అన్వేషించండి

Bats Worship: ఆ ఊరిలో గబ్బిలాలే గ్రామదేవతలు.... చిత్తూరు జిల్లాలో వింత ఆచారం... గబ్బిలాలకు హాని చేస్తే ఏంచేస్తారో తెలుసా... !

గబ్బిలాలే ఆ గ్రామ ప్రజలకు దేవతలు. నిత్య పూజలు చేస్తూ వింత సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. కరోనా టైంలో గబ్బిలాలను చూసి అందరూ హడలెత్తిన పోయినా ఈ గ్రామస్తులు మాత్రం పూజలు చేశారు.

ప్రపంచ వాయు వేగంతో పరుగులు పెడుతున్న నేటి‌ కాలంలోనూ వింత ఆచారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. గ్రామాల్లో ఆచరించే ఆచార సంప్రదాయాలను చూసి ఎవరైనా సరే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం నడవలూరు గ్రామంలో వింత ఆచారాన్ని నేటికీ పాటిస్తున్నారు. ఆ గ్రామానికి వెళ్లే ముఖ ద్వారం వద్ద పదకొండు చింత చెట్లు దర్శనమిస్తాయి. ఎవరైనా ఆ గ్రామానికి మెదటిసారి వెళ్తే ఆ చింత చెట్లను చూసి భయాందోళనకు గురవుతుంటారు. ఆ పదకొండు చింత చెట్ల నిండా గబ్బిలాలు వేళాడుతూ వింతైన శబ్దాలు చేస్తూ ఉంటాయి. అయితే ఆ గబ్బిలాలను ఆ గ్రామస్తులు దైవంగా భావించి నిత్యం పూజలు చేస్తుంటారు. ఆదివారం వస్తే చాలు ఇక్కడ పూజలు కూడా నిర్వహిస్తుంటారు. రాత్రుళ్లు ఆహార వేటలో ఉండే ఈ గబ్బిలాలు తెల్లారేసరికి తిరిగి ఆ చింత చెట్టు వద్దకు చేరుకుంటాయి. 

Also Read: రాయలసీమకు నికర జలాలు కేటాయించాలి... సీమ కోసం దిల్లీలో పోరాటం... ఇక రంగంలోకి దిగుతానన్న ఎమ్మెల్యే బాలకృష్ణ


Bats Worship: ఆ ఊరిలో గబ్బిలాలే గ్రామదేవతలు.... చిత్తూరు జిల్లాలో వింత ఆచారం... గబ్బిలాలకు హాని చేస్తే ఏంచేస్తారో తెలుసా... !

అనారోగ్య సమస్యలు నిరోధించేందుకు గబ్బిలాలకు పూజలు

గబ్బిలాలను దైవంగా కొలవడం ఆ గ్రామస్తులకు ఇటీవల వచ్చిన సంప్రదాయం కాదు. పూర్వీకుల వద్ద నుంచి వచ్చిన ఈ సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆ గబ్బిలాలు ఉండడం వల్లనే తమ గ్రామానికి ఎటువంటి ఆపద వాటిళ్లడంలేదని, అందరూ సంతోషంగా ఉండగలుగుతున్నామని ఆ గ్రామస్తులు అంటున్నారు. అంతే కాకుండా తమ గ్రామంలో గబ్బిలాలు ఉండడం కారణంగానే చాలా మంది తమ పిల్లలకు చిన్నతనంలో‌ వచ్చే సమస్యలను అధిగమించేందుకు ఆ చెట్ల వద్దకు వచ్చి గబ్బిలాలకు పూజకు నిర్వహిస్తుంటారని అంటున్నారు. సాధారణంగా చిన్నతనంలో పిల్లలు బరువు తక్కువగా పుట్టడం, సన్నని కాళ్లు, చేతులు కలిగి పుట్టడం చూస్తుంటాం. అలాంటి వారిని ఈ చెట్ల వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసి, ఆ చెట్ల కొమ్మలతో వేడి చేసిన నీటితో వారికి స్నానం చేయించి, వారి ధరించిన దుస్తులను ఆ చెట్లకు కడితే పక్షి దోష పరిహారం చేస్తుంటారు. ఇలా దైవ స్వరూపంగా భావించే గబ్బిలాలకు ఎవరైనా కీడు చేయాలని వస్తే వారిని అదే చెట్టుకు కట్టివేస్తుంటారు. ఆ గ్రామస్తులు.

Also Read: జగన్ ఎన్డీఏలో చేరితే ఏపీ మరింత అభివృద్ధి... 3 రాజధానుల అంశం రాష్ట్రం పరిధిలోనిది... కేంద్రమంత్రి అథవాలే షాకింగ్ కామెంట్స్

గబ్బిలాలే రక్షిస్తాయని నమ్మకం

కరోనా సమయంలో గబ్బిలాలు చూసి అందరూ భయపడిన ఆ గ్రామస్తులు మాత్రం ఎటువంటి భయం లేకుండా గబ్బిలాలకు పూజలు నిర్వహించారు. ప్రతి రోజు ఇంటి ఒక్కొక్కరు చొప్పున ఆ గబ్బిలాలకు పూజలు నిర్వహిస్తారు. పూర్వీకుల నుంచి సంప్రదాయంగా వచ్చిన వాటిని నేటిని కొనసాగించడడం తమకు ఎంతో సంతోషంగా ఉంటుందని ఆ గ్రామస్తులు అంటున్నారు. ఆ గబ్బిలాలే తమ గ్రామానికి రక్షణగా ఉంటున్నాయని గ్రామస్తులు అంటున్నారు. 

Also Read: విశాఖ మన్యంలో కాల్పుల కలకలం... పోలీసులపై స్మగ్లర్ల రాళ్ల దాడి... తుపాకులకు పనిచెప్పిన నల్గొండ ఖాకీలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
Embed widget