అన్వేషించండి

KCR National Plans : కేసీఆర్ జాతీయ రాజకీయాల వ్యూహం ఏమిటి ? ధర్డ్ ఫ్రంటా ? యూపీఏనా ?

జాతీయ రాజకీయాల విషయంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ధర్డ్ ఫ్రంట్ వైపు వెళ్తున్నారా లేక కాంగ్రెస్ కూటమి వైపా అన్నదానిపై ఆయన గోప్యత పాటిస్తున్నారు.


తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలపై చాలా రోజుల నుంచి గురి ఉంది. కానీ ఆయనకు సమయం, సందర్భం కలసి రావడం లేదు అంతే. గతంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు సంబంధం లేని ప్రాంతీయ పార్టీల మూడో కూటమి కోసం బహిరంగంగా ప్రకటించి మరీ పర్యటనలు చేశారు. ప్రాంతీయ పార్టీల ముఖ్యనేతలందరితో భేటీ అయ్యారు. కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల్లో వర్కవుట్ కాలేదు. ఇప్పుడు కేసీఆర్ మళ్లీ అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ ఈ సారి ఆయన వ్యూహంలో స్పష్టమైన మార్పుకనిపిస్తోంది. అదేమిటంటే ఈ సారి ఎక్కడా బహిరంగ ప్రకటనలు చేయడం లేదు. అంతా గోప్యంగా చేసుకెళ్తున్నారు.
KCR National Plans : కేసీఆర్ జాతీయ రాజకీయాల వ్యూహం ఏమిటి ? ధర్డ్ ఫ్రంటా ? యూపీఏనా ?

Also Read : తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీ.. 2 కేసులు గుర్తింపు, మరో బాలుడికి కూడా.. డీహెచ్ వెల్లడి
  
స్టాలిన్‌తో జాతీయ రాజకీయాలపైనే ప్రధాన చర్చ !?

తమిళనాడు సీఎం స్టాలిన్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంతో సహా కలిశారు. ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. తమిళనాడు సీఎం ప్రస్తుతం కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి. డీఎంకే యూపీఏ కూటమిలో కీలక పార్టీ.  డీఎంకేను ప్రాంతీయ పార్టీల కూటమిలోకి తెచ్చేలా కేసీఆర్ చర్చించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు ఆ కూటమిలోని పార్టీలతో కలిసి మూడో కూటమి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపైనే చర్చలు జరిపారని అంటున్నారు. కేసీఆర్ మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్‌తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే.. ధర్డ్ ఫ్రంట్‌లోకి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చని కొంత మంది క్లారిటీకి వస్తున్నారు.
KCR National Plans : కేసీఆర్ జాతీయ రాజకీయాల వ్యూహం ఏమిటి ? ధర్డ్ ఫ్రంటా ? యూపీఏనా ?

Also Read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి అన్నదాతల ఖాతాల్లోకి రైతుబంధు నగదు

కేసీఆరే కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారా !?
 
ఇటీవల కేసీఆర్ కూడా కాంగ్రెస్‌తో కాస్త సన్నిహితంగా ఉంటున్నట్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.  రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ హాజరయింది. దాంతో కాంగ్రెస్ కు దగ్గరగా టీఆర్ఎస్ జరుగుతోందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో స్టాలిన్‌తో సమావేశం కావడం కూడా ఆ దిశగా ఓ ముందడుగు అని కొంత మంది విశ్లేషిస్తున్నారు. స్టాలిన్ కాంగ్రెస్‌ను వదులుకోరని.. కావాలంటే కాంగ్రెస్ కూటమిని బలపరిచేలా  చేస్తారని అంటున్నారు. గతంలో జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌ కేసీఆర్‌ను గట్టిగా నమ్మే పరిస్థితి ఉండదని.. కానీ స్టాలిన్ లాంటి వాళ్లు చొరవ తీసుకుంటే ఆ గ్యాప్ ఫిల్ అవుతుందన్న అంచనాలో కేసీఆర్ ఉన్నారంటున్నారు.
KCR National Plans : కేసీఆర్ జాతీయ రాజకీయాల వ్యూహం ఏమిటి ? ధర్డ్ ఫ్రంటా ? యూపీఏనా ?

Also Read: Revant Reddy : సొంత పార్టీకే భవిష్యత్ లేదు..ఇక జాతీయ రాజకీయాలా ? .. కేసీఆర్ తమిళనాడు టూర్‌పై రేవంత్ రెడ్డి విసుర్లు

ప్రశాంత్ కిషోర్ వ్యూహారమే ప్రకారమే పర్యటనలా ? 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రశాంత్ కిషోర్ టీం సూచనలు, సలహాలు తీసుకుంటున్నారన్న ప్రచారం గుప్పుమంటోంది. ఢిల్లీ పర్యటనలో కేసీఆర్‌ను పీకే కలిశారని.. తర్వాత ఐ ప్యాక్ టీం వచ్చి ప్రగతిభ వన్‌లో కేసీఆర్‌తో భేటీ అయిందని తెలిసింది.  ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే మమతా బెనర్జీ పార్టీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ స్థానంలోతృ।ణమూల్‌ను ఉంచాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో పీకే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీల కూటమికి సిద్ధమవుతున్నారన్న అభిప్రాయం ఉంది. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఒక రాష్ట్రంలో మరో రాష్ట్రంలో ఎదురుపడవు. అందుకే ఈ కూటమి సాధ్యమన్న అభిప్రాయం ఆయా పార్టీల నేతల్లో ఉంది.  

Also Read: యాదాద్రి ప్రారంభోత్సవానికి రండి.. ,. స్టాలిన్‌ను ఆహ్వానించిన కేసీఆర్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget