(Source: ECI/ABP News/ABP Majha)
CM Jagan Review : డిసెంబర్ నుంచి గ్రామ సచివాలయాల తనిఖీ.. సీఎం జగన్ కీలక నిర్ణయం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాలను తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే దసరా రోజు మహిళలకు ఆసరా పథకం కింద చెక్కులు పంపిణీ చేయనున్నారు. స్పందనపై సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
డిసెంబర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయాలను తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామ సచివాలయాలు పాలనకు పట్టుగొమ్మలని భావిస్తున్న ఆయన పని తీరు మెరుగుపడటానికి నిరంతరం తనిఖీలు ఉండాలని ఆదేసిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు కూడా వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలని నిర్దేశిస్తామని ప్రకటించారు. అధికారులతో స్పందన పై జరిగిన సమీక్షలో ప్రజా సమస్యల పరిష్కారానికి కీలకమైన సూచనలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన చేస్తున్న సమయంలో ఏయే అంశాలపై దృష్టి పెట్టాలో మార్గదర్శకాలు కూడా ఇప్పటికే ఇచ్చామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తనిఖీల్లో అలసత్వం వహించిన వారిపై చర్యలకూ వెనుకాడమబోమని సీఎం హెచ్చరించారు. కలెక్టర్లు ప్రతివారం 2 సచివాలయాలు, జాయింట్ కలెక్టర్లు వారానికి 4 సచివాలయాలు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్ కలెక్టర్లు వారానికి నాలుగు సచివాలయాలను తప్పని సరిగా తనిఖీ చేయాలని దిశానిర్దేశం చేశారు. Also Read : 50 మంది టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులకు షాక్ .. జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు
ప్రభుత్వం కొత్తగా చేపట్టిన వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకంలో రిజిస్ట్రేషన్ పట్టాలిచ్చే కార్యక్రమం డిసెంబర్‌లోగా చేయాలని.. లే అవుట్లలో విద్యుత్, నీటి వసతిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. పేదలందరికీ ఇళ్ల పథకలో భాగంగా మొదటివిడతలో 15.6 లక్షల ఇళ్లు కడుతున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటివరకూ 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్ అయ్యాయని, అక్టోబరు 25 నాటికల్లా బిలో బేస్‌మెంట్ లెవల్ ఇళ్లను బేస్‌మెంట్ లెవల్‌పై స్థాయికి తీసుకువచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు రూ.35 వేలు పావలా వడ్డీకే బ్యాంకర్లు రుణాలు ఇచ్చేలా చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వమే ఇళ్లు కట్టివ్వాలని ఆప్షన్ పెట్టుకున్న వారికి తక్షణం ఇల్లు నిర్మించే ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్లు వారానికి ఒకసారి ఇళ్ల నిర్మాణంపై సమీక్ష చేయాలని ఆదేశించారు. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, బీఎంసీయూలు, డిజిటల్ లైబ్రరీల పనులు చురుగ్గా సాగాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. Also Read : తెలుగు రాష్ట్రాల్లో సవాళ్ల సీజన్ ! అందరూ కాస్కోమంటారు.. ముందడుగు వేసేదెవరు ?
కోవిడ్ తీవ్రత తగ్గిందని ప్రస్తుతం 2.5 శాతం కన్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉందని అధికారులు సీఎం దృష్టికితీసుకెల్లారు. రికవరీ రేటు కూడా 98.63శాతంగా ఉందన్నారు. అయినప్పటికీ కోవిడ్ పట్ల ఎలాంటి అలసత్వం వద్దని, 2 డోసుల వ్యాక్సినేషన్ 100శాతం పూర్తయ్యేంతవరకూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కోవిడ్ పట్ల నిర్లక్ష్యం వద్దని సీఎం అధికారులకు సూచించారు. కోవిడ్ నిబంధనలను ఉల్లఘించే వారికి కఠినంగా వ్యవహరించాలని, జరిమానాలు విధించాలని తెలిపారు. మాస్కులు వినియోగించకపోతే కచ్చితంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. థర్డ్‌వేవ్ వస్తుందో, లేదో తెలియదని కానీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అన్నారు. 100 బెడ్లకు మించి ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఉంచేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రజలందరికీ పూర్తిగా 2 డోసులు ఇస్తామని సీఎం ప్రకటించారు. Also Read : మద్యం దుకాణాల్లో "గౌడ్"లకే 15 శాతం ! తెలంగాణ సర్కార్ నిర్ణయానికి కారణం ఏమిటి ?
రైతులు ఈ క్రాపింగ్ చేసుకునలే చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. ఇ- క్రాపింగ్ కింద డిజిటల్, ఫిజికల్ రశీదులు ఇవ్వాలన్నారు. ల్యాండ్ వివరాలు, డాక్యుమెంట్ల కోసం రైతులను ఇబ్బంది పెట్టొద్దని, అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ సమావేశాలపై దృష్టిపెట్టాలన్నారు. పోలీసు విభాగం అత్యద్భుతంగా పనిచేస్తోందని సీఎం జగన్ మెచ్చుకున్నారు. మహిళల మీద నేరాల్లో 2 నెలల్లోపు ఛార్జిషీటు వేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉందని తెలిపారు. 91శాతం 2 నెలల్లోపే ఛార్జిషీటు వేస్తున్నామని, దిశ కార్యక్రమాన్ని కలెక్టర్లు ఓన్ చేసుకోవాలని సూచించారు. Also Read : రాజకీయాల్లో రెండో వైపు చూపేందుకు బాలకృష్ణ రెడీ ! ఫ్యాన్స్‌తో కీలక వ్యాఖ్యలు
విజయదశమి రోజున ఆసరా పథకం అమలు చేస్తామని అంతకు ముందు అక్టోబరు 7 నుంచి 10 రోజలు పాటు ఆసరా పథకంపై అవగాహన, చైతన్య కార్యక్రమాలు ఉంటాయని సీఎం జగన్ ప్రకటించారు. ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇందులో పాల్గొంటారని చెప్పారు. ఆసరా, చేయూత ద్వారా జీవితాలను మెరుగుపరుచుకున్న వారి విజయాలను మహిళలకు వివరిస్తారని అన్నారు. రూ. 6500 కోట్లలను వైయస్సార్ ఆసరా కింద ఇస్తున్నామని, దాదాపు 80 లక్షల మందికిపైగా మహిళలు లబ్ధిపొందుతారని ప్రకటించారు.
. Also Read : ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ! రోడ్డున పడుతున్న రాజమండ్రి వైఎస్ఆర్‌సీపీ రాజకీయం !