Home Minister Sucharita : సీఎం జగన్ కార్యక్రమానికి హోంమంత్రి సుచరిత డుమ్మా - తీవ్ర అసంతృప్తే కారణం ..
శిలాఫలకంపై పేరు లేదని సీఎం జగన్ పాల్గొన్న కార్యక్రమానికి హోంమంత్రి సుచరిత హాజరు కాలేదు.
గుంటూరు జిల్లాకు చెందిన హోంమంత్రి సుచరితకు ( Home minister Sucharita ) అవమానం ఎదురయింది. ఈ కారణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ( CM Jagan Reddy ) పాల్గొన్న కార్యక్రమంలో ఆమె పాల్గొన లేదు. మంగళగిరి పరిధిలోని ఆత్మకూరులో ఇస్కాన్ ఆధ్వర్యంలో అక్షయపాత్ర ( Akshya Patra ) వంటశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత హజరు కాలేదు. గుంటూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కావడం .. సీఎం జగన్‌కు అత్యంత విధేయురాలు కావడంతో ఎందుకు గైర్హాజర్ అయ్యారా అని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. ఏ విషయంలో అయినా అసంతృప్తి చెందారా అని ఆరా తీశారు.
నారావారి పల్లెలో భూ కబ్జా - చంద్రబాబు కుటుంబం భూమికి ఆక్రమణదారుల ఫెన్సింగ్ !
నిజంగానే హోంమంత్రి సుచరిత గైర్హాజర్ అవడానికి అసంతృప్తే కారణం. అయితే ఆ అసంతృప్తి పార్టీ మీద లేదా సీఎం జగన్ మీద కాదు. కేవలం శిలాఫలకం మీదనే. కేంద్రీకృత వంటశాల, శ్రీకృష్ణ ఆలయం, గోశాల నిర్మిస్తున్న ఇస్కాన్ ( ISKON ) సంస్థ జిల్లాకి చెందిన హోం మంత్రి సుచరిత పేరును మర్చిపోయింది. శిలాఫలకం మీద జిల్లాకు చెందిన ఏకైక మంత్రిగా ఆమె పేరు ముద్రించడం మర్చిపోయారు. అయితే చివరి క్షణం వరకూ ఈ విషయం హోంమంత్రికి ( AP Home Minister ) తెలియలేదు. ఆమె యథావిధిగా సీఎం జగన్‌తో కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. కానీ శిలాఫలకం మీద పేరు లేదని కార్యక్రమానికి వెళ్తే హోంమంత్రి పదవికే అగౌరవమన్న సూచనలు రావడంతో ఆగిపోయారు.
తాడిపత్రిలో మళ్లీ అదే గొడవ, మధ్యలో నలుగుతున్న అధికారులు - ఎవరి పంతం నెగ్గుతుందని ఆసక్తి!
సాధారణంగా ప్రైవేటు కార్యక్రమంలో సీఎం పాల్గొంటున్నప్పటికీ నిర్వాహకులు ఖచ్చితంగా ప్రోటోకాల్ ( Protocal ) పాటిస్తారు. ముఖ్యమంత్రి తరవాత ఆ జిల్లాకు చెందిన మంత్రికి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఇస్కాన్ తరపున ఈ కార్యక్రమ నిర్వహణకు తీసుకున్న వ్యక్తులు హోంమంత్రి పేరును మర్చిపోయారు. ముఖ్యమంత్రితోపాటు చైర్మన్ మధు పండిత దాస్, ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీరంగరాధరాజు వంటి పేర్లు ఉన్నప్పటికీ హోంమంత్రి సుచరితకు మాత్రం శిలాఫలకంపై పేరుకు చోటు దొరకలేదు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మినహా గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులందంరూ పాల్గొన్నారు.
త్రిసభ్య కమిటీ తొలి భేటీలో నిరాశే ! తెలుగు రాష్ట్రాల మధ్య ఒక్క అంశంలోనూ రాని ఏకాభిప్రాయం..?