New Districts : నెల్లూరు మినహా అభ్యంతరాల పరిశీలన పూర్తి - జిల్లాల విభజన ఆగదన్న ప్రభుత్వం !
జిల్లాల విభజన మార్చడానికి కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకూ గడువు ఇచ్చిందని ప్రణాళిక శాఖ సెక్రటరీ విజయ్ కుమార్ తెలిపారు. అంత కంటే ముందే తాము విభజన పూర్తి చేస్తామన్నారు.
ఏపీలో జిల్లాల విభజన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.ఇప్ప టికే జిల్లాల విభజనపై ( AP Districts Division ) వస్తున్న అభ్యం తరాలను ప్రభుత్వం సమీక్షిస్తోంది. జి ల్లాల విభజన పక్రియపై విశాఖలో ప్రణాళిక శాఖ సెక్రటరీ విజయ్ కుమార్ ( Vijay Kumar ) విశాఖలో అధికారులతో సమావేశమయ్యా రు. విశాఖలో నాలుగు జిల్లాలకు సంబంధించిన అభ్యంతరాలు పరిశీలించారు.వాటిలో ఏవి సహేతుకంగా ఉన్నా యో.. ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయో అన్న విషయాన్ని పరిశీలింస్తామని విజయ్ కుమార్ ప్రకటించారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
రూ. 10 వేలు ఓటీఎస్ కడితే రూ. 3 లక్షల రుణం ! ఆ బ్యాంక్ రెడీ ..
ఇప్పటి వరకు 12 జిల్లాల అభ్యంతరాలపై సమీక్ష జరిపామని విజయ్ కుమార్ తెలిపారు. ఒక్క నెల్లూరు జిల్లా ( Nellore ) అభ్యంతరాలపై సమీక్ష జరపాల్సి ఉందని ప్రణాళిక శాఖ సెక్రటరీ విజయ్ కుమార్ తెలిపారు. అది కూడా పూర్తి చేసి తుది నివేదిక ప్రభుత్వానికి ( Governament ) అందజేస్తామన్నారు. ఏప్రిల్ 2న జిల్లాల విభజనపై ప్రకటన వస్తుందని.. అదే రోజు నుంచి కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ప్రతి జిల్లాలో మండల నియోజకవర్గాలకు సంబంధించి అభ్యంతరాలు వచ్చాయన్నారు.విశాఖ నుంచి 250, ఈస్ట్ గోదావరి నుంచి 300, విజయనగరం నుంచి 4వేలు, శ్రీకాకుళం నుంచి 40 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు.
విజయసాయిరెడ్డికి వైఎస్‌ఆర్‌సీపీ అనుబంధ విభాగాల బాధ్యతలు ! రాజ్యసభ ఇవ్వట్లేదని సిగ్నల్ ?
శాస్త్రీయ పద్దతిలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేశామన్నారు. జనాభా లెక్కల కారణంగా కేంద్ర ప్రభుత్వం జిల్లా సరిహద్దులని మార్చవద్దని ఆదేశించిందన్న ప్రచారాన్ని విజయ్ కుమార్ తోసిపుచ్చారు. 2020-2021 జనాభా లెక్కల జరగాలి కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడిందన్నారు. జిల్లా బౌండరీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 30 లోపు పూర్తి చేయాలని చెప్పింద్నారు. కానీ ఏప్రిల్లోనే తాము పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పరిపాలన కోసం అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భవనాలు భూములు వినియోగిస్తామని, అనివార్యం అయితే ప్రైవేటు భవనాలు ఉపయోగిస్తామని విజయ్ కుమార్ తెలిపారు.
కొత్త జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పలు జిల్లాల్లో జిల్లా కేంద్రాల కోసం..పేర్ల కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం అభ్యంతరాల కోసం నెల రోజుల గడువు ఇచ్చింది. ఈ గడువు పూర్తవడంతో అభ్యంతరాలపై విజయ్ కుమార్ నేతృత్వంలో పరిశీలన జరుపుతున్నారు. వాటిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు.ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది.