By: ABP Desam | Updated at : 15 Dec 2021 03:53 PM (IST)
19వ తేదీ నుంచి షర్మిల రైతు ఆవేదనా యాత్ర
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా తాను చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రను నిలిపివేశారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసిపోయింది. అయితే ఆమె పాదాయత్ర ప్రారంభించడం లేదు. మరికొంత కాలం వాయిదా వేశారు. మరో యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఆ యాత్ర పేరు రైతు ఆవేదన యాత్ర. అచ్చంగా ఇది గతంలో జగన్ చేసిన ఓదార్పు యాత్ర లాంటిదే.
Also Read : కేసీఆర్ జాతీయ రాజకీయాల వ్యూహం ఏమిటి ? ధర్డ్ ఫ్రంటా ? యూపీఏనా ?
వరి ధాన్యం అమ్ముడుపోక, అప్పులు ఎక్కువై రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని షర్మిల ఆవేదన చెందుతున్నారు. ఏడేళ్లలో 7వేల మందికి పైగా రైతులు చనిపోయారని చెప్పారు. గత 70 రోజుల్లో 200 మందికి పైగా రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారని షర్మిల చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో పాటు రైతుల్ని ఆదుకోవాలనికోరుతూ ఈ నెల 19 నుంచి రైతు ఆవేదన యాత్ర చేపట్టాలని నిర్ణయించారు.
Also Read : తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీ.. 2 కేసులు గుర్తింపు, మరో బాలుడికి కూడా.. డీహెచ్ వెల్లడి
ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరి ఇంటికీ వెళ్తామని, ఆయా కుటుంబాలకు అండగా నిలబడతామన్నారు. రైతు ఆవేదనయాత్ర అనంతరం ప్రజాప్రస్థానం పాదయాత్ర, నిరుద్యోగ నిరాహార దీక్షలను కొనసాగిస్తామని షర్మిల ప్రకటించారు. ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న కొంత మంది రైతుల కుటుంబాలను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. ఆర్థిక సాయం అందించారు.
Also Read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి అన్నదాతల ఖాతాల్లోకి రైతుబంధు నగదు
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు రావాలన్న లక్ష్యంతో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దూకుడుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓదార్పు యాత్రలు.. పాదయాత్రలు చేస్తున్నారు. ప్రజాప్రస్థానం పేరుతో చెేవెళ్ల నుంచి ప్రారంభించిన పాదయాత్ర నల్గొండ జిల్లా వరకూ సాగింది. అక్కడ నిలిచిపోయింది. నిరంతరాయంగా చేపట్టాలనుకున్నా.. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు షర్మిల వ్యూహం మార్చుకున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Telangana BJP: బీజేపీలోకి ఫైర్ బ్రాండ్‌గా పేరున్న లాయర్, బండి సంజయ్‌తో భేటీ - కేసీఆర్‌ను వ్యతిరేకిస్తూ ఎన్నో వాదనలు
Breaking News Live Telugu Updates: ప్రధానిపై చేసిన వ్యాఖ్యలపై చర్చకు సిద్ధం: సీపీఐ నారాయణ
KTR Satire: ‘అచ్చేదిన్ ఆగయా, ప్రతి ఫ్యామిలీకి మోదీ గిఫ్ట్ ఇదీ’ - ప్రధానిపై కేటీఆర్ సెటైర్లు
Nizamabad Terror Links: నిజామాబాద్‌లో ఉగ్ర లింకులు, పోలీసుల అదుపులో ట్రైనర్ - పెద్ద కుట్రకి ప్లాన్!
Hyderabad As Bhagyanagar: హైదరాబాద్ పేరుని బలవంతంగా మార్చారా? అంతకు ముందు భాగ్యనగర్‌గానే పిలుచుకున్నారా?
Watch Video: బ్యాండ్ బాజాతో భర్తకు గ్రాండ్ వెల్కమ్, డ్రమ్స్ వాయించిన షిందే సతీమణి
Viral news: ఈ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో, రెండు వారాలు విదేశీ ట్రిప్పుకి తీసుకెళ్లిన బాస్
MLA Salary: పాపం, ఆ ఎమ్మెల్యేలకు అంత తక్కువ జీతాలా? తెలంగాణలో మాత్రం హైయెస్ట్ సాలరీలు!
Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేసిన టీటీడీ