News
News
X

Kadapa News : ఇడుపులపాయ టు తాడేపల్లికి పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ! వాళ్లకేం కష్టం వచ్చిందంటే ?

విదేశాల్లో చదువుకునే పేద విద్యార్థులకు రూ. పదిలక్షలు సాయం చేసే పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేయాలనుకున్నారు. కానీ పోలీసులు ఆపేశారు.

FOLLOW US: 

తెలుగుదేశం పార్టీ హయాంలో విదేశాల్లో విద్య కోసం సాయం అందుకున్న విద్యార్థులకు ఇప్పుడు ఎలాంటి సాయం అందడంలేదు. వారి చదువులు మధ్యలో ఉన్నాయి. పిల్లలు విదేశాల్లో ఉన్నారు. వారికి ప్రభుత్వం సాయం నిలిపివేయడంతో.. తమ పిల్లల చదువులకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చడానికి  ఆ తల్లిదండ్రులు కష్టాలు పడుతున్నారు. పిల్లల చదువులు మధ్యలో ఆగిపోతాయాన్న ఆవేదనతో తమ సమస్యను చెప్పుకునేందుకు సీఎం జగన్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు.

Also Read: తిరుపతిలో జరగబోయేది తెలుగుదేశం పార్టీ సభ.... ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులది త్యాగం కాదా?... టీడీపీపై మంత్రి బొత్స ఫైర్

‘విదేశీ విద్యాదరణ పథకాని’కి విద్యార్థులను ఎంపిక చేసింది. ఒక్కొక్కరికి రూ. పది లక్షల వరకూ సాయం అందేది. వైఎస్ఆర్‌సీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఆపేశారు.కడప జిల్లాకు చెందిన విదేశీ విద్యకు సాయం పొందిన తల్లిదండ్రులు అందరూ కలిసి పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముందుగా  ఇడుపులపాయ లో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. సమాధికి.., ఘాట్‌లో ఉన్న విగ్రహానికి తమ ఆవేదన తెలుపుతూ వినతి త్రం ఇచ్చారు. తర్వాత  కొద్ది సేపు మౌనం పాటించారు. అనంతరం వైఎస్సార్ ఘాట్ నుంచి వారు పాదయాత్రగా తాడేపల్లికి బయలుదేరారు.

Also Read: సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీ తర్వాత పీఆర్సీపై ప్రకటన... ఉద్యోగులు ఆందోళనను వాయిదా వేసుకోవాలి

అయితే విషయం తెలుసుకున్న ఇడుపుల పాయ  ఆర్కే వ్యాలీ పోలీసులు హుటాహుటిన వైఎస్ఆర్ ఘఆట్ వద్దకు వచ్చారు. పాదయాత్రను నిలుపుదల చేశారు.  పాదయాత్రకు అనుమతి లేని కారణంగా ఆపేయాలని సూచించారు. ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికే పాదయాత్ర చేస్తున్నట్లు  విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్ఐ వద్ద వాపోయారు. అయితే అనుమతి ఉంటేనే పాదయాత్రగా వెళ్లాలని లేకపోతే పాదయాత్ర గా వెళ్ళడానికి వీలు లేదని పోలీసులుస్పష్టం చేశారు.  పాదయాత్ర చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను అడ్డుకుని ఆటో ఎక్కి పంపించారు.

Also Read:సంక్రాంతికి వచ్చినా.. ఉగాదికి వచ్చిన కండువా వేయాల్సింది నేనేనంటూ పరిటాల శ్రీరాం హాట్ కామెంట్స్

ప్రభుత్వం తమ పిల్లల విదేశీ విద్యకు చేయాల్సిన సాయాన్ని వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.  ముఖ్యమంత్రిని కలిసేందుకు శాంతియుతంగా చేపడుతున్న   పాదయాత్ర ను పోలీసులు అడ్డుకోవడం  సమంజసం కాదన్నారు. ఎవరికి చెప్పుకున్నా సమస్య పరిష్కారం కావడం లేదని... ముఖ్యమంత్రే స్పందించాలని కోరారు.

Also Read: అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. తిరుపతిలో 17న బహిరంగ సభ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 16 Dec 2021 05:25 PM (IST) Tags: ANDHRA PRADESH cm jagan Assistance for Overseas Education Idupula Paya Parents of Students Overseas Education Scheme

సంబంధిత కథనాలు

Tirumala News: శాస్త్రోక్తంగా చక్రధారుడి చక్రస్నానం, చివరిరోజు వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Tirumala News: శాస్త్రోక్తంగా చక్రధారుడి చక్రస్నానం, చివరిరోజు వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Breaking News Telugu Live Updates: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభం, 5 గంటలపాటు కొనసాగింపు

Breaking News Telugu Live Updates: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభం, 5 గంటలపాటు కొనసాగింపు

Kurnool: ఇది తలలు పగలగొట్టుకొనే పండగ, ఈ రాత్రికే మొదలు - ప్రత్యేకతలు ఏంటంటే

Kurnool: ఇది తలలు పగలగొట్టుకొనే పండగ, ఈ రాత్రికే మొదలు - ప్రత్యేకతలు ఏంటంటే

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు: IMD

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో 3 రోజులపాటు  వర్షాలు: IMD

AP High Court Jobs: ఏపీ హైకోర్టులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, జీతమెంతో తెలుసా?

AP High Court Jobs: ఏపీ హైకోర్టులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, జీతమెంతో తెలుసా?

టాప్ స్టోరీస్

Godfather Movie Review - 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?

Godfather Movie Review - 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?

Amaravati Vs Three Capitals : అమరావతికి పోటీగా మూడు రాజధానులపై విస్తృత ప్రచారం - వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీ ప్రజల్లోకి వెళ్తుందా ? ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారా ?

Amaravati Vs Three Capitals :  అమరావతికి పోటీగా మూడు రాజధానులపై విస్తృత ప్రచారం - వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీ ప్రజల్లోకి వెళ్తుందా ? ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారా ?

The Ghost Review: ది ఘోస్ట్ రివ్యూ: ఘోస్ట్‌గా నాగార్జున హిట్ కొట్టారా?

The Ghost Review: ది ఘోస్ట్ రివ్యూ: ఘోస్ట్‌గా నాగార్జున హిట్ కొట్టారా?

Hyderabad Traffic Restrictions: నేడు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు - ఆ రూట్లలో వెళ్తున్నారా, ఇది తెలుసుకోండి

Hyderabad Traffic Restrictions: నేడు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు - ఆ రూట్లలో వెళ్తున్నారా, ఇది తెలుసుకోండి