సంక్రాంతికి వచ్చినా.. ఉగాదికి వచ్చిన కండువా వేయాల్సింది నేనేనంటూ పరిటాల శ్రీరాం హాట్ కామెంట్స్

2019ఎన్నికల తర్వాత టీడీపీని వీడి బీజేపీలో చేరిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మళ్ళీ సొంతగూటికి చేరేందుకు ట్రై చేస్తున్నారు. దీనిపైనే పరిటాల శ్రీరాం సీరియస్‌ కామెంట్స్ చేశారు.

FOLLOW US: 

ధర్మవరం రాజకీయాలు గరంగరంగా మారాయి. 2019ఎన్నికల్లో ఓడిపోగానే బిజెపిలో చేరిపోయారు మాజీ ఎంఎల్ఏ గోనుగుంట్ల సూర్యనారాయణ. అప్పటి వరకు అక్కడ ఎంఎల్ఏగా చక్రం తిప్పిన సూరి తరువాత బిజెపిలోకి చేరినప్పటికి కేడర్ ఆయన వెంట వెళ్లలేదు. దాదాపు ఏడాది తర్వాత ధర్మవరం టిడిపి ఇంఛార్జ్‌గా పరిటాల శ్రీరాంను నియమించింది టిడిపి అధిష్ఠానం. అయితే అధిష్ఠానం నియమించినప్పటికీ పరిటాల శ్రీరాం కొంతకాలం ధర్మవరం గురించి పట్టించుకోలేదు. ఎంత పని చేసినప్పటికి ఎన్నికల సమయానికి తనకు టికెట్ ఇవ్వరన్న అనుమానంతో శ్రీరాం ఆసక్తి చూపలేదన్న వార్తలు విన్పించాయి. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు పార్టీ మారిన నేతలు మళ్ళీ వస్తే కచ్చితంగా అవకాశం ఇవ్వబోమన్న హామీ ఇచ్చారు. దీంతో పరిటాల శ్రీరాం సీరియస్‌గా ధర్మవరం నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

గత కొద్ది రోజులుగా ధర్మవరం టిడిపిలో ఆసక్తికర పరిణామాలు జరగుతున్నాయి. మాజీ ఎంఎల్ఏ గోనుగుంట్ల సూర్యనారాయణ బిజెపి నుంచి మళ్ళీ టిడిపిలోకి చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ మారితే మళ్ళీ తనే టిడిపి అభ్యర్థి అని ప్రచారం జరుగుతోంది. దీంతో పరిటాల శ్రీరాం వర్గం కూడా అలర్ట్ అయింది. పార్టీ  పిలుపునిచ్చిన గౌరవసభ కార్యక్రమాల్లో సీరియస్‌గా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సూరి ప్రయత్నాలపై హాట్ కామెంట్స్ చేశారు. వలస పక్షులకు  కూడా తనే కండువా వేయాల్సి వస్తుందంటూ పరోక్షంగా  గోనుగుంట్ల సూర్యనారాయణ పై ఫైర్‌ అయ్యారు పరిటాల శ్రీరాం.

కచ్చితంగా సూరి పార్టీలోకి వచ్చే ఛాన్స్‌ లేదని ఒక వేళ వస్తే తన ఆమోదం లేకుండా అధినేత చంద్రబాబు తీసుకోరంటూ చెప్తూ గౌరవసభల్లో క్లారిటీ ఇస్తున్నారు శ్రీరాం. కేడర్ ఎవరూ సందిగ్దంలో ఉండొద్దు అంటూ చెప్పుకొస్తున్నారు. కచ్చితంగా సూరి చేరికపై తనకు పార్టీ నుంచి సమాచారం ఉందని.. ఇటీవలే వలసపక్షులకు అవకాశం ఇచ్చే సమస్యే  లేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పరిటాల శ్రీరాం గుర్తు చేస్తున్నారు. మరోవైపు ధర్మవరంలో సూరి వర్గం కూడా కచ్చితంగా సంక్రాంతిలోపు పార్టీలో చేరునున్నట్లు, ధర్మవరం ఇంచార్జ్‌గా మళ్ళీ బాధ్యతలు తీసుకోనున్నట్లు చెప్తున్నారు. దీంతో ధర్మవరం రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. సూరి వస్తే తమ పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం పరిటాల వర్గీయుల సమస్య. ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరాం చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి ధర్మవరం నియోజకవర్గంలో సంక్రాంతికి వచ్చినా.. ఉగాదికి వచ్చినా తానే కండువా వేయాలి... సో మీరెందుకు టెన్షన్ పడతారు.. ఒకవేళ పార్టీలోకి వచ్చినా తన ఆమోదం ఉండాల్సిందే అంటూ పరిటాల శ్రీరాం చేసిని వ్యాఖ్యలతో సూరి చేరికపై సందిగ్దం నెలకొంది. దీనిపై అధిష్ఠానం ఎలాంటి స్టెప్‌ తీసుకుంటుందోనన్న సస్పెన్ష్‌ మొదలైంది. 

Also Read: CPS Cancellation: సీపీఎస్ రద్దుపై ఉద్యోగుల ఆశలు ఆవిరి.. చేతులెత్తేసిన ప్రభుత్వం!

Also Read: యువనేతలకు నామినేటెడ్ పదవులు.. క్యాడర్‌లో జోష్ నింపుతున్న కేసీఆర్ !

Also Read : ఓ వైపు పథకాల సమీక్షలు..మరో వైపు జిల్లాల పర్యటనలు .. ఇక కేసీఆర్ బిజీ బీజీ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 16 Dec 2021 09:22 AM (IST) Tags: tdp Chandrababu Paritala Sriram telugudesam Dharmavaram News

సంబంధిత కథనాలు

Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు

Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు

Minister Gherao: మంత్రి జయరాంను అడ్డుకునేందుకు జనసేన, సీపీఐ లీడర్ల యత్నం- సత్యసాయి జిల్లాలో కబ్జాదారులపై చర్యలకు డిమాండ్

Minister Gherao: మంత్రి జయరాంను అడ్డుకునేందుకు జనసేన, సీపీఐ లీడర్ల యత్నం- సత్యసాయి జిల్లాలో కబ్జాదారులపై చర్యలకు డిమాండ్

Anantapuram Politics: ఉమ్మడి అనంతలో పొలిటికల్ హీట్- జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్సెస్ పల్లె రఘునాథ్

Anantapuram Politics: ఉమ్మడి అనంతలో పొలిటికల్ హీట్- జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్సెస్ పల్లె రఘునాథ్

Satya Sai Trust: సత్యసాయి జిల్లాలో కబ్జాల పర్వం- ఉజ్వల్‌ ఫౌండేషన్ అక్రమాలపై త్రిసభ్య కమిటీ విచారణ

Satya Sai Trust: సత్యసాయి జిల్లాలో కబ్జాల పర్వం- ఉజ్వల్‌ ఫౌండేషన్ అక్రమాలపై త్రిసభ్య కమిటీ విచారణ

YS Jagan Eluru Tour: 16న ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన - వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదలకు అంతా రెడీ

YS Jagan Eluru Tour: 16న ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన - వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదలకు అంతా రెడీ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Telangana: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీ - ఎవరికి ఏ శాఖ అప్పగించారంటే !

Telangana: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీ - ఎవరికి ఏ శాఖ అప్పగించారంటే !

Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్?

Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్?

Whatsapp Premium: త్వరలో వాట్సాప్ ప్రీమియం - డబ్బులు కట్టాల్సిందేనా?

Whatsapp Premium: త్వరలో వాట్సాప్ ప్రీమియం - డబ్బులు కట్టాల్సిందేనా?

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!