![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nellore News: రసవత్తరంగా నెల్లూరు ఎన్నికలు... కండువాలు మార్చేస్తున్న అభ్యర్థులు... తాజా లిస్ట్ ఇదే..!
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ జంప్ ప్రారంభమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ రోజు టీడీపీకి షాక్ తగిలింది. ఇద్దరు నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు.
![Nellore News: రసవత్తరంగా నెల్లూరు ఎన్నికలు... కండువాలు మార్చేస్తున్న అభ్యర్థులు... తాజా లిస్ట్ ఇదే..! Nellore corporation election two tdp leaders joinng ysrcp in presence of minister anil kumar yadav Nellore News: రసవత్తరంగా నెల్లూరు ఎన్నికలు... కండువాలు మార్చేస్తున్న అభ్యర్థులు... తాజా లిస్ట్ ఇదే..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/08/7a3c288f010b52d8faa793ef28d815d4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల రసవత్తంగా సాగుతున్నాయి. నిన్నటి వరకూ టీడీపీ నామినేషన్లు తిరస్కరించాలని పెద్ద రాద్దాంతం జరిగితే. ఇవాళ పోటీ చేస్తున్న అభ్యర్థులు పార్టీల జంప్ చేస్తున్నారు. ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ అస్ర్తాలు సంధిస్తుంది. నామినేషన్ల ఉపసంహరణ రోజు టీడీపీ గట్టి షాక్ తగిలింది. మాజీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మున్వర్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరారు. తన అనుచరులతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో వైసీపీ కండువ కప్పుకున్నారు. నెల్లూరు 20వ డివిజన్ లో వైసీపీ తరపున చేజర్ల మహేష్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి రాజా యాదవ్ నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ సక్రమంగానే ఉంది. అయితే చివరి నిముషంలో వైసీపీ అభ్యర్థి చక్రం తిప్పారు. ఓటింగ్ కి వెళ్లడం కంటే ప్రత్యర్థిని తమవైపు తిప్పుకోవడం మంచిదని భావించినట్లున్నారు. కట్ చేస్తే టీడీపీ అభ్యర్థి వైసీపీ శిబిరంలో చేరిపోయారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో టీడీపీ అభ్యర్థి రాజా యాదవ్ వైసీపీ కండువా కప్పుకున్నారు.
ఫలించిన సామాజిక సమీకరణాలు
కార్పొరేషన్ ఎన్నికల్లో కులసమీకరణాలు బాగా ప్రభావం చూపుతున్నాయి. 20వ డివిజన్ లో టీడీపీ అభ్యర్థి ఓ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి సాయంతో నామినేషన్ ఉపసంహరించుకుని వైసీపీ కండువా కప్పేసుకున్నారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అధికార వైసీపీపై టీడీపీ ఆరోపణలు చేస్తూనే ఉంది. తమ అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారని, లోబరచుకుంటున్నారని ఆరోపిస్తోంది. నామినేషన్ల విషయంలో కూడా తమకు అన్యాయం జరిగిందని టీడీపీ ఆరోపించింది. అయితే చిట్ట చివరకు టీడీపీ అభ్యర్థులే కొన్నిచోట్ల జెండా మార్చేశారు. వైసీపీ కండువా కప్పుకున్నారు.
Also Read: చెన్నైలో చోరీలు ఆంధ్రాలో అమ్మకాలు... సగం ధరకే బ్రాండెడ్ సెల్ ఫోన్లు
వైసీపీ విజయఢంకా మోగిస్తుంది : మంత్రి అనిల్ కుమార్
పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమానికి టీడీపీ నేతలు ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రజాక్షేత్రంలో నిలబడే దమ్ములేక టీడీపీ అనైతిక పొత్తులు పెట్టుకుందని ఆరోపించారు. లోపాయికారీ ఒప్పందాలతో కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోందన్నారు. అన్ని పార్టీలు కుమ్ముక్కైనా ప్రజలు వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నారన్నారు. నెల్లూరు 54 డివిజన్లలో వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని మంత్రి అనిల్ కుమార్ అన్నారు.
Also Read: నెల్లూరులో టీడీపీ వర్సెస్ వైసీపీ... నామినేషన్లు తిరస్కరించారని ఆందోళన.. ఆర్వో తీరుపై టీడీపీ ఫిర్యాదు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)