![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ త్వరలో - ఇకపై ఫోన్ కాలింగ్ తరహాలో!
Whatsapp Updates: త్వరలో వాట్సాప్ తన వినియగదారుల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా వాట్సాప్‌లో కొత్త నంబర్లకు కాల్ చేయడం మరింత ఈజీ కానుంది.
![WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ త్వరలో - ఇకపై ఫోన్ కాలింగ్ తరహాలో! Whatsapp Reportedly Testing New App Dialer Feature Check Complete Details WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ త్వరలో - ఇకపై ఫోన్ కాలింగ్ తరహాలో!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/18/0b9f97058d77575153f57259de7aecbe1734545620138252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
WhatsApp New Feature: రోజూ వందల కోట్ల మంది యూజర్లు వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. వారి సౌలభ్యం కోసం కంపెనీ క్రమం తప్పకుండా కొత్త ఫీచర్లను తీసుకువస్తుంది. కొన్నిసార్లు ఈ ఫీచర్లు వినియోగదారుల భద్రతకు సంబంధించినవి కాగా, కొన్నిసార్లు వారి సౌలభ్యం కోసం అప్‌డేట్లు, కొత్త ఫీచర్లు వస్తాయి. ఇప్పుడు కొత్త అప్‌డేట్‌లో వాట్సాప్ వినియోగదారులు ఇన్ యాప్ డయలర్‌ను పొందబోతున్నారు. దీంతో యూజర్లు యాప్ నుంచి నంబర్ డయల్ చేసి ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతో వారికి తలెత్తే అనేక సమస్యలు తీరుతాయి. కంపెనీ ఈ ఫీచర్‌ని ఐవోఎ్ బీటా వినియోగదారులతో పరీక్షిస్తోంది.
ఈ ఫీచర్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?
ఇప్పటి వరకు వాట్సాప్ ద్వారా ఎవరికైనా కాల్ చేయాలంటే వారి నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. డయలర్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ అవాంతరం ఇకపై కనిపించదు. వినియోగదారులు నంబర్ డయలర్‌లో ఏదైనా నంబర్‌ని డయల్ చేయగలరు. వారితో మాట్లాడగలరు. ఇది ఇంటర్నెట్ ఆధారిత కాల్ అవుతుంది. అంటే ఇప్పుడు వాట్సాప్‌లో ఆడియో కాల్ చేయడానికి ఒకరి నంబర్‌ను సేవ్ చేయాల్సిన అవసరం ఉండదు. అన్నింటిలో మొదటిది ఈ ఫీచర్ ఐఫోన్ వినియోగదారులకు వస్తుంది. క్రమంగా వినియోగదారులు అందరూ దాని ప్రయోజనాలను పొందడం ప్రారంభిస్తారు.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
ఫోన్ డయలర్‌పై ఆధారపడటం తగ్గుతుంది
ఈ ఫీచర్ వచ్చిన తర్వాత ఫోన్ డయలర్‌పై ప్రజలు ఆధారపడటం తగ్గుతుంది. ఇది వాట్సాప్‌కు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రజలు మునుపటి కంటే ఈ యాప్‌లో ఎక్కువ సమయం గడుపుతారు. వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వచ్చిన తర్వాత ఇప్పటికే ఫోన్ కాలింగ్ దాదాపుగా తగ్గిపోయింది. ఈ కొత్త ఫీచర్ వచ్చిన తర్వాత యూజర్లు వాట్సాప్ ద్వారా ద్వారా నేరుగా కాల్స్ చేస్తున్నారు. అయితే దీని కోసం కాల్ రిసీవర్ కూడా తన ఫోన్‌లో వాట్సాప్ కలిగి ఉండటం అవసరం.
వీడియో కాల్ నాణ్యతను మెరుగుపరిచిన వాట్సాప్
వాట్సాప్ ఇటీవల వీడియో నాణ్యతను మెరుగుపరిచిన మరొక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇప్పుడు మీరు మొబైల్ లేదా డెస్క్‌టాప్ యాప్ నుంచి వీడియో కాల్ చేస్తే, వీడియో క్వాలిటీ మెరుగుపడనుంది. దీంతో పాటు వీడియో కాల్‌ల కోసం అనేక కొత్త ఎఫెక్ట్‌లు కూడా జోడించారు.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
📝 WhatsApp beta for iOS 24.25.10.77: what's new?
— WABetaInfo (@WABetaInfo) December 18, 2024
WhatsApp is rolling out a feature to mention group chats in status updates, and it's available to some beta testers!
Some users can experiment with this feature by installing certain previous updates.https://t.co/a989veAh9p pic.twitter.com/Hhjjydf8EG
📝 WhatsApp beta for Android 2.24.26.17: what's new?
— WABetaInfo (@WABetaInfo) December 18, 2024
WhatsApp is rolling out a feature to mention group chats in status updates, and it's available to some beta testers!
Some users can experiment with this feature by installing certain previous updates.https://t.co/y7UtqN8tCJ pic.twitter.com/9HajsiyVZs
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)