Ramdas Athawale: జగన్ ఎన్డీఏలో చేరితే ఏపీ మరింత అభివృద్ధి... 3 రాజధానుల అంశం రాష్ట్రం పరిధిలోనిది... కేంద్రమంత్రి అథవాలే షాకింగ్ కామెంట్స్
వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలో చేరితో ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి అథవాలే అన్నారు. మూడు రాజధానులు రాష్ట్ర పరిధిలోని అంశమని తేల్చి చెప్పారు.
ఏపీ సీఎం జగన్ తనకు మంచి మిత్రుడని కేంద్రమంత్రి అథవాలే అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ ను ఎన్‌డీఏలో చేరాలని కోరారు. ఎన్డీఏలో చేరితే హైవేలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఏపీకి మేలు జరుగుతుందని అథవాలే అభిప్రాయపడ్డారు. 3 రాజధానుల అంశంపై స్పందించిన కేంద్ర మంత్రి అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణతో రిజర్వేషన్లకు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: విద్యుత్ కోతలపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై చర్యలుంటాయి: మంత్రి బాలినేని
ఎన్డీఏ చేరితే ఏపీ మరింత అభివృద్ధి
మూడు రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరధిలోనిదని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. సీఎం జగన్ తనకు మంచి మిత్రుడన్న ఆయన జగన్ ఎన్డీఏలో చేరాలని కోరారు. ఎన్డీఏలో చేరితే హైవేలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో మేలు జరుగుతుందన్నారు. మరో 15 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం లేదని అథవాలే జోస్యం చెప్పారు. విశాఖలో పర్యటించిన కేంద్ర సోషల్ జస్టిస్ సహాయ మంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రంలో భాగస్వామ్యం అయితే ఏపీ అభివృద్ధి త్వరగా జరుగుతుందన్నారు. జాతీయ రహదారులు, టూరిజం ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ పార్టీ అన్న అథవాలే కానీ ఇప్పుడు పతనస్థితిలో ఉన్నట్లు వెల్లడించారు.
పాక్ పీవోకేకు దూరంగా ఉండాలి
పాకిస్థాన్ పీవోకేకు దూరంగా ఉంటే మంచిదని కేంద్రమంత్రి అథవాలే సూచించారు. పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఈ విషయంలో చొరవ తీసుకుంటే మంచిదన్నారు. మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదని తేల్చిచెప్పారు. పరిశ్రమల ప్రైవేట్ పరం చెయ్యడం కాంగ్రెస్ పార్టీలో కూడా జరిగిందన్నారు. నష్టాల్లో ఉన్న పరిశ్రమలను ప్రైవేటీకరిస్తే ఎస్సీ,ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చెయ్యాలని కోరారు.
Also Read: సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తాం... రూ.కోటి నిధి ఏర్పాటు చేస్తామని పవన్ ట్వీట్
Also Read: సందడిగా ‘అలయ్ బలయ్’.. గవర్నర్ నృత్యాలు, హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య, పవన్ కల్యాణ్