Political Challenges : తెలుగు రాష్ట్రాల్లో సవాళ్ల సీజన్ ! అందరూ కాస్కోమంటారు.. ముందడుగు వేసేదెవరు ?
తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు మాట కంటే ముందు తమ ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు. వారు ప్రతి సవాళ్లు చేస్తున్నారు కానీ సిద్ధమవడం లేదు. అందరూ సేఫ్ గేమ్ ఆడుతూ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సవాళ్ల రాజకీయం నడుస్తోంది. దమ్ముంటే అనే పదాన్ని ముందు పెట్టి ఒకరికొకరు చాలెంజ్‌లు విరుసుకుంటున్నారు. కానీ ఏ ఒక్క నేతా.. ప్రత్యర్థి పార్టీ విసురుతున్న సవాళ్లను స్వీకరించడం లేదు. అలా అని తాము వెనక్కి తగ్గామని అనిపించుకోవడానికి కూడా వారు సిద్ధంగా లేరు. ఆ సవాల్‌కు పోటీగా మరో సవాల్ విసిరి బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరూ సవాల్‌ను స్వీకరించే ధైర్యం చేయడం లేదు.
ఏపీలో టీడీపీ - వైఎస్ఆర్‌సీపీ రాజీనామాల సవాళ్లు !
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాలు నమోదు చేసింది. అవి ఆషామాషీ ఫలితాలు కాదు. క్లీన్ స్వీప్ అనుకోవచ్చు. అందుకే ఇక ఏపీలో ప్రతిపక్షాలు లేవని ప్రజలు తమపై సంపూర్ణ విశ్వాసం ఉంచారని అధికార పార్టీ ప్రకటించుకుంది. తమ పాలనకు.. తమ నిర్ణయాలకు ప్రజల ఆమోదం లభించిందని ప్రభుత్వం ప్రకటించుకుంది. వెంటనే తెలుగుదేశం పార్టీ నేతలు రంగంలోకి వచ్చారు. ప్రభుత్వానికి అంత ధీమా ఉంటే తక్షణం అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళదాం రమ్మని సవాల్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయంపై అంత నమ్మకం ఉంటే ఎన్నికలకు రావాలని అంటోంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా సమాధానం ఇవ్వలేదు. తిట్లతో విరుచుకుపడి ప్రతి సవాళ్లు చేస్తున్నారు.
Also Read : 52 మంది టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులకు షాక్ .. జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు
ఓడిపోతే పార్టీని రద్దు చేసుకుంటామని టీడీపీ సవాల్ !
అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళదామని ప్రజలకు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారని తేలితే తాము పార్టీని రద్దు చేసుకుంటామని తెలుగుదేశం పార్టీ సవాల్ చేశారు. నేరుగా పార్టీ అధినేత చంద్రబాబు ఈ సవాల్ చేశారు. ఎన్నికలకు వెళదాం రమ్మన్నారు. నిజానికి చంద్రబాబు ఒక్క స్థానిక ఎన్నికల విషయంలోనే కాదు .. గదతంలో మూడు రాజధానుల అంశంపై రిఫరెండంగా ఎన్నికలకు వెళదామని డెడ్‌లైన్ పెట్టి మరీ సవాల్ చేశారు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సరైనదేనని ప్రజలు తీర్పు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తాము రాజకీయాల నుంచి వైదొగలుగుతామని కూడా ఆఫర్ ఇచ్చారు.
Also Read : మద్యం దుకాణాల్లో "గౌడ్"లకే 15 శాతం ! తెలంగాణ సర్కార్ నిర్ణయానికి కారణం ఏమిటి ?
ప్రతి సవాళ్లతో కౌంటర్ ఇస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ !
అయితే తెలుగుదేశం పార్టీ అధినేత, ఆ పార్టీ నేతలు విసురుతున్న సవాళ్లను స్వీకరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్టపడలేదు. కానీ వెనక్కి తగ్గాం అనే భావన రాకుండా ఉండటానికి ఆ పార్టీ నేతలు టీడీపీ ఎమ్మెల్యేలే రాజీనామాలు చేయాలని సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా.. అప్పట్లో రాజధాని అంశంపై అయినా ఇదే విధమైన ప్రతి సవాళ్లు చేశారు. కొడాలి నాని వంటి నేతలు చంద్రబాబుపై దూషణ పర్వం కొనసాగించి ఆయన రాజీనామా చేసి కుప్పం నుంచి గెలిస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాళ్లు చేస్తున్నారు. నేరుగా టీడీపీ సవాల్‌కు ప్రతి సవాళ్లు విసురుతున్నారు కానీ.. స్వీకరించడం లేదు.
టీడీపీ నేతలూ ప్రతి సవాళ్లకే పరిమితం !
ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ప్రతి సవాళ్ల రాజకీయానికే ప్రాధాన్యం ఇస్తున్నారు కానీ అడుగు ముందుకు వేయడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని... వైసీపీ నేతలు చాలెంజ్ చేస్తున్నారు. కానీ అసలు ప్రభుత్వం మొత్తం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ప్రజాతీర్పు వెల్లడి అవుతుందని టీడీపీ నేతలంటున్నారు. ఈ సవాళ్లు.. ప్రతి సవాళ్లు అలా సాగుతూనే ఉన్నాయి.. కానీ ఎక్కడా తెగడం లేదు.
https://www.youtube.com/watch?v=68bpa_ePqPU&t=104s
తెలంగాణలోనూ అదే రాజకీయ సవాళ్ల సీజన్ !
ఇక తెలంగాణలోనూ ఏపీ కన్నా ధాటిగా సవాళ్లు - ప్రతి సవాళ్లు సాగుతున్నాయి. ఎవరూ ఎవరి సవాల్‌ను స్వీకరించడం లేదు. లెటెస్ట్‌గా వైట్ చాలెంజ్ పేరుతో రేవంత్ చేసిన హడావుడి కళ్లముందే ఉంది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను డ్రగ్స్ అంశంలో ఇన్వాల్వ్ చేసి టెస్టులు చేయించుకుందామని చాలెంజ్ విసిరారు. ఇది రాజకీయం కాదని ఆయన అన్నారు కానీ.. ఇందులోనే అసలు రాజకీయం ఉంది. కానీ కేటీఆర్ మాత్రం ఆ సవాల్‌ను స్వీకరించలేదు. రాహుల్ వస్తే తాను సిద్ధమన్నారు. అంటే ఆయన కూడా ప్రతి సవాల్ చేశారు కానీ సిద్ధం కాలేదన్నమాట. ఒక్క వైట్ చాలెంజ్ విషయంలోనే కాదు ఇటీవలి కాలంలో అందరూ సవాళ్ల బాట పడుతున్నారు.
Also Read : ఫామ్‌హౌస్‌ను దున్నేస్తా ! కేసీఆర్‌కు బండి సంజయ్ హెచ్చరిక
బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ - మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ !
ఇక ఇటీవల బండి సంజయ్ కేంద్ర నిధుల గురించి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణ నుంచే కేంద్రం ఎక్కువ నిధులు తీసుకుంటోందని .. తక్కువ తిరిగి ఇస్తోందని కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. దీనికి బండి సంజయ్ రిప్లయ్.. కేటీఆర్ కాదు కేసీఆర్ సవాల్ చేయాలని ఇచ్చారు. దీంతో ఎవరూ తగ్గలేదు కానీ ఇద్దరూ తగ్గిపోయినట్లయింది. ఇక అంతకు ముందు మంత్రి మల్లారెడ్డి తొడకొట్టి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చేసిన సవాల్ల గురించి జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సవాల్‌కు రేవంత్ రెడ్డి స్పందించలేదు. తాను మల్లారెడ్డి అల్లుడిపైనే గెలిచాను కొత్తగా ఆయనపై గెలిచేదేమిటని ప్రశ్నించారు.. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు.
Also Read : రాజకీయాల్లో రెండో వైపు చూపేందుకు బాలకృష్ణ రెడీ ! ఫ్యాన్స్‌తో కీలక వ్యాఖ్యలు
అందరిదీ పొలిటికల్ సేఫ్ గేమ్ !
రాజకీయంగా ఎంత బలంగా ఉన్నామని అనుకున్నా ఇలాంటి సవాళ్లను ఏ రాజకీయ పార్టీ నేత కూడా స్వీకరించరు. రాజకీయంగా గడ్డు పరిస్థితులు తెచ్చుకోరు. కానీ వాదనలో తాము వెనుకబడ్డామని అనుకోకుండా ఎదురుదాడి చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటారు. అందుకే సవాళ్లకు ప్రతి సవాళ్లే సమాధానాలు అవుతాయి కానీ.. వాటిని స్వీకరించి రంగంలోకి దిగే వారు ఉండరు. ఒక వేళ అలా ఎవరైనా ముందుకు వస్తే రాజకీయమే మారిపోతుంది. అలాంటి పరిణామాలు చాలా తక్కువగా ఉంటాయి.
. Also Read : ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ! రోడ్డున పడుతున్న రాజమండ్రి వైఎస్ఆర్‌సీపీ రాజకీయం !