అన్వేషించండి

Chandrababu Land Kabja : నారావారి పల్లెలో భూ కబ్జా - చంద్రబాబు కుటుంబం భూమికి ఆక్రమణదారుల ఫెన్సింగ్ !

నారావారి పల్లెలో చంద్రబాబు కుటుంబానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు కొంత మంది ప్రయత్నించారు. వారు వైఎస్ఆర్‌సీపీ నేతలుగా భావిస్తున్నారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న నారా వారి పల్లె ( Nara Vari Palle )  గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబానికి ( chandra babu Family ) చెందిన భూమిని కొంత మంది వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది. సర్వే నంబర్‌ 222/5లోని 38 సెంట్లు ఆక్రమించుకునేందుకు కబ్జాదారులు ప్రయత్నించారు. రాళ్లు తీసుకు వచ్చి పాతారు. 1989లో చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు 87 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిని తర్వాత కుమారులైన చంద్రబాబు, రామ్మూర్తినాయుడులకు పంచారు. తన వాటాగా వచ్చిన భూమిని చంద్రబాబు ఆస్పత్రి, కల్యాణ మండపానికి విరాళంగా ఇచ్చారు. 

తిరుమలలో ప్రైవేటు హోటల్స్, రెస్టారెంట్లు త్వరలో తొలగింపు, ఎవరికైనా ఒకే భోజనం

నారా రామ్మూర్తి నాయుడుకు ( Nara Rammoorty Naidu ) చెందిన 38 సెంట్ల భూమి మాత్రం ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ భూమిలోనే కబ్జాకు ప్రయత్నించిన వారు ఫెన్సింగ్ వేశారు. ఆ భూమిని రామ్మూర్తి నాయుడు కుటుంబసభ్యులు ఆన్ లైన్ చేయించుకోలేదు. ఇదే అదనుగా ఆన్‌లైన్‌లో లేదు కాబట్టి తాము కబ్జా చేసి అన్ లైన్ చేయించుకోవాలని కొంత మంది ప్రయత్నించినట్లుగా తెలుస్తోది. ఈ కబ్జా ప్రయత్నాల వెనుక వైఎ‌స్‌ఆర్‌సీపీకి ( YSRCP Leaders ) చెందిన వ్యక్తులు ఉన్నారని.. ఆన్‌లైన్‌లో రికార్డులు ట్యాంపరింగ్ చేసి  భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

త్రిసభ్య కమిటీ తొలి భేటీలో నిరాశే ! తెలుగు రాష్ట్రాల మధ్య ఒక్క అంశంలోనూ రాని ఏకాభిప్రాయం..?

ఏపీలో వైఎస్ఆర్‌సీపీ నేతల కబ్జాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని తెలుగుదేశం పార్టీ ( TDP ) నేతలు కొన్నాళ్లుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత స్వగ్రామంలో వారి కుటుంబానికే చెందిన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించడం రాజకీయంగానూ కలకలం రేపుతోంది. ఈ అంశంపై ఇంత వరకూ అధికారులు కానీ. కబ్జాకు ప్రయత్నించిన వారు కానీ స్పందించలేదు. ఏ పత్రాలతో వారు ఆ భూమికి ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నించారన్నదానిపైనా స్పష్టత లేదు. అయితే వారికి అధికారుల సపోర్ట్ ఉన్నట్లుగా భావిస్తున్నారు. నేరుగా చంద్రబాబు కుటుంబ భూమినే కబ్జా చేయడానికి ప్రయత్నించడంతో ఇక సామాన్యుల ఆస్తులకు రక్షణ ఎక్కడ ఉంటుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ  భూ కబ్జా అంశంపై చంద్రబాబు కుటుంబం నుంచి కూడా ఇంకా ఎలాంటి  ప్రకటనా రాలేదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Constable Physical Events: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Constable Physical Events: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ త్వరలో - ఇకపై ఫోన్ కాలింగ్ తరహాలో!
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ త్వరలో - ఇకపై ఫోన్ కాలింగ్ తరహాలో!
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Cow Dung : పాక్ సూపర్ ఐడియా.. ఆవు పేడతో బస్సులు నడుపుతోన్న దేశం
పాక్ సూపర్ ఐడియా.. ఆవు పేడతో బస్సులు నడుపుతోన్న దేశం
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Embed widget