AP CM Jagan : ఢిల్లీ టూర్‌కు జగన్ కూడా !? మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో పాల్గొనే అవకాశం !
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా సమావేశానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి కాలంలో రెండో సారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయనకు కేంద్ర హోంశాఖ నుంచి కీలకమైన సమావేశం కోసం ఆహ్వానం వచ్చింది. 26వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను హోంశాఖ మంత్రి సమీక్షించనున్నారు. Also Read : ఆ హెరాయిన్ తో విజయవాడకు సంబంధం లేదు... ఏపీ డీజీపీ కీలక ప్రకటన...
ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం వచ్చింది. ఆయన రెండు రోజుల ముందుగానే వెళ్లి తెలంగాణ పనుల కోసం కేంద్ర మంత్రుల్ని కలవాలని నిర్ణయించుకున్నారు. అందుకే 24వ తేదీనే ఢిల్లీ వెళ్లాలని డిసైడయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే కేసీఆర్‌కు అందిన ఆహ్వానం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా అంది ఉంటుంది. ఏపీ కూడా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమే. అయితే సీఎం జగన్ పర్యనట షెడ్యూల్‌పై ఇంకా ఎలాంటి అదికారిక ప్రకటన రాలేదు. అయితే కేంద్ర హోంమంత్రితో జరిగే సమావేశం కాబట్టి .. కేంద్రం నుంచి ఆహ్వానం అందితే జగన్ డుమ్మా కొట్టే అవకాశం లేదని చెబుతున్నారు. Also Read : సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్.. రూ.లక్ష జరిమానా విధింపు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి జల వివాదాలపై కేంద్ర మంత్రి షెకావత్‌తో పాటు ప్రధాని, హోంమంత్రులతో కూడా మాట్లాడారన్న ప్రచారం జరిగింది. ఆ సమయంలో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి వారికి ఆంధ్రప్రదేశ్ వెర్షన్ వినిపిస్తారన్న ప్రచారం జరిగింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఢిల్లీ నేతల అపాయింట్‌మెంట్లు కోరినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి అలాంటి అపాయింట్‌మెంట్‌లు ఏవీ ఖరారు కాలేదు. అయితే నేరుగా అమిత్ షాతోనే సమావేశం ఉంది కాబట్టి జగన్ ఈ అవకాశాన్ని వదులుకోరని ఖచ్చితంగా ఢిల్లీ వెళ్తారన్న అభిప్రాయం ఉంది. Also Read : రైతుల పేరుతో భారీ స్కాం... ఎంపీ భరత్‌పై జక్కంపూడి వర్గీయుల తీవ్ర ఆరోపణలు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లినా ప్రధానమంత్రితో భేటీ అయ్యే అవకాశం లేదు .. కానీ హోంమంత్రితో పాటు కీలకమైన ఇతర నేతల్ని కూడా కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు.. నిధులపై మంత్రుల్ని కలవడానికి చాన్స్ ఉంది. అయితే జగన్ పర్యటనపై మాత్రం ఇంత వరకూ అధికారికంగా..అనధికారికంగా ప్రభుత్వంవైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.
Also Read : తెలంగాణ గీత దాటింది ..జరిమానా విధించండి.. కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి