CM KCR : ఓ వైపు పథకాల సమీక్షలు..మరో వైపు జిల్లాల పర్యటనలు .. ఇక కేసీఆర్ బిజీ బీజీ !
ప్రభుత్వ, పార్టీ పనుల్లో ఇక తీరిక లేకుండా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. 17వ తేదీన పార్టీ కార్యకర్గం, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత జిల్లాల బాట పట్టనున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక మళ్లీ వరుస సమావేశాలు, జిల్లాల పర్యటనలతో బిజీ కాబోతున్నారు. చెన్నై పర్యట నుంచి వచ్చిన తర్వాత 17వ తేదీ నుంచి ఆయన తీరిక లేని షెడ్యూల్‌ను ఖరారు చేసుకున్నారు. 17 వ తేదీ తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనే సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సన్నద్ధమయ్యే అంశంపై ఈ సమావేశంలోకేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేఅవకాశం ఉంది. ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిఎంఎస్ అధ్యక్షులు, డిసిసిబి అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్లతో పాటు కార్యవర్గం అంతా పాల్గొంటారు.
ఇక 18వ తేదీన దళిత బంధు ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలో మార్చి లోపు దళిత బంధు అమలు చేయడంపై అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు. అదే సందర్భంలో ధాన్యం సేకరణ అంశం పై సిఎం కెసిఆర్ సమీక్షించనున్నారు.
Also Read : కేసీఆర్ జాతీయ రాజకీయాల వ్యూహం ఏమిటి ? ధర్డ్ ఫ్రంటా ? యూపీఏనా ?
ఇక 19వ తేదీ నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తున్నారు. ఆదివారం వనపర్తి జిల్లా పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా.. జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నారు. టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 20వ తేదీన జనగామ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Also Read : తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీ.. 2 కేసులు గుర్తింపు, మరో బాలుడికి కూడా.. డీహెచ్ వెల్లడి
మిగిలిన జిల్లాల్లోనూ ఆయన వరుసగా పర్యటించనున్నారు. వివిధ జిల్లాల్లో సమీకృత కలెక్టర్ భవనాలు నిర్మాణమై సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని జిల్లాల్లో దాదాపు ముగింపు దశలో ఉన్నాయి. వాటి ప్రాధాన్యతా క్రమంలో ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదే సమయంలో జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభించనున్నారు. ఏక కాలంలో అటు ప్రభుత్వపరంగా, ఇటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై కేసీఆర్ దృష్టి పెట్టారు.
Also Read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి అన్నదాతల ఖాతాల్లోకి రైతుబంధు నగదు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి