Wine Shop Reservations : మద్యం దుకాణాల్లో "గౌడ్"లకే 15 శాతం ! తెలంగాణ సర్కార్ నిర్ణయానికి కారణం ఏమిటి ?
తెలంగాణ మద్యం దుకాణాల్లో గౌడ్ సామాజికవర్గానికి 15 శాతం రిజర్వేషన్ ప్రభుత్వం కల్పించింది. ఎస్సీ, ఎస్టీలకు మరో 15 శాతం కల్పించారు. ఈ నిర్ణయానికి కారణం ఏమిటి? ప్రభుత్వం ఏం ఆశిస్తోంది ?
తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ్ సామాజికవర్గానికి 15 శాతం, షెడ్యూల్డు కులాలకు 10 శాతం, షెడ్యూల్డు తెగలకు 5 శాతం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జీవో నెంబర్ 87ను విడుదల చేశారు. తెలంగాణా ఎక్సైజ్ చట్టం 1968 లోని సెక్షన్ 17 (1 ) (V ) ప్రకారం ఉన్న అధికారాలను ఉపయోగించి 2021 -23 సంవత్సరానికి గాను రిజర్వేషన్లను కేటాయిస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు.
ప్రత్యేకంగా "గౌడ్" సామాజికవర్గానికే 15 శాతం ఎందుకు !?
సాధారణంగా ఏ అంశంలో అయినా ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పిస్తే బీసీ, ఎస్సీ,ఎస్టీలతో పాటు ఇతర వర్గీకరణలు ఏమైనా ఉంటే వాటిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఎస్సీ, ఎస్టీలను ఆ విధంగా చెప్పినప్పటికీ బీసీ వర్గాల్లో మాత్రం ఒక్క గౌడ్ సామాజికవర్గానికి మాత్రమే 15 శాతం మద్యం దుకాణాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. నిజానికి తెలంగాణలో మద్యం వ్యాపారంలో గౌడ్‌లదే కీలక పాత్ర. చాలా కాలం నుంచి వారు ఆ రంగంలో పట్టు సాధించారు. కల్లుగీత నుంచి మద్యం దుకాణాల వరకు వారు విస్తరించారు. ఇప్పటికీ మద్యం దుకాణాలు వేలం వేస్తే పోటీపడి పాడుకునే వారిలో వారే ఎక్కువ మంది ఉంటారు. అయితే మారిపోతున్న పోటీ ప్రపంచంలో వేలంలో పోటీ పడి వారు షాపులను దక్కించుకోవడం కష్టంగా మారుతోందన్న అభిప్రాయాల నడుమ .. ఈ రంగంలో వారి ప్రాధాన్యతను కొనసాగించేందుకు ప్రభుత్వం రిజర్వేషన్‌ను ఏర్పాటు చేసినట్లుగా కనపిస్తోంది. అయితే ఈ రిజర్వేషన్ రెండేళ్ల వరకే ఉంటుంది. అంటే ఒక్క సారి వేలం వరకే వర్తిస్తుంది.
నవంబర్ 1 నుంచి అమల్లోకి నూతన మద్యం విధానం ! త్వరలో వేలం !
తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ గడువు అక్టోబర్ నెలాఖరుతో ముగియనుంది. నవంబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రావాల్సి ఉంది. అయితే రిజర్వేషన్ ఖరారు చేయాలన్న నిర్ణయంతో ఓ నెల పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 2,216 వైన్స్ ఉన్నాయి. ఎక్సైజ్ పాలసీలో భాగంగా రెండేండ్లకోసారి వైన్ షాపులకు లైసెన్స్ జారీ చేస్తారు. లక్కీ డ్రా ద్వారా లైసెన్స్ ఇస్తుంటారు. అప్లికేషన్ ఫీజు, లైసెన్స్ ఫీజు పెంపు లేదా తగ్గింపు, ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ల ప్రక్రియ తదితర కొత్త నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ పాలసీతోపాటే కొత్తగా 150 వైన్ షాపులకు పర్మిషన్ ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా 2350 వైన్ షాపులు ఉండే అవకాశం ఉంది. వీటిలో ముప్పై శాతం అంటే దాదాపుగా 700 దుకాణాలు గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు దక్కనున్నాయి. Also Read: MP Asaduddin Owaisi House: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడి... ఐదుగురు అరెస్ట్.. ఆ వ్యాఖ్యలే కారణమా?
అప్లికేషన్, లైసెన్స్ ఫీజులతో మస్తు ఆదాయం !
ప్రభుత్వానికి మద్యం దుకాణాల ద్వారా వచ్చే ఆదాయం విభిన్న రూపాల్లో ఉంటుంది. మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ సుంకం కాకుండా..దుకాణాల లైసెన్స్ ఫీజుతో పాటు వేలంలో పాల్గొనడానికి అప్లికేషన్ ఫీజులు కూడా భారీగా వసూలు చేస్తారు. గత ఏడాది షాపుల లైసెన్స్ ఫీజుతోనే సర్కారుకు రూ. 976 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్కో అప్లికేషన్‌కు రూ. 2 లక్షలు తీసుకున్నారు. లైసెన్స్ ఫీజు నాలుగు స్లాబులుగా విభజించారు. రూ. 30 లక్షల నుంచి మొదలుకొని రూ. 40 లక్షల వరకు నిర్ణయించారు. ఈ సారి ఇంకా ఖరారు చేయలేదు. ప్రాంతాలను బట్టి రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయి. Also Read : ఫామ్‌హౌస్‌ను దున్నేస్తా ! కేసీఆర్‌కు బండి సంజయ్ హెచ్చరిక
రిజర్వేషన్లు రాజకీయంగా ఆకట్టుకునే ప్రయత్నమా ?
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వేడి ఉంది. ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. రాజకీయ పరంగా విపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటాయి. అలాగే మద్యం దుకాణాల రిజర్వే,న్లపైనా అలాంటి విమర్శలు వచ్చే ్వకాశం ఉంది. రెండేళ్లకు మాత్రమే ఈ రిజర్వేషన్లు అంటే ఒక్క వేలానికి మాత్రమే కల్పించడం విమర్శలకు కారణం అయ్యే అవకాశం ఉంది.
Also Read : రాజకీయాల్లో రెండో వైపు చూపేందుకు బాలకృష్ణ రెడీ ! ఫ్యాన్స్‌తో కీలక వ్యాఖ్యలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి