకు రావాల్సి ఉండగా.. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పర్యటనను రద్దు చేసినట్లు పీఎంవో వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా అనకాపల్లి పూడిమడకలోని NTPC గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ శంకుస్థాపనతోపాటు కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను ప్రధాని జాతికి అంకితం చేయాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
బీసీల నినాదంతో కవిత రాజకీయం
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణ బీసీ కమిషన్ ను కలిశారు.  ఈ పర్యటనలో ఎక్కడా బీఆర్ఎస్ నేతలు కనిపించలేదు. అలాగే బీఆర్ఎస్ కండువాలు కూడా. తెలంగాణ జాగృతి పేరుతో ఆమె రాజకీయాలు చేస్తున్నారు. జాగృతిలో ఉన్న నేతలే ఆమె వెంట ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆమె చేస్తున్న పోరాటంపై బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంది. ఇదొక్కటే కాదు.. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని కూడా బీఆర్ఎస్ నేతలు లేకుండానే వెళ్లి పరామర్శించి వచ్చారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల  అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీ దృష్ట్యా భారీగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. విశాఖ, శ్రీకాకుళం రోడ్, హైదరాబాద్, కాచిగూడ నుంచి కొల్లం, కొట్టాయంలకు 62 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసులు డిసెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ వివిధ తేదీల్లో విశాఖ, శ్రీకాకుళం నుంచి కొల్లం వరకూ నడవనున్నాయి. వీటిలో విశాఖ - కొల్లం - విశాఖ ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 27 వరకూ 26 సర్వీసులు అందించనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.. 
 
 
ఐపీఎల్ తెలుగు క్రికెటర్ల సత్తా
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్లను అదృష్టం వరించింది. ఏపీకి చెందిన ముగ్గురు క్రికెటర్లను ఫ్రాంచైజీలు వేలంలో తీసుకున్నాయి. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఐపీఎల్ వేలంలో ఏపీకి చెందిన యువకులు సోల్డ్ అయ్యారు. షేక్ రషీద్, పైల అవినాష్, సత్యనారాయణ రాజులను వేలంలో తీసుకోవడంతో ఆ కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
మహారాష్ట్ర సీఎం పదవిపై తెగని పంచాయతీ
మహారాష్ట్రలో ‘మహాయుతి’ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారు అనే సందేహాలు ఇప్పుడు దేశ మంతటా వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఇంకా పంచాయతీ తెగలేదు.  ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్ పవార్.. బీజేపీ పెద్దలతో  మంతనాలు జరుపుతున్నారు. ఈరోజు సీఎంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా పడే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం
 
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. కంగారూలను చిత్తు చేస్తూ చిరస్మరణీయ విజయం సాధించింది. మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన భారత బౌలర్లు... 238 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా 3, సిరాజ్ 3 వికెట్లు తీసి రాణించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Embed widget