By: ABP Desam | Updated at : 02 Dec 2022 06:05 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
చంద్రబాబు
Chandrababu : ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. కొవ్వూరులో చంద్రబాబు డ్వాక్రా, అంగన్వాడీ, పొదుపు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ పాదయాత్రలో ముద్దులు పెడితే, ఏదో ఉద్దరిస్తారని ప్రజలు మోసపోయారన్నారు. ఇప్పుడు మహిళలను పిడిగుద్దులు గుద్దుతున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో మహిళలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. డ్వాక్రా సంఘాలను సీఎం జగన్ సభలకు ఉపయోగిస్తున్నారన్నారు. జగన్ సభల్లో చప్పట్లు కొట్టకపోతే పింఛన్ కట్, అమ్మ ఒడి కట్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
"ఛీ అసహ్యం వేస్తుంది నీ పాలన మీద. మాట తప్పి ఇలా మోసం చేయడానికి సిగ్గుగా లేదా?" అంటూ జగన్ రెడ్డిని కడిగి పారేసారు విజయకుమారి అనే ఈ డ్వాక్రా మహిళ. చంద్రబాబుగారి సమక్షంలో "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి?" కార్యక్రమంలో మాట్లాడిన ఈ మహిళ ఆవేదన ఎందుకో చూడండి pic.twitter.com/5UvUglSZF7
— Telugu Desam Party (@JaiTDP) December 2, 2022
మరుగుదొడ్లపై పన్ను
సీఎం జగన్ ప్రజలకు ఇచ్చే డబ్బులకు దోచుకునే డబ్బులకు పొంతన లేదని చంద్రబాబు అన్నారు. మహిళలు రాజకీయంగా రాణించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దిశ చట్టం అవ్వకపోయినా ఆ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వంలో ఆడవారి ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు ఇస్తే, వాటిపై వైసీపీ ప్రభుత్వం పన్ను వేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలనలో మహిళలకు ఏం లాభం కలిగిందో ప్రజలు ఒకసారి బేరీజు వేసుకోవాలని చంద్రబాబు కోరారు.
డ్వాక్రా సంఘాలకు పూర్వ వైభవం
డ్వాక్రా సంఘాల స్వయం సాధికారత స్ఫూర్తిని సీఎం జగన్ తీవ్రంగా దెబ్బతీరాని చంద్రబాబు ఆరోపించారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం గడప కూడా దాటడంలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంటి ఖర్చులను మహిళలు ఒకసారి బేరీజు వేసుకోవాలన్నారు. మీ కొనుగోలు శక్తి తగ్గిందో లేదో ఆలోచన చేయాలన్నారు. కేవలం తన సభలకు హాజరు కావడం కోసమే డ్వాక్రా సంఘాలను సీఎం జగన్ వాడుకుంటున్నారన్నారు. మహిళల ఆత్మగౌరవానికి టీడీపీ మరుగుదొడ్లు కట్టిస్తే, వాటి పైనా పన్ను విధించిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే మళ్లీ డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తామన్నారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు టీడీపీ కృషి చేస్తుందని చంద్రబాబు తెలిపారు.
ఊరికొక సైకో
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేస్తున్నారని చాలా బాధగా ఉందన్నారు. ఇంత నీచమైన పాలన తన రాజకీయ జీవితంలో చూడలేదని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో ఊరికొక సైకోను తయారుచేస్తున్నారని మండిపడ్డారు. అమరరాజా పరిశ్రమను తెలంగాణలో పెడుతున్నారని, ఏపీ వ్యక్తి వేరే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పరిశ్రమలు తరలిపోతుంటే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని చంద్రబాబు ఆవేదన చెందారు.
YSRCP Corporator on Kotamreddy: ఆ ఎమ్మెల్యే నన్ను చంపేస్తాడు, నాకు ప్రాణహాని ఉంది? : కోటంరెడ్డిపై కార్పొరేటర్ సంచలన ఆరోపణలు
Aadala In Nellore: ఆదాల వెంటే ఉంటాం, సీఎం జగన్ చెప్పినట్టే నడుచుకుంటాం - కొత్త ఇంఛార్జ్ కు పూర్తి మద్దతు
Minister Dharmana Prasadarao : చంద్రబాబు కన్నా ముందే వాలంటీర్లు తుపాకీ పేల్చాలి, ఎవరికి ఓటు వెయ్యాలో చెప్పే హక్కు మీకుంది - మంత్రి ధర్మాన
Jagananna Videshi Vidya Deevena : టీడీపీ నేత కుమార్తెకు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఆర్థికసాయం
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?