Weather Updates: ఏపీలో మరికొద్ది రోజులు వానలు పడే ఛాన్స్.. 9న మరో అల్పపీడనం, తెలంగాణలో ఇలా..
నవంబర్ 9వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఇది మరింత బలపడి రాగల 48 గంటలలో పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు తీరం వైపునకు ప్రయాణించే అవకాశం ఉంది.
ఏపీలో మరి కొద్ది రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం యొక్క ప్రభావం.. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం దగ్గరలోని దక్షిణ ఆంధ్ర - ఉత్తర తమిళనాడు కోస్తా ప్రాంతంపై ఉంది. ఇది సగటు సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం - సుమత్రా తీర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3 .1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, దాని దగ్గర ఉన్న ప్రాంతాల మీద సుమారు నవంబర్ 9వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.
ఇది మరింత బలపడి రాగల 48 గంటలలో పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు తీరం వైపునకు ప్రయాణించే అవకాశం ఉంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అమరావతి వాతావరణ కేంద్రం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఆదివారం ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. సోమవారం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: బస్సు టికెట్ ధరలు పెంచే ఛాన్స్.. సజ్జనార్ వెల్లడి, సాధారణ వ్యక్తిలా డీలక్స్ బస్సులో నల్గొండకు..
రాయలసీమలో ఇలా..
రాయలసీమలో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబరు 9 నాటికి అల్ప పీడనం
ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది నవంబర్ 9 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది. క్రమేపీ అది బలపడి వాయవ్య దిశగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ, దక్షిణ కోస్తాంధ్రలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో ఇలా..
రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ నైరుతి మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 9 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read: పసిడి ప్రియులకు షాక్! భారీగా పెరిగిన పసిడి ధర.. ఏకంగా 400, స్వల్పంగా వెండి.. తాజా ధరలు ఇలా..
Also Read: iPhone New Feature: చిత్రలహరిలో సాయితేజ్ తయారు చేసిన ఫీచర్.. త్వరలో వచ్చే కొత్త ఐఫోన్‌లో?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి