X

Pawan Kalyan: సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తాం... రూ.కోటి నిధి ఏర్పాటు చేస్తామని పవన్ ట్వీట్

దివంగత నేత దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన సేవలకు గుర్తుగా స్మారక చిహ్నంగా ఏర్పాటుచేస్తామన్నారు.

FOLLOW US: 

కర్నూలు జిల్లాలోని సంజీవయ్య గృహాన్ని స్మారక చిహ్నంగా మారుస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వి్ట్టర్లో ఒక పోస్టు పెట్టారు. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య నిత్యస్మరణీయులన్నారు. ఆయన సేవలకు గుర్తుగా స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం రూ.కోటి నిధి ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. పేదరికంలో పుట్టిన సంజీవయ్య అసాధారణ వ్యక్తిగా ఎదిగారని పవన్ చెప్పారు. వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు కృషి చేశారన్నారు. రెండేళ్లు మాత్రమే సీఎంగా ఉన్నప్పటికీ సంజీవయ్య ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్‌ పరిసరాల్లోని 6 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారన్నారు. బోయలు, కాపు కులాలను బీసీల్లో చేర్చారని పవన్ పేర్కొన్నారు. ఈ పోస్టులో దామోదరం సంజీవయ్య ఇంటి ఫొటోలను పవన్ జతచేశారు.

Also Read: సందడిగా ‘అలయ్ బలయ్’.. గవర్నర్ నృత్యాలు, హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య, పవన్ కల్యాణ్

అలయ్ బలయ్ స్ఫూర్తిదాయం

హైదరాబాద్ జలవిహార్ లో జరిగిన అలయ్-బలయ్ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. 16 ఏళ్లుగా అలయ్-బలయ్ నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు.  పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ స్ఫూర్తిని ప్రతిఒక్కరూ కొనసాగించాలని సూచించారు.

Also Read: విద్యుత్ కోతలపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై చర్యలుంటాయి: మంత్రి బాలినేని

ఘనంగా అలయ్ బలయ్ 

హైదరాబాద్​జలవిహార్‌లో అలయ్‌ బలయ్‌ కార్యక్రమం సందడిగా సాగింది. హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, మా అధ్యక్షుడు మంచు విష్ణు, ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. 

Also Read: రాయలసీమకు నికర జలాలు కేటాయించాలి... సీమ కోసం దిల్లీలో పోరాటం... ఇక రంగంలోకి దిగుతానన్న ఎమ్మెల్యే బాలకృష్ణ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: pawan kalyan janasena chief pawan kalyan latest news damodaram sanjeevaiah sanjeevaiah house

సంబంధిత కథనాలు

Weather Updates: అల్పపీడనంగా మారిన వాయుగుండం.. ఏపీలో మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు

Weather Updates: అల్పపీడనంగా మారిన వాయుగుండం.. ఏపీలో మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు

Petrol-Diesel Price, 7 December: వాహనదారులకు గుడ్‌న్యూస్! తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరంలో ఎంత తగ్గిందంటే..

Petrol-Diesel Price, 7 December: వాహనదారులకు గుడ్‌న్యూస్! తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరంలో ఎంత తగ్గిందంటే..

Gold-Silver Price: నేడు స్థిరంగా బంగారం ధర.. వెండి స్వల్పంగా పెరుగుదల.. మీ ప్రాంతంలో నేటి ధరలివీ..

Gold-Silver Price: నేడు స్థిరంగా బంగారం ధర.. వెండి స్వల్పంగా పెరుగుదల.. మీ ప్రాంతంలో నేటి ధరలివీ..

East Godavari: ఆయ్.. గోదారోళ్ల కితకితలా మజాకా.... ఆత్మీయ కలయికలో ఆద్యంతం నవ్వులే...

East Godavari: ఆయ్.. గోదారోళ్ల కితకితలా మజాకా.... ఆత్మీయ కలయికలో ఆద్యంతం నవ్వులే...

East Godavari: చెప్పిన పని చేయకపోతే చీరేస్తా... మహిళా ఎంపీడీవోకు స్థానిక నేత బెదిరింపులు... వైరల్ అవుతున్న వీడియో

East Godavari: చెప్పిన పని చేయకపోతే చీరేస్తా... మహిళా ఎంపీడీవోకు స్థానిక నేత బెదిరింపులు... వైరల్ అవుతున్న వీడియో
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు.. 

Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు.. 

Highest YouTube Subscribers: భారతీయ యూట్యూబ్ చానెల్ ప్రపంచ రికార్డు.. ఏకంగా 200 మిలియన్ సబ్‌స్కైబర్లు!

Highest YouTube Subscribers: భారతీయ యూట్యూబ్ చానెల్ ప్రపంచ రికార్డు.. ఏకంగా 200 మిలియన్ సబ్‌స్కైబర్లు!

Bigg Boss 5 Telugu: టాప్ లో సన్నీ.. లాస్ట్ లో సిరి.. నామినేషన్ లో ఐదుగురు..

Bigg Boss 5 Telugu: టాప్ లో సన్నీ.. లాస్ట్ లో సిరి.. నామినేషన్ లో ఐదుగురు..

Horoscope Today 7 December 2021: రోజంతా హ్యాపీ హ్యాపీగా ఉంటారు.. మీరు అందులో ఉన్నారా మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి..

Horoscope Today 7 December 2021: రోజంతా హ్యాపీ హ్యాపీగా ఉంటారు.. మీరు అందులో ఉన్నారా మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి..