Nagababu On Jagan: కొడాలి, వెల్లంపల్లి హీరోలుగా సినిమాలు - జగన్‌కు సలహా ఇచ్చిన మెగా బ్రదర్
కొడాలి, వెల్లంపల్లిలను హీరోలుగా పెట్టి సినిమాలు తీయాలని జగన్‌కు నాగబాబు సలహా ఇచ్చారు. ఏపీలో టాలీవుడ్ సినిమాల్ని బ్యాన్ చేసి వారివి మాత్రమే రిలీజ్ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ( Andhra Pradesh ) అన్ని వ్యాపారాలను తమ అధీనంలోకి తీసుకున్నట్లుగానే సినిమా పరిశ్రమనూ బ్యాన్ చేయాలని సినీ నటుడు, మెగా బ్రదర్ నాగేంద్రబాబు ( Nagendra Babu ) ఏపీ సీఎం జగన్‌కు సూచించారు. టాలీవుడ్ సినిమాలను బ్యాన్ చేసి మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లిలను హీరోలుగా పెట్టి సినిమాలు తీసి రిలీజ్ చేయాలని సలహా ఇచ్చారు. పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విషయంలో ప్రభుత్వం అణిచివేతకు పాల్పడటంతో నాగేంద్రబాబు వరుసగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తీరుపై ఎవరూ మాట్లాడలేదని ఇండస్ట్రీ హీరోలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేసిన ఒక్క రోజులోనే ఏపీ సీఎం జగన్‌పై ( CM Jagan ) విమర్శలు చేస్తూ మరో వీడియో విడుదల చేశారు.
https://www.youtube.com/watch?v=bXK00-wcEwI
ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో సినిమాల గురించి మాట్లాడుతున్న ఎవరికీ పరిశ్రమపై ( TollyWood ) అవగాహన లేదని స్పష్టం చేశారు. వారి గురించి మాట్లాడటం దండగన్నారు. సినిమా బడ్జెట్‌లో హీరోల రెమ్యూనరేషన్ భాగం కాదన్న వారి గురించి ఏం మాట్లాడతామని ప్రశ్నించారు. హీరోలను ( Hero ) బట్టే సినిమా బిజినెస్ అవుతుందని.. పెద్ద హీరోల సినిమాలు షూటింగ్‌లు జరిగితేనే కార్మికలకు ఉపాధిఉంటుందన్నారు. ఇండస్ట్రీలో ఉన్న హీరోల కంటే కొడాలి నాని, వెల్లంపల్లి ఎక్కువగా నటించగలరని వారితో సినిమాలు తీయాలని ఏపీ సీఎం జగన్‌కు చిరు బ్రదర్ నాగహాబు సలహా ఇచ్చారు.
చిరంజీవి ( Chiranjeevi ) పెద్ద మనిషిగా వచ్చిఇండస్ట్రీ కోసం మాట్లాడారని.. అయినా జీవో ఇవ్వలేదని ఇప్పుడు తాము వచ్చి బతిమాలాలా అని ప్రశ్నించారు. అది ఎప్పటికీ జరగదన్నారు. కొడాలి నాని ( Kodali nani ) చిరంజీవిని పవన్ కల్యాణ్ విమర్శించారంటూ చేసిన వ్యాఖ్యలపైనా నాగబాబు కౌంటర్ ఇచ్చారు. మా సోదరుల ( Konidela Brothers ) మధ్య గొడవలు పెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు. జగన్ పరిపాలనకు ఇంకా రెండేళ్లు మాత్రమే ఉందని ఓసారి జనంలోకి వచ్చి పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవాలని జగన్‌కు నాగబాబు సలహా ఇచ్చారు. ఏమైనా విమర్శిస్తే మంత్రులు బూతులతో విరుచుకుపడుతున్నారని కానీ తాము అలా మాట్లాడలేమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ( Telangana Governament ) నుంచి కొంతైనా సాయం అందుతోంది కానీ ఏపీ మాత్రం ఇబ్బందులు పెడుతోందని నాగబాబు అసహనం వ్యక్తం చేశారు.
భీమ్లా నాయక్ సినిమాకు మద్దతుగా ఎవరు మాట్లాడినా ఏపీ ప్రభుత్వ మంత్రులు, వైఎస్ఆర్‌సీపీ నేతలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు నాగబాబు నేరుగా జగన్ సర్కార్‌పై మండిపడుతూ వీడియో రిలీజ్ చేశారు. నాగబాబుపై వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది రాజకీయవర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.