అన్వేషించండి

 CM KCR Delhi Tour: రేపు ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్.. అమిత్ షా తో భేటీ

ఈ నెల 25న తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజులపాటు హస్తినలోనే పర్యటించనున్నారు.

ఈ నెల 24న మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. ఈ సారి మూడు రోజుల పాటు హస్తినలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం హోంమంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశం మొదటి రోజు వాయిదాపడ్డ తర్వాత రేపు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇటీవల హస్తినలో వారం రోజుల పాటు ఉన్నారు. ఇప్పుడు మరో సారి ఢిల్లీకి వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది. 

ఈనెల 26న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు. ఈ అంశాలపై కేంద్ర హోంశాఖ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం ఏర్పాటు చేసింది.


ఇటీవలే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. మరోసారి హస్తిన పయనమవుతున్నారు. ఈ నెల 1న కేసీఆర్​ఢిల్లీకి వెళ్లారు. దేశ రాజధానిలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. ఆ పనుల నిమిత్తం ఢిల్లీకి వెళ్లారు. 3 రోజుల పాటు పర్యటించాలి అనుకుంటే.. పలు కార్యక్రమాల దృష్ట్యా వారం రోజులపాటు అక్కడే ఉండిపోయారు.


2వ తేదీన ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేసీఆర్​ శంకుస్థాపన చేశారు. అనంతరం ఈనెల 3న ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్​ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై విడివిడిగా పది లేఖలు అందజేశారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందినగా మోడీని కేసీఆర్ ఆహ్వానించారు. ఆ తర్వాత కేంద్ర హోంమత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతోనూ కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావల్సిన నిధులపై చర్చించారు.

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. ఆ పనుల నిమిత్తం సెప్టెంబర్ 1న ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కేవలం 3 రోజుల పాటు బస చేయాలని భావించిన కేసీఆర్​.. పలు కార్యక్రమాల దృష్ట్యా వారం రోజులపాటు అక్కడే ఉన్నారు. 2న ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేసీఆర్​ శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ నెల 3న ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్​ భేటీ అయ్యారు.

 

Also Read: TSRTC News: ఆర్టీసీకి 4 నెలలు టైం ఇచ్చిన కేసీఆర్.. లేదంటే ఇక అదే జరుగుతుందని హెచ్చరిక

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నువ్వే నీ కొడుకుని తీసుకొని రా గౌరవంగా ఉంటుంది" బండి సంజయ్‌కు రేవంత్ సూచన
Bandi Sanjay Gag Order: భగీరథ్ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు - మీడియా, సోషల్ మీడియాల్లో బండి సంజయ్ పేరు వాడితే కఠిన చర్యలు
భగీరథ్ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు - మీడియా, సోషల్ మీడియాల్లో బండి సంజయ్ పేరు వాడితే కఠిన చర్యలు
Koheda Tragedy: బిడ్డను అమ్మేసి వెరే వ్యక్తితో వెళ్లిపోయింది - ఆ భర్త ప్రాణం తీసుకున్నాడు - హైదరాబాద్ లో విషాదం
బిడ్డను అమ్మేసి వెరే వ్యక్తితో వెళ్లిపోయింది - ఆ భర్త ప్రాణం తీసుకున్నాడు - హైదరాబాద్ లో విషాదం
Bandi Bhagirath Case Latest News: బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల
బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Mahanadu 2026: మహానాడు వేదిక మార్పు - నెల్లూరు నుంచి మంగళగిరికి.. హైబ్రిడ్ మోడల్‌లో టీడీపీ వార్షిక వేడుకలు!
మహానాడు వేదిక మార్పు - నెల్లూరు నుంచి మంగళగిరికి.. హైబ్రిడ్ మోడల్‌లో టీడీపీ వార్షిక వేడుకలు!
Bandi Sanjay Gag Order: భగీరథ్ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు - మీడియా, సోషల్ మీడియాల్లో బండి సంజయ్ పేరు వాడితే కఠిన చర్యలు
భగీరథ్ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు - మీడియా, సోషల్ మీడియాల్లో బండి సంజయ్ పేరు వాడితే కఠిన చర్యలు
Peddi Producer: 'పెద్ది'ని 350 కోట్లు పెట్టి తీశాం... మా సినిమా బలి కావొద్దు - నిర్మాత సతీష్ కిలారు
'పెద్ది'ని 350 కోట్లు పెట్టి తీశాం... మా సినిమా బలి కావొద్దు - నిర్మాత సతీష్ కిలారు
Hyundai V2G Technology: హ్యుందాయ్ విప్లవాత్మక ప్రయోగం! విద్యుత్‌ గ్రిడ్‌కే పవర్ సప్లై చేసే పవర్‌బ్యాంక్‌ లాంటి కారు సిద్ధం!
హ్యుందాయ్ విప్లవాత్మక ప్రయోగం! విద్యుత్‌ గ్రిడ్‌కే పవర్ సప్లై చేసే పవర్‌బ్యాంక్‌ లాంటి కారు సిద్ధం!
CJI Surya Kant Remarks:
"కొందరు యువకులు బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారు" సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan: ఊర్లో పెళ్లికి కుక్కుల హడావిడి- విజయ్ పార్టీపై పవన్ కల్యాణ్ రియాక్షన్
ఊర్లో పెళ్లికి కుక్కుల హడావిడి- విజయ్ పార్టీపై పవన్ కల్యాణ్ రియాక్షన్
Breaking News:
"నువ్వే నీ కొడుకుని తీసుకొని రా గౌరవంగా ఉంటుంది" బండి సంజయ్‌కు రేవంత్ సూచన
Naresh Buys Porsche Panamera G3: రెండున్నర కోట్లు పెట్టి కారు కొన్న సీనియర్ నరేష్... టాలీవుడ్‌లో ఆయనే ఫస్ట్ - ఆ కారు ఏమిటో తెలుసా?
రెండున్నర కోట్లు పెట్టి కారు కొన్న సీనియర్ నరేష్... టాలీవుడ్‌లో ఆయనే ఫస్ట్ - ఆ కారు ఏమిటో తెలుసా?
Embed widget