Sajjala: సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీ తర్వాత పీఆర్సీపై ప్రకటన... ఉద్యోగులు ఆందోళనను వాయిదా వేసుకోవాలి
ఉద్యోగులకు ఇస్తోన్న ఐఆర్ కన్నా ఎక్కువ లబ్ది చేకూరేలా ప్రభుత్వ ప్రకటన ఉంటుందని సజ్జల అన్నారు. మరోసారి ఉద్యోగులతో భేటీ అవుతామని తెలిపారు. ఉద్యోగులకు మేలు చేయాలనే ఆలోచన సీఎం జగన్ కు ఉందన్నారు.
ఉద్యోగ సంఘాలతో మరోసారి భేటీ అవుతామని ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల సమావేశం ఇవాళ ఉందని తెలిపారు. ఆర్థిక మంత్రి బుగ్గనతో కలిసి సీఎంతో సజ్జల సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడిన సజ్జల.. ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలు, ఉద్యోగులు ఎంత పీఆర్సీ అడుగుతున్నారన్న విషయాలను సీఎంకు వివరించామన్నారు. ఏపీలో ఉద్యోగులకు 27శాతం ఐఆర్ ఇస్తున్నామని, నికర వేతనం తగ్గకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగాలేదని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయన్నారు. ఉద్యోగులకు ఇస్తున్న ఐఆర్ కన్నా ఎక్కువ లబ్ధి చేకూరేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చల రేపు పూర్తికావొచ్చన్నారు. శుక్రవారం లేదా సోమవారం ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశం ఉండొచ్చన్నారు. ఉద్యోగ సంఘాలు సీఎం జగన్ ను కలిసిన తరువాత పీఆర్సీపై ప్రకటన ఉంటుందని తెలిపారు.
Also Read:సంక్రాంతికి వచ్చినా.. ఉగాదికి వచ్చిన కండువా వేయాల్సింది నేనేనంటూ పరిటాల శ్రీరాం హాట్ కామెంట్స్
ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్ ను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని సజ్జల తెలిపారు. ఫిట్‌మెంట్ తో పాటు ఇతర విషయాలపై సీఎంతో చర్చించామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పీఆర్సీ ప్రకటన ఉంటుందన్నారు. ఇందుకు ఉద్యోగులు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఉద్యోగులకు నష్టం లేకుండా ప్రకటన ఉంటుందన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని సజ్జల అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇతర రాష్ట్రాలతో పోల్చుకునే స్థితిలో లేదన్నారు. త్వరలోనే పీఆర్సీపై తుది రూపు ఇస్తామన్నారు. ఉద్యోగుల ఆందోళనను వాయిదా వేసుకోమని కోరామన్నారు. ఉద్యోగ సంఘాలు మరో మారు సీఎస్‌తో భేటీ అయి ఆందోళనపై నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. సీఎం ఉద్యోగులకు మేలు చేయాలనే ఆలోచనలో ఉన్నారని సజ్జల అన్నారు. చర్చల అనంతరం ఒక నిర్ణయానికి వస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Also Read: సీపీఎస్ రద్దుపై ఉద్యోగుల ఆశలు ఆవిరి.. చేతులెత్తేసిన ప్రభుత్వం!
Also Read: అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. తిరుపతిలో 17న బహిరంగ సభ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి