News
News
X

Kurnool: కాలుతో తన్నితే.. చక్కగా తన్నించుకుంటారు, వరుసబెట్టి అదే పని.. ఈ వింత ఆచారం ఎందుకో తెలుసా?

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతూ ఉంది. దీపావళి పండుగ గడిచిన మూడు రోజుల తర్వాత గ్రామ దేవుడు అయిన హుల్తిలింగేశ్వర స్వామి పండుగ జరుగుతుంది.

FOLLOW US: 
Share:

కర్నూలు జిల్లాలో వింత ఆచారం విస్మయం కలిగిస్తోంది. కాలుతో తంతే కష్టాలన్నీ కట్ అయిపోతాయట! అంతేకాదు.. ఒక్క కాలి దెబ్బకి సమస్యలు ఎన్నైనా మటుమాయం అవుతాయట!! నమ్మలేకపోతున్నారు కదూ.. అయితే, కర్నూలు జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి వెళ్లాల్సిందే. ఇక్కడ మహిళలు వరుసలో పడుకొని మరీ ఓ వ్యక్తి చేత కాలితో తన్నించుకుంటారు. అతను తన్ని ‘పైకి లే’ అనగానే కాళ్లకు నమస్కరించి దండాలు పెట్టేస్తారు. ఈ వింత ఆచారం బయటి వారికి మూఢ నమ్మకంగానూ, విడ్డూరంగా కనిపిస్తోంది. కానీ, గ్రామస్థులు మాత్రం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతూ ఉంది. దీపావళి పండుగ గడిచిన మూడు రోజుల తర్వాత గ్రామ దేవుడు అయిన హుల్తిలింగేశ్వర స్వామి పండుగ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసం మొదలుకాగానే రెండవరోజు పెద్దహుల్తి గ్రామంలో హుల్తిలింగేశ్వర స్వామి ఉత్సవాలు జరుతాయి. హుల్తిలింగేశ్వర ఉత్సవమూర్తి విగ్రహాన్ని మోస్తున్న వ్యక్తిలో స్వామి ఆవహిస్తారని గ్రామస్థులు తెలిపారు. ఈయన చేతిలో ఖడ్గం, స్వామివారి విగ్రహం తలపై మోసుకుని గ్రామంలో ఊరేగింపుగా గుడి దగ్గరకి వస్తారు. అక్కడికి రాగానే అప్పటికే స్వామి కొందరు భక్తులు తమ కష్టాలను తీర్చుకునేందుకు ఆ వ్యక్తితో తన్నించుకోవడం కోసం వరుస క్రమంలో నేలపై బోర్లా పండుకొని దండం పెట్టుకొని ఉంటారు.

Also Read: పసిడి ప్రియులకు షాక్! భారీగా పెరిగిన పసిడి ధర.. ఏకంగా 400, స్వల్పంగా వెండి.. తాజా ధరలు

ఉద్యోగం రాని వారు, సంతానం లేని వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, అప్పులు ఉన్నవారు, ఇలా ఒక్కటి కాదు సమస్యలు ఏం ఉన్నా వారు బోర్లా పడుకుంటారు. హుల్తిలింగేశ్వర స్వామి అవహించిన వ్యక్తి వారిని కాలుతో తన్ని భక్తుల సమస్యను విని పూలను భక్తులకు ఇచ్చి ఆశీర్వదిస్తాడు. కాలుతో తన్నిన తరువాత వారి కష్టాలు సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం, ఇలా అన్ని సమస్యలు పరిష్కరం అవ్వుతాయని భక్తుల నమ్మకం.

Also Read: ఏపీలో మరికొద్ది రోజులు వానలు పడే ఛాన్స్.. 9న మరో అల్పపీడనం, తెలంగాణలో ఇలా..

ఈ వింత ఆచారం చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. ఈ అధునాతన యుగంలో కూడా ఇలాంటి మూఢ నమ్మకాలు జరుగుతుండటం విశేషం. అయితే, ఇక్కడ కేవలం నిరక్షరాస్యత లేని వాళ్లు మాత్రమే ఈ బోర్ల పండుకుని తన్నించుకుంటున్నారు అని అనుకుంటే పొరపాటే.. చదువుకున్న వారు కూడా ఉద్యోగం కోసం ఇలా కాలుతో తన్నించుకుంటున్నారు.

Also Read: మంత్రి తలసాని శ్రీనివాస్ కుమారుడిపై కేసు.. కారణం ఏంటంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 07 Nov 2021 01:13 PM (IST) Tags: Kurnool news Villagers kicked by leg Kurnool Pathikonda Pathikonda Mandal Fake Swamiji Superstitions in AP

సంబంధిత కథనాలు

Lokesh on Sand Mafia: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఇసుక దందా ఆరోపణలు, టిప్పర్ల ముందు లోకేష్ సెల్ఫీలు వైరల్

Lokesh on Sand Mafia: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఇసుక దందా ఆరోపణలు, టిప్పర్ల ముందు లోకేష్ సెల్ఫీలు వైరల్

AP Inter Evaluation: ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం! జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

AP Inter Evaluation: ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం! జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

YS Viveka Murder Case: వైఎస్‌ వివేక హత్య కేసు దర్యాప్తు అధికారి రాంసింగ్‌ కొనసాగింపుపై సుప్రీం ఆసక్తికర కామెంట్స్‌

YS Viveka Murder Case: వైఎస్‌ వివేక హత్య కేసు దర్యాప్తు అధికారి రాంసింగ్‌ కొనసాగింపుపై సుప్రీం ఆసక్తికర కామెంట్స్‌

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి