Nellore Corporation Election: నెల్లూరులో టీడీపీ వర్సెస్ వైసీపీ... నామినేషన్లు తిరస్కరించారని ఆందోళన.. ఆర్వో తీరుపై టీడీపీ ఫిర్యాదు
నెల్లూరులో కార్పొరేషన్ ఎన్నికల కాకరేపుతున్నాయి. ఏకపక్షంగా టీడీపీ నామినేషన్లు తొలగించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్వో వైసీపీకి అనుకూలంగా వ్యవహిరిస్తున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. నామినేషన్ల పరిశీలన సమయంలో అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. తిరస్కరించిన నామినేషన్ల వివరాలు ఇవ్వాలని ఎన్నికల అధికారి(ఆర్వో) కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సమయంలో వైసీపీ నేతలు అక్కడి రావడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలకు సర్దిచెప్పారు.
ఆర్వో తీరుపై కలెక్టర్ కు ఫిర్యాదు
నెల్లూరు నగరంలోని రమేష్‌రెడ్డి కాలనీ సచివాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమ అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నా తిరస్కరించారని టీడీపీ నేతలు మాజీ మంత్రులు చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనందబాబు నిరసన తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి, టీడీపీ నేతలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పోలీసులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం టీడీపీ నాయకులు జిల్లా కలెక్టర్ కు ఆర్వో తీరుపై ఫిర్యాదు చేశారు.
Also Read: కాలుతో తన్నితే.. చక్కగా తన్నించుకుంటారు, వరుసబెట్టి అదే పని.. ఈ వింత ఆచారం ఎందుకో తెలుసా?
టీడీపీ నామినేషన్ల తిరస్కరణపై ఆందోళన
నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో 54 డివిజన్లకు 471 నామినేషన్లు దాఖలు కాగా.. పరిశీలన అనంతరం 432 నామినేషన్లు ఆమోదించారు. 39 నామినేషన్లను తిరస్కరించారు. వైసీపీ తరపున 130 నామినేషన్లు, టీడీపీ తరపున 132, జనసేన 45, బీజేపీ 35 నామినేషన్లు చివరకు అర్హత సాధించాయి. అయితే వైసీపీకి వ్యతిరేక ఫలితాలు వస్తాయని అనుకుంటున్న డివిజన్ల పరిధిలో ప్రతిపక్షాల నామినేషన్లను ఏకగ్రీవంగా తొలగించారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కలెక్టర్ ను కలిశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read: ఏపీలో మరికొద్ది రోజులు వానలు పడే ఛాన్స్.. 9న మరో అల్పపీడనం, తెలంగాణలో ఇలా..