Cm Jagan: సీఎం జగన్ తో ఫ్లిప్ కార్ట్ సీఈవో భేటీ... విశాఖలో పెట్టుబడులు పెట్టాలని కోరిన సీఎం

సీఎం జగన్ తో ఫ్లిప్ కార్ట్ సంస్థ ప్రతినిధులు గురువారం భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సంస్థ ప్రతినిధులను సీఎం జగన్ కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు.

FOLLOW US: 

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులపై కల్యాణ్ కృష్ణమూర్తి, ఫ్లిప్ కార్ట్ బృందం సీఎంతో చర్చించారు. విశాఖలో పెట్టుబడులు పెట్టాలని, రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని సీఎం జగన్ ఫ్లిప్ కార్ట్ ప్రతినిధులను కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, రైతులకు మంచి ధరలు అందేలా చూడటం, నైపుణ్యాభివృద్ధి అంశాలపై సీఎం జగన్, కల్యాణ్ కృష్ణమూర్తి మధ్య చర్చజరిగింది. 

Also Read: తిరుపతిలో జరగబోయేది తెలుగుదేశం పార్టీ సభ.... ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులది త్యాగం కాదా?... టీడీపీపై మంత్రి బొత్స ఫైర్

రైతులకు మంచి ధరలు వచ్చేలా సహకారం

రాష్ట్ర వ్యవసాయరంగ అభివృద్ధి కోసం రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించామని, ఇక్కడ రైతులకు ఎరువులు, విత్తనాలు, పరికరాలతో పాటు పంటల కొనుగోలు కూడా చేస్తూ రైతులకు వెన్నుదన్నుగా ఉంటున్నామని సీఎం జగన్ ఫ్లిప్‌కార్ట్‌ ప్రతినిధులకు వివరించారు. రైతులకు పంటలకు మంచి ధర వచ్చేలా ఫ్లిప్‌ కార్ట్‌ సహకారం అందించాలని సీఎం కోరారు. రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసి వినియోగదారులకు అందించేందుకు దోహదపడాలని కోరారు. ఏపీలో ధరల పర్యవేక్షణకు ఓ యాప్‌ ఉందని దానిని మెరుగుపరిచేందుకు తగిన తోడ్పాటు అందించాలని సీఎం కోరారు.  

Also Read: ఇడుపులపాయ టు తాడేపల్లికి పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ! వాళ్లకేం కష్టం వచ్చిందంటే ?

విశాఖలో మరిన్ని పెట్టుబడులు

ఫ్లిప్ కార్ట్ వ్యాపారం విస్తరణలో భాగంగా రైతుల నుంచి ఉత్పతులు కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో సీఎం జగన్ కు తెలిపారు. రైతులకు మంచి టెక్నాలజీ అందించేలా కృషిచేస్తామన్నారు. విశాఖపట్నంలో ఈ-కామర్స్‌ పెట్టుబడులకు మంచి వేదిక అని సీఎం అన్నారు. అక్కడ మరిన్ని పెట్టుబడులకు పెట్టేందుకు మందుకు రావాలని కోరారు. నైపుణ్యాలను మెరుగుపరచడానికి  విశాఖలో నైపుణ్యాభివృద్ధి యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  సీఎం ప్రతిపాదనలపై ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో సానుకూలంగా స్పందించారు. విశాఖలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామన్నారు. 2022లో ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. ఏపీ నుంచి అత్యధికంగా మత్స్య ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని ఈ వ్యాపారాన్ని పెంచేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సహాయపడాలని సీఎం కోరారు. ఫ్లిప్ కార్ట్ భాగస్వామి వాల్‌మార్ట్‌ ద్వారా ఏపీలో మత్స్య ఉత్పత్తులు కొనుగోలు, ఎగుమతి చేస్తున్నామని, వీటిని మరింతగా పెంచుతామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో స్పష్టం చేశారు. 

Also Read:  సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీ తర్వాత పీఆర్సీపై ప్రకటన... ఉద్యోగులు ఆందోళనను వాయిదా వేసుకోవాలి

Also Read: అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. తిరుపతిలో 17న బహిరంగ సభ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 16 Dec 2021 06:33 PM (IST) Tags: AP News AP Cm Jagan Flipcart ceo Kalyan krishna murthy

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: అల్లూరి విగ్రహావిష్కరణ వేదికపై మోదీ - విల్లు, బాణం ధరించిన ప్రధాని

Breaking News Live Telugu Updates: అల్లూరి విగ్రహావిష్కరణ వేదికపై మోదీ - విల్లు, బాణం ధరించిన ప్రధాని

Alluri Jayanthi: తెలుగు జాతికి గర్వకారణం అల్లూరి, జాతీయ స్థాయిలో అంతగా గుర్తింపు రాలేదు: చంద్రబాబు

Alluri Jayanthi: తెలుగు జాతికి గర్వకారణం అల్లూరి, జాతీయ స్థాయిలో అంతగా గుర్తింపు రాలేదు: చంద్రబాబు

CBSE 10th Result 2022: బీ అలర్ట్ - నేడు సీబీఎస్ఈ 10వ తరగతి టర్మ్ 2 ఫలితాలు విడుదల 

CBSE 10th Result 2022: బీ అలర్ట్ - నేడు సీబీఎస్ఈ 10వ తరగతి టర్మ్ 2 ఫలితాలు విడుదల 

Software Engineer Suicide: సాఫ్ట్‌వేర్ విషాదాలు- ఆన్‌లైన్ మోసానికి ఉద్యోగిని సూసైడ్, వ్యాయామం చేస్తూ మరొకరు మృతి

Software Engineer Suicide: సాఫ్ట్‌వేర్ విషాదాలు- ఆన్‌లైన్ మోసానికి ఉద్యోగిని సూసైడ్, వ్యాయామం చేస్తూ మరొకరు మృతి

Konaseema Live Burnt: ప్రమాదం కాదు, ప్రీప్లాన్డ్ స్కెచ్? తల్లీ కూతుళ్ల సజీవ దహనం కేసులో కుట్ర కోణం?

Konaseema Live Burnt: ప్రమాదం కాదు, ప్రీప్లాన్డ్ స్కెచ్? తల్లీ కూతుళ్ల సజీవ దహనం కేసులో కుట్ర కోణం?

టాప్ స్టోరీస్

PM Modi Message: హిందూయేతర వర్గాలపైనా దృష్టి సారించండి, నేతలకు ప్రధాని మోదీ సూచనలు

PM Modi Message: హిందూయేతర వర్గాలపైనా దృష్టి సారించండి, నేతలకు ప్రధాని మోదీ సూచనలు

Miss India 2022: మిస్ ఇండియా 2022గా సినీ శెట్టి, నాట్యమే ప్రాణమంటున్న అందాల రాణి

Miss India 2022: మిస్ ఇండియా 2022గా సినీ శెట్టి, నాట్యమే ప్రాణమంటున్న అందాల రాణి

Viral Video: మేళతాళాల మధ్య మొసలిని పెళ్లి చేసుకున్న మేయర్, అక్కడ అదే ఆచారమట

Viral Video: మేళతాళాల మధ్య మొసలిని పెళ్లి చేసుకున్న మేయర్, అక్కడ అదే ఆచారమట

KTR On Alluri: తెలంగాణలో అల్లూరి భవన్‌ త్వరలోనే, మంత్రి కేటీఆర్ వెల్లడి - ట్యాంక్‌బండ్‌పై నివాళులు

KTR On Alluri: తెలంగాణలో అల్లూరి భవన్‌ త్వరలోనే, మంత్రి కేటీఆర్ వెల్లడి - ట్యాంక్‌బండ్‌పై నివాళులు