X

AP KRMB : తెలంగాణ గీత దాటింది ..జరిమానా విధించండి.. కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించాలని కృష్ణాబోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. విద్యుత్ ఉత్పత్తికి వాడిన 113 టీఎంసీలను ఆ రాష్ట్ర కోటాలో వేయాలని కోరింది.

FOLLOW US: 

తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. అనుమతి లేకుండా శ్రీశైలం , నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఆరోపిస్తూ లేఖ రాసింది. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా నీరు వృధా అవుతుందని ఏపీ ప్రభుత్వం ఆ లేఖలో ఆరోపించింది. ఇప్పటి వరకూ విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు తెలంగాణ ప్రభుత్వం 113 టీఎంసీల నీటిని వదిలారని.. ఇది మొత్తం వృధాగా సముద్రంలోకి పోయిందన్నారు. వీటిని తెలంగాణ కోటాలో చేర్చాలని ఏపీ ప్రభుత్వం లేఖలో కృష్ణా బోర్డును కోరింది. Also Read : మరోసారి ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్.. అమిత్ షా తో భేటీ 

కృష్ణా బోర్డు  సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.  విభజన చట్టాన్ని, బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పును, కృష్ణా బోర్డు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయడం లేదని.. అందుకే నిబంధనల మేరకు జరిమానా విధించాలని కోరింది. సాగర్‌లో 311.15 టీఎంసీలు నిల్వ ఉన్నప్పటికీ దిగువన సాగునీటి అవసరాలు లేకపోయినా తెలంగాణ సర్కారు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. దీనివల్ల భారీ ఎత్తున జలాలు వృథాగా సముద్రం పాలయ్యాయని తెలిపింది. అంతే కాదు తెలంగాణ ఉత్పత్తి చేసిన విద్యుత్‌లో 50 శాతాన్ని ఏపీకి కేటాయించాలని కోరింది. Also Read : ఆర్టీసీకి 4 నెలలు టైం ఇచ్చిన కేసీఆర్.. లేదంటే ఇక అదే జరుగుతుందని హెచ్చరిక

విభజన చట్టంలో 11వ షెడ్యూల్‌ ప్రకారం జోక్యం చేసుకుని విద్యుత్‌ ఉత్పత్తి చేయకుండా తెలంగాణ సర్కార్‌ కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని బోర్డుకు లేఖలో ఏపీ సర్కార్ విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై చర్చించడానికి అత్యవసరంగా కృష్ణా బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం వరుసగా లేఖలు రాస్తోంది. నీటి వినియోగం అనుమతి లేకుండా చేస్తోందని ఆరోపిస్తోంది. పలు ప్రాజెక్టులపైనా ఫిర్యాదు చేసింది. 

Also Read: పాపం.. ఆ బుడ్డోడి కుటుంబానికి మరో కష్టం.. నగదు చోరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు

రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ప్రారంభమైన వివాదం అంతకంతకూ పెరిగి పెద్దదయింది. చివరికి రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. చివరికి జోక్యం చేసుకున్న  కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులన్నింటినీ కేంద్ర పరిధిలోకి తీసుకుంది. కృష్ణా, గోదావరి బోర్డులను నోటిఫై చేసింది. అయినప్పటికీ వివాదాలు ఆగడం లేదు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నారు. 

Also Read : పరిషత్ పీఠాల కోసం పోటీ ... వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తుల నిరసనలు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

Tags: cm jagan cm kcr TS govt KRMB water dispute AG govt LETTER TO KRMB

సంబంధిత కథనాలు

Parag Agrawal Twitter CEO: ట్విట్టర్ సీఈవోగా మనోడు.. టెక్ కంపెనీల్లో కొనసాగుతున్న భారతీయుల హవా

Parag Agrawal Twitter CEO: ట్విట్టర్ సీఈవోగా మనోడు.. టెక్ కంపెనీల్లో కొనసాగుతున్న భారతీయుల హవా

ATM Alaram: ఏటీఎంలో దొంగతనం.. మోగిన అలారం.. పోలీసులు వచ్చారని ఊరంతా తెలిసింది ఈ చోరుడికి తప్ప.. 

ATM Alaram: ఏటీఎంలో దొంగతనం.. మోగిన అలారం.. పోలీసులు వచ్చారని ఊరంతా తెలిసింది ఈ చోరుడికి తప్ప.. 

Sajjanar: బస్సెక్కిన ఆర్టీసీ బాస్... కుటుంబ సమేతంగా స్టెప్పులు.. నెట్టింట వీడియో వైరల్

Sajjanar: బస్సెక్కిన ఆర్టీసీ బాస్... కుటుంబ సమేతంగా స్టెప్పులు.. నెట్టింట వీడియో వైరల్

Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి... పాడె మోసిన ఓంకార్

Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి... పాడె మోసిన ఓంకార్

TS Cabinet : ఒమిక్రాన్‌పై పోరుకు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ . ఆ ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి !

TS Cabinet :  ఒమిక్రాన్‌పై పోరుకు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ . ఆ ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి !
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Cm Kcr: యాసంగిలో ధాన్యం సేకరణ ఉండదు... వర్షకాలం పంటను ఎంతైనా కొంటాం... సీఎం కేసీఆర్ కీలక ప్రకటన...

Cm Kcr: యాసంగిలో ధాన్యం సేకరణ ఉండదు... వర్షకాలం పంటను ఎంతైనా కొంటాం... సీఎం కేసీఆర్ కీలక ప్రకటన...

Omicron Symptoms: ఓ మై క్రాన్.. కొత్త కోవిడ్ సోకితే లక్షణాలు కనిపించవా? దక్షిణాఫ్రికా డాక్టర్ చెప్పిన కీలక విషయాలివే..

Omicron Symptoms: ఓ మై క్రాన్.. కొత్త కోవిడ్ సోకితే లక్షణాలు కనిపించవా? దక్షిణాఫ్రికా డాక్టర్ చెప్పిన కీలక విషయాలివే..

CM Jagan Review: వారికి కొత్త ఇళ్లు మంజూరు చేయాలి.. వెంటనే పనులు మొదలు పెట్టాలి

CM Jagan Review: వారికి కొత్త ఇళ్లు మంజూరు చేయాలి.. వెంటనే పనులు మొదలు పెట్టాలి

Sirivennela: ఐసీయూలోనే సిరివెన్నెల.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల..

Sirivennela: ఐసీయూలోనే సిరివెన్నెల.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల..