అన్వేషించండి

Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి 62 ప్రత్యేక రైళ్లు

SCR: అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి కొట్టాయం, కొల్లాంలకు 62 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

SCR Special Trains To Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల (Sabarimala) అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే భక్తులకు ద.మ రైల్వే (South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీ దృష్ట్యా భారీగా ప్రత్యేక రైళ్లను (Special Trains) నడిపేందుకు సిద్ధమైంది. విశాఖ, శ్రీకాకుళం రోడ్, హైదరాబాద్, కాచిగూడ నుంచి కొల్లం, కొట్టాయంలకు 62 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసులు డిసెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ వివిధ తేదీల్లో విశాఖ, శ్రీకాకుళం నుంచి కొల్లం వరకూ నడవనున్నాయి. వీటిలో విశాఖ - కొల్లం - విశాఖ ప్రత్యేక రైళ్లు (08539/08540) డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 27 వరకూ 26 సర్వీసులు అందించనున్నాయి. 

ప్రత్యేక రైళ్ల వివరాలు

  • విశాఖ - కొల్లం ప్రత్యేక రైలు (నెం. 08539) ప్రతి బుధవారం (డిసెంబర్ 4) ఉదయం 8:20 గంటలకు విశాఖలో బయల్దేరి గురువారం మధ్యాహ్నం 12:55 గంటలకు కొల్లం చేరుకుంటుంది. అలాగే, కొల్లం - విశాఖ రైలు (నెం.08540) డిసెంబర్ 5 నుంచి ఫిబ్రవరి 27 వరకూ ప్రతి గురువారం కొల్లంలో రాత్రి 7:35 గంటలకు బయల్దేరి శుక్రవారం రాత్రి 11:20 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
  • అలాగే, శ్రీకాకుళం రోడ్ - కొల్లం - శ్రీకాకుళం రోడ్ మధ్య 18 సర్వీసులు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటిలో శ్రీకాకుళం రోడ్ - కొల్లం మధ్య డిసెంబర్ 1వ తేదీ నుంచి జనవరి 27 వరకూ ప్రత్యేక రైలు సర్వీసు అందించనుంది. ఈ రైలు (నెం. 08553) ప్రతీ సోమవారం ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌లో బయల్దేరి మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు కొల్లం చేరుకుంటుంది. 
  • తిరుగు ప్రయాణంలో రైలు (నెం.08554) ప్రతి సోమవారం కొల్లంలో సాయంత్రం 4:30 గంటలకు బయల్దేరి.. బుధవారం తెల్లవారుజామున 2:30 గంటలకు శ్రీకాకుళం చేరుకోనుంది.
  • మరోవైపు, కాచిగూడ - కొట్టాయం - కాచిగూడ మధ్య డిసెంబర్ 5 నుంచి 27 వరకూ ప్రతి గురు, శుక్రవారాల్లో ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. కాచిగూడ - కొట్టాయం (07133) రైలు డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో (ప్రతీ గురువారం) మధ్యాహ్నం 3:40 గంటలకు కాచిగూడలో బయల్దేరి శుక్రవారం సాయంత్రం 6:50 గంటలకు కొట్టాయం చేరుకోనుంది.
  • అలాగే, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో (ప్రతీ శుక్రవారం) ప్రత్యేక రైలు (07134) రాత్రి 8:30 గంటలకు కొట్టాయంలో బయల్దేరి శనివారం రాత్రి 11:40 గంటలకు కాచిగూడ చేరుకోనుంది.
  • హైదరాబాద్ - కొట్టాయం - హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 3 నుంచి జనవరి 1 వరకు ప్రతి మంగళ, బుధవారాల్లో రాకపోకలు సాగించనున్నాయి. హైదరాబాద్ - కొట్టాయం (07135) ప్రత్యేక రైలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4:10 గంటలకు కొట్టాయం చేరుకోనుంది.
  • అలాగే, కొట్టాయం - హైదరాబాద్ ప్రత్యేక రైలు (07136) బుధవారం సాయంత్రం 6:10 గంటలకు కొట్టాయంలో బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11:45 గంటలకు హైదరాబాద్ చేరుకోనుంది.

శబరిమలకు పోటెత్తిన భక్తులు

అటు, శబరిమలకు భక్తులు పోటెత్తారు. గతేడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. మండల - మకరవిళక్కు సీజన్‌లో భాగంగా మొదటి 9 రోజుల్లోనే 6 లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారని ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు వెల్లడించింది. ఈ నెల 16న ఆలయం తెరుచుకోగా.. ఇప్పటివరకూ 6,12,290 మంది దర్శించుకున్నట్లు తెలిపింది. శనివారం వరకూ రూ.41.64 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయని పేర్కొంది. మరోవైపు, భక్తుల కోసం వసతులు కల్పిస్తున్నామని అధికారులు వెల్లడించారు. వండిపెరియార్ సత్రం, ఎరుమేలి, పంబాలలో 3 ఆన్ లైన్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.

Also Read: KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

GVMC Mayor ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
జీవీఎంసీ మేయర్‌‌గా ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
AP Municipal Election Results: ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
NDA Alliance Victory Factors: ఏపీ పుర ఫలితాల్లో కూటమి ప్రభంజనం - అఖండ విజయం వెనుక ప్రధాన కారణాలు ఇవేనా!?
ఏపీ పుర ఫలితాల్లో కూటమి ప్రభంజనం - అఖండ విజయం వెనుక ప్రధాన కారణాలు ఇవేనా!?
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
GVMC Mayor ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
జీవీఎంసీ మేయర్‌‌గా ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
AP Municipal Election Results: ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Embed widget