అన్వేషించండి

Janasena Vs BJP : ఏపీలో బీజేపీ - జనసేన అనధికారిక కటీఫ్ ! బద్వేలు పోటీనే తేల్చేసిందా ?

బద్వేలు ఉపఎన్నికల విషయంలో మిత్రపక్షాలు బీజేపీ - జనసేన భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నాయి. జనసేన పోటీకి దూరంగా ఉండాలనుకుంటే .. బీజేపీ పోటీ చేస్తామని ప్రకటించింది. రెండు పార్టీల మధ్య ఇక పొత్తు లేనట్లేనా ?

ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులో ఉన్న పార్టీలు బీజేపీ, జనసేన మధ్య సంబంధాలు అంత గట్టిగా లేవని మరోసారి నిరూపితమయింది. బద్వేలు ఉపఎన్నికల విషయంలో పోటీ విషయంపై రెండు పార్టీలు రెండు  భిన్నమైన దారుల్లో వెళ్తున్నాయి. తాము పోటీ చేయబోవడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తాము పోటీ చేసి తీరుతామని భారతీయ జనతా పార్టీ తేల్చేసింది. ఉమ్మడి అభ్యర్థిని పెట్టాలనుకున్న పార్టీలు ఇలా వేర్వేరుగా ప్రకటనలు చేయడంతో రెండు పార్టీల మధ్య ఉందా లేదా అన్నట్లుగా ఉన్న పొత్తు తెగిపోయిందని రాజకీయవర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి. 

పోటీ చేయడం లేదని జనసేనాధినేత ఏకపక్ష ప్రకటన ! 

బద్వేలు ఉపఎన్నికల్లో పోటీ చేసేది లేదని అనంతపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పోటీ చేయడానికి ఆసక్తిగా ఉందని ప్రచారం జరిగింది. అయితే అక్కడ చనిపోయిన ఎమ్మెల్యే సుబ్బయ్య భార్య సుధకే వైసీపీ టిక్కెట్ ఇచ్చినందున విలువల్ని పాటిస్తామంటూ పవన్ కల్యాణ్ ప్రకటించారు. గత ఎన్నికల్లోనూ జనసేన అక్కడ పోటీ చేయలేదు. బీఎస్పీకి మద్దతిచ్చారు. కానీ నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి.  బీజేపీ పరిస్థితి అంతే. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పోటీ చేయకపోవడమే మంచిదని పవన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అమరావతిలో ఉన్న పవన్ కల్యాణ్‌ను సోము వీర్రాజు స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్‌తో బద్వేలు ఎన్నికపై చర్చించారు. అయితే తమ పార్టీ నిర్ణయాన్ని బీజేపీకి అప్పుడు పవన్ కల్యాణ్ చెప్పలేదు. దీంతో ఉమ్మడి అభ్యర్థే ఉంటారని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. ఇప్పుడు పవన్ ప్రకటనతో ఆయనను చిన్నబుచ్చినట్లయింది.
Janasena Vs BJP : ఏపీలో బీజేపీ - జనసేన అనధికారిక కటీఫ్ ! బద్వేలు పోటీనే తేల్చేసిందా ?

Also Read : బద్వేల్ ఉపఎన్నికపై టీడీపీ కీలక నిర్ణయం... పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటన..

పోటీ చేయక తప్పని పరిస్థితిలో బీజేపీ ! 
  
బద్వేలులో పోటీ నుంచి జనసేన వైదొలుగుతున్నట్లుగా పవన్ కల్యాణ్ ప్రకటిచే వరకూ బీజేపీ నేతలకూ తెలియదు. బీజేపీ అభ్యర్థి నిలబడితే జనసేన మద్దతిస్తుందని.. లేకపోతే జనసేనకు తాము మద్దతిస్తామని భావిస్తున్నారు. అయితే పవన్ నిర్ణయం శరాఘాతంలా తగలడంతో వారికి ఏమి చేయాలో పాలు పోవడం లేదు.  అయితే జనసేన సొంత నిర్ణయం తీసుకోవడంతో ఇక పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. టీడీపీ కూడా పోటీలో లేకపోవడంతో ఇదే అదనుగా గత ఎన్నికల కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకుని బలపడ్డామన్న సంకేతాలను పంపాలని నిర్ణయించారు.2014లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన విజయజ్యోతి అనే నేతతో పోటీ చేయడానికి మంతనాలు జరిపారు. గత ఎన్నికల తర్వాత కడప తెలుగుదేశం పార్టీ నేతలు సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి వంటివారు బీజేపీలో చేరారు. వారి దన్నుతో బలం పుంజుకోవచ్చని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంచనాతో ఉంది.
Janasena Vs BJP : ఏపీలో బీజేపీ - జనసేన అనధికారిక కటీఫ్ ! బద్వేలు పోటీనే తేల్చేసిందా ?

Also Read: బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం.. జగన్ పార్టీకి భయపడేది లేదు.. సోము వీర్రాజు వెల్లడి

బీజేపీ పోటీ చేస్తే జనసేన మద్దతు లేనట్లే !  

బద్వేలులో బీజేపీ పోటీ చేసినా జనసేన మద్దతివ్వడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే పవన్ కల్యాణ్ దివంగత ఎమ్మెల్యే భార్య డాక్టర్ సుధకే మద్దతిస్తున్నట్లుగా చెప్పారు.  దివంగత ఎమ్మెల్యే భార్య కాబట్టి పోటీ చేయడం లేదని చెప్పడం నేరుగా మద్దతివ్వడం కిందకే వస్తుంది. ఇప్పుడు మిత్రపక్షం పోటీ చేసినా జనసేన మద్దతు ఇవ్వరు. ఇది బీజేపీకి మరింత ఇబ్బందికరమైన పరిస్థితి తెస్తుంది. అక్కడి జనసేన ఓట్లు బదిలీ అవుతాయా లేదా అన్న ది సమస్య కాకుండా రెండు పార్టీల మధ్య చెరపలేని అంతరాలు ఏర్పడినట్లుగా సందేశం ప్రజల్లోకి క్యాడర్‌లోకి వెళ్లిపోతుందని ఆందోళన చెందుతున్నారు.
Janasena Vs BJP : ఏపీలో బీజేపీ - జనసేన అనధికారిక కటీఫ్ ! బద్వేలు పోటీనే తేల్చేసిందా ?

Also Read : బూతులు తిడితే ఇక తాట తీయడమే .. రాజమండ్రిలో పవన్ మాస్ వార్నింగ్ !

పొత్తు కొనసాగింపుపై రెండు పార్టీలకూ ఆసక్తి లేదా !?

ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ సన్నిహితంగా వ్యవహరిస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఎవరూ కలవడం లేదు. అటు జనసేన నేతలు బీజేపీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు. అటు బీజేపీ నేతలు కూడా జనసేన పార్టీ నేతలతో కలిసేందుకు రెడీగా లేరు. రెండు పార్టీల ఢిల్లీ నేతల మధ్య సఖ్యత ఉంది కానీ.. రాష్ట్ర స్థాయి నేతలు.. ద్వితీయ శ్రేణి నేతలు.. క్యాడర్ మధ్య అసలు ఎలాంటి ఆసక్తి కనిపించడం లేదు. అందుకే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో కానీ.. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో కానీ రెండు పార్టీలు కలిసి సాధించిన విజయాలేవీ లేవని గుర్తు చేస్తున్నారు. బద్వేలు నిర్ణయంతో ఇక రెండు ప ార్టీలు కలసి కట్టుగా రాజకీయాలు చేసే పరిస్థితి లేదని తేలిపోయిందని అంచనా వేయవచ్చు.  

Also Read : మాటల్లో చెప్పిన ‘రాజకీయం’ చేతల్లో చూపిస్తే తిరుగులేనట్లే..! పవన్ కల్యాణ్ ‘సొంత’ బాట ..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Maruti Grand Vitaraపై ఇయర్ ఎండ్ ఆఫర్లు: పెట్రోల్, CNG వేరియంట్లకూ డిస్కౌంట్లు
మారుతి గ్రాండ్ విటారాపై రూ.2.13 లక్షల వరకు లాభం, ఆఫర్‌ మరో రెండు రోజులే!
Rampur Accident: రోడ్డుపైకి వెళ్తే గ్యారంటీ ఉండదు - లగ్జరీ కారులో ఉన్నా సరే -ఈ వీడియో చూస్తే వణికిపోతారు!
రోడ్డుపైకి వెళ్తే గ్యారంటీ ఉండదు - లగ్జరీ కారులో ఉన్నా సరే -ఈ వీడియో చూస్తే వణికిపోతారు!
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
Embed widget