By: ABP Desam | Updated at : 07 Nov 2021 05:29 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీపీఐ నేత నారాయణ
రాబోయే రోజుల్లో భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఉండవని, కేంద్రం అన్నింటినీ ప్రైవేట్ సెక్టార్ కంపెనీలకు కట్టబెడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు. 22 మంది ఎంపీలు దిల్లీలో ఏంచేస్తున్నారన్నారు. దిల్లీలో అచ్చోసిన ఆ**ల్లా తిరుగుతున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ రేట్లు కేంద్రం పెంచిందని పేపర్లో అడ్వర్టైజ్ మెంట్లు ఇస్తున్న ప్రభుత్వం, కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. ఏపీని అదానీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు నిరసన తెలపాలని సూచించారు. నల్లజెండాలు చూపించాలన్నారు.
Also Read: కాలుతో తన్నితే.. చక్కగా తన్నించుకుంటారు, వరుసబెట్టి అదే పని.. ఈ వింత ఆచారం ఎందుకో తెలుసా?
రాళ్ల దాడికి ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందా...?
అమరావతి రైతులు శాంతియుతంగా చేస్తున్న మహాపాదయాత్రపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని నారాయణ ఆరోపించారు. పాదయాత్ర చేస్తే రాళ్లదాడి జరుగుతుందని ముందే చెప్తూ మరో వర్గం నేతలకు ఉసుగొల్పుతుందన్నారు. రాళ్లదాడి చేయాలని సలహా ఇచ్చినట్లు ముందుగానే చెప్తున్నారన్నారు. కోర్టు అనుమతితో 175 మందికి కార్డులు ఇచ్చి పాదయాత్రకు అనుమతిస్తే.. వారిని నిత్యం ఏదో రకంగా ఇబ్బందులు గురిచేస్తున్నారన్నారు. పాదయాత్రపై రాళ్లదాడి జరుగుతుందని ముందే హింట్ ఇస్తున్నారని, అంటే రాళ్లదాడికి ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో పబ్లిక్ సెక్టార్ మొత్తం ప్రైవేట్ సెక్టార్ కి వెళ్లిపోతుందని నారాయణ అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాటకాలకు వైసీపీ, టీఆర్ఎస్ మద్దతు తెలుపుతున్నాయని అన్నారు. ఇంధనధరలు 10 రూపాయలు, 20 రూపాయలు తగ్గించడం కాదని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన ఛార్జీలన్నీ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఇంధన ధరలు సవరించి రూ.20 లక్షల కోట్లు దోపిడీ చేశారని విమర్శించారు.
Also Read: ఏపీలో మరికొద్ది రోజులు వానలు పడే ఛాన్స్.. 9న మరో అల్పపీడనం, తెలంగాణలో ఇలా..
డ్రగ్స్ పై సంచలన వ్యాఖ్యలు
విజయవాడ కేంద్రంగా డ్రగ్స్ దందా కొనసాగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏంచర్యలు తీసుకుంటుందని నారాయణ ప్రశ్నించారు. ముంద్రా పోర్టును విజయవాడ సబ్ ఆఫీసుగా మాదక ద్రవ్యాలు తమిళనాడు, కేరళకు వెళ్తున్నాయని ఆరోపించారు. గంజాయి కేవలం పైకి చూపిస్తున్న నాటకమే.. ముంద్రా పోర్టు వంటి చోట్ల దొరికిన డ్రగ్స్ లో గంజాయి కేవలం ఒక్కశాతమే అన్నారు. ముందు వాళ్లను పట్టుకోవాలి కానీ గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ కు ఏపీ నుంచే తమకు డ్రగ్స్ వస్తున్నారని అన్నారని నారాయణ తెలిపారు. అమ్మేవాడిని పట్టుకోకుండా కాలేజీ స్టూడెంట్స్, సినిమా వాళ్లను పట్టుకుంటున్నారన్నారు.
Nandamuri Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ - బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
ఇబ్బందిగా ఉన్నా ఎన్డీఏ నుంచి బయటకు! టీడీపీకే నా మద్దతు : పవన్ కల్యాణ్ తడబడ్డారా! సంకేతాలిచ్చారా?
MLA Kotamreddy Sridhar Reddy: పోలీసుల కళ్లుగప్పి ఆటోలో ర్యాలీకి చేరుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Lakshmi Parvathi: ఆయనకి తాటిచెట్టులా 75 ఏళ్లు, సెల్‌ఫోన్ తానే కనిపెట్టారట - లక్ష్మీ పార్వతి ఎద్దేవా
Kollu Ravindra: పోలీసుల కనుసన్నల్లోనే వారాహి యాత్రపై కుట్రకు యత్నం, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణలు
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు
Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!
Dharmapuri Arvind: కేసీఆర్‌కు ఫ్యామిలీ నుంచే డేంజర్, ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి - ధర్మపురి అర్వింద్
/body>