CM Jagan OTS : రూ. 10 వేలు ఓటీఎస్ కడితే రూ. 3 లక్షల రుణం ! ఆ బ్యాంక్ రెడీ ..
ఓటీఎస్ పథకం కింద ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రుణాలివ్వాలని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ నిర్ణయించింది. సీఎం చేతుల మీదుగా నలుగురికి రుణం ఇచ్చింది.
ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వన్ టైం సెటిల్మెంట్ పథకం కింద ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న వారికి ప్రభుత్వం రుణాలు ఇప్పిస్తోంది. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌తో ఈ మేరకు అవగాహన కుదుర్చుకున్నారు. ఈ మేరకు సంపూర్ణ గృహహక్కు పథకం లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణసదుపాయం అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైతన్య గోదావరి బ్యాంకు ముందడుగు వేసింది. ఒక్కో ఇంటిపై గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం పొందే వెలుసుబాటు కల్పించింది.బ్యాంకు పరిధిలోని నాలుగు జిల్లాల్లో జిల్లాకు లక్ష మంది చొప్పన ఓటీఎస్ లబ్దిదారులు ఉన్నారు.
విజయసాయిరెడ్డికి వైఎస్‌ఆర్‌సీపీ అనుబంధ విభాగాల బాధ్యతలు ! రాజ్యసభ ఇవ్వట్లేదని సిగ్నల్ ?
ఈ నాలుగు జిల్లాల్లో 228 చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ బ్రాంచీలు ఉన్నాయి. ఓటీఎస్ లబ్ధిదారులు బ్రాంచీలను సంప్రదిస్తే వారికి రుణం ఇస్తామని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. ఓటీఎస్ పథకం కింద పల్లెల్లో అయితే రూ. పది వేలు. పట్టణాల్లో అయితే రూ. ఇరవై వేలు కట్టాలి. కట్టిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. ఎలాంటి వివాదాలు లేకుండా వారి చేతికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందుతాయి. ఇలా అందిన ఆస్తిని మళ్లీ బ్యాంకులో తనఖా పెట్టి రూ.3 లక్షల చొప్పున రుణం పొందారని సీఎం జగన్ తెలిపారు. ఈ డబ్బు వారి కుటుంబ అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. సంపూర్ణ గృహ హక్కు పథకం వల్ల జరుగుతున్న మంచికి ఇది ఉదాహరణ అని పేర్కొన్నారు.
కొడాలి, వెల్లంపల్లి హీరోలుగా సినిమాలు - జగన్‌కు సలహా ఇచ్చిన మెగా బ్రదర్
రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీ మినహాయింపు వల్ల వీరిలో ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున మేలు జరిగిందని ... ఓటీఎస్ ద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల రుణం మాఫీ అవ్వడమే కాకుండా దాదాపు మరో రూ.1600 కోట్ల స్టాంపు డ్యూటీ మినహాయింపుల ద్వారా మరింత మేలు కలిగించామని సీఎం జగన్ తెలిపారు. నిర్ణీతకాలంలో ఓటీఎస్ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి రుణాలు అందేలా చూడాలని బ్యాంక్ అధికారులను సీఎం కోరారు.జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా క్లియర్ టైటిల్స్ ఇస్తున్నారని. చిన్న చిన్నవారికి కూడా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు ఇది గొప్ప అవకాశమని ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. గతంలో డాక్యుమెంట్లు లేక, రుణాలకు తగిన సెక్యూరిటీ లేక బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి పెద్ద సమస్య వచ్చేది. ఇప్పుడు అలాంటి సమస్యలేదన్నారు.
ఓటీఎస్ ద్వారా డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే బ్యాంకులు రుణాలిస్తాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయితే కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి జాతీయ బ్యాంకులు రుణాలివ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది. దీనికి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ద్వారా రుణాలిప్పించి చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.