News
News
X

Fake Currency: శ్రీశైలంలో దొంగనోట్ల చెలామణి.. బైకుపై వెంబడించిన బంకు సిబ్బంది.. చివరికి ఏం జరిగిందంటే!

ఓవైపు ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా శ్రీశైలంలో దొంగనోట్ల కలకలం రేగింది.

FOLLOW US: 
Share:

పోలీసులు, అధికారులు పలుమార్లు హెచ్చరిస్తున్నా కొన్ని ముఠాలు తమ వైఖరి మార్చుకోవడం లేదు. ఓవైపు ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా శ్రీశైలంలో దొంగనోట్ల కలకలం రేగింది. దొంగ నోట్లు చెలామణి కావడంతో స్థానిక వ్యాపారస్తులతో పాటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 

సాధారణంగానే తిరుపతి, శ్రీకాళహస్తి, అన్నవరం, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. విశాఖ లాంటి పర్యాటక ప్రాంతాలకు జనాలు అధికంగా వస్తుంటారని అలాంటి చోట్ల దొంగ నోట్లు, లేదా ఇతర అక్రమ దందా జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తుంటారు. తాజాగా శ్రీశైలం దేవస్థానంలో దొంగనోట్ల  కలకలం రేగింది. రద్దీ ఎక్కువగా ఉండే పెట్రోల్ బ్యాంకుల్లో డబ్బు సులువుగా చేతులు మారుతూ ఉంటుంది. కనుక పెట్రోల్ బ్యాంకుకు కొందరు వ్యక్తులో వచ్చి రూ.500 ఇచ్చి పెట్రోల్ కొట్టించుకున్నారు.

Also Read: విశాఖలో బాలిక అనుమానాస్పద మృతి.. మిస్సైన కొద్ది గంటలకే శవంగా..

వారు ఇచ్చిన డబ్బులో వంద నోట్లు, రెండు వందల నోటు ఉన్నాయి. అయితే కారు వెళ్లిపోయిన వెంటనే నోట్లు నకిలీవని భారత్ పెట్రోల్ బంకు సిబ్బంది గుర్తించారు. ముఖ్యంగా వారంతంలో శనివారం, ఆదివారం ఇలాంటివి జరిగే అవకాశం ఉండగా.. తాజాగా దొంగ నోట్లను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పెట్రోల్ బంకు సిబ్బంది కారును బైకు మీద వెంబడించారు. రెండు, మూడు కిలోమీటర్లు వెళ్లిన వెంటనే కారును అడ్డుకున్నారు. వారు ఇచ్చిన నోట్లు దొంగనోట్లు అని చెప్పారు. కారులో ఉన్న వ్యక్తుల వద్ద ఉన్న నోట్లు సైతం తీసుకుని పరిశీలించగా మరికొన్ని దొంగనోట్లు ఉన్నాయి. అయితే తమకు నకిలీ నోట్లు ఎలా వచ్చాయో తెలియదని కారులో వచ్చిన వ్యక్తులు సమాధానమిచ్చారు.

Also Read: హైటెక్‌గా భారీ వ్యభిచార దందా.. 75 మందిని పెళ్లి చేసుకున్న యువకుడు.. నిజాలు తెలిసి అవాక్కైన పోలీసులు

ఘటనా స్థలానికి పోలీసులు..
భారత్ పెట్రోల్ బంకు సిబ్బంది, కారును ఆపిన వెంటనే అక్కడికి పోలీసులు సైతం చేరుకున్నారు. పెట్రోల్ కొట్టించుకున్న కారులోని వ్యక్తులు బంక్ సిబ్బందికి ఇచ్చివని దొంగనోట్లు అని నిర్ధారించారు. వాటిని చించివేయాలని కారులోని వ్యక్తి చెప్పగా.. ఇప్పుడు మేం అడిగినందుకు ఇలా ప్రవర్తిస్తున్నారా అని ప్రశ్నించారు. నోట్లు చెలామణి చేసే ముందు సరిగా చూసుకోవాలని వాళ్లను హెచ్చరించారు. వారు చెలామణి అయ్యే నోట్లు ఇచ్చే సరికి గొడవ సద్దుమణిగింది. కలర్ జిరాక్స్ తీసి నోట్లు చెలామణి చేస్తున్నారని, దాని వల్ల బంక్ సిబ్బంది నష్టపోయేవారని చుట్టుపక్కల వారు సైతం వారికి మద్దతు తెలిపారు.

వీడియో వైరల్.. 
శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో దొంగనోట్ల ముఠాలు సంచరిస్తున్నాయని పోలీసులు స్థానికుల్ని అప్రమత్తం చేశారు. నకిలీ నోట్లను చించివేసి అవి చెలామణి చేసిన వారిని హెచ్చరించిన వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. శ్రీశైలం, పరిసర ప్రాంతాల్లోని వ్యాపారస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 06 Oct 2021 03:58 PM (IST) Tags: srisailam kurnool Srisailam Temple fake currency Kurnool District Fake Notes Fake Currency In Srisailam

సంబంధిత కథనాలు

APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

Tadikonda Mla Office Attack : తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆఫీస్ పై దాడి, ఫ్లెక్సీలు చించేసిన వైసీపీ కార్యకర్తలు!

Tadikonda Mla Office Attack : తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆఫీస్ పై దాడి, ఫ్లెక్సీలు చించేసిన వైసీపీ కార్యకర్తలు!

వైజాగ్ లో జీ -20 సదస్సు హడావుడి, రూ.100 కోట్లతో సుందరీకరణ పనులు

వైజాగ్ లో జీ -20 సదస్సు హడావుడి, రూ.100 కోట్లతో సుందరీకరణ పనులు

సమ్మర్ లో కశ్మీర్ వెళ్లాలి అనుకుంటున్నారా ? ఇదిగో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ 

సమ్మర్ లో కశ్మీర్ వెళ్లాలి అనుకుంటున్నారా ? ఇదిగో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ 

Nellore Ysrcp : సీఎం జగన్ కి షాకిచ్చిన నలుగురిలో ముగ్గురు నెల్లూరోళ్లే  

Nellore Ysrcp : సీఎం జగన్ కి షాకిచ్చిన నలుగురిలో ముగ్గురు నెల్లూరోళ్లే  

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల