X

TSRTC News: ఆర్టీసీకి 4 నెలలు టైం ఇచ్చిన కేసీఆర్.. లేదంటే ఇక అదే జరుగుతుందని హెచ్చరిక

రాబోయే నాలుగు నెలల్లో ఆర్టీసీ ప్రక్షాళన కచ్చితంగా జరగాల్సిందేనని కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ ఆర్టీసీని రక్షించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేకసార్లు ఆర్థికంగా ఆదుకుందని గుర్తు చేశారు.

FOLLOW US: 

తెలంగాణ ఆర్టీసీ బలోపేతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సంస్థ బలోపేతానికి సమర్థ ఐపీఎస్ అధికారి అయిన వీసీ సజ్జనార్‌ను నిమించిన ప్రభుత్వం.. తాజాగా ఛైర్మన్ పదవిని కూడా భర్తీ చేసింది. ఇకపై ఆర్టీసీ లాభాలబాట పట్టకపోతే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బుధవారం రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్‌తో సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్.. నాలుగు నెలల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించకపోతే ప్రైవేటు పరం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బాజిరెడ్డి బుధవారం వెల్లడించారు.

Also Read: పాపం.. ఆ బుడ్డోడి కుటుంబానికి మరో కష్టం.. నగదు చోరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు

రాబోయే నాలుగు నెలల్లో ఆర్టీసీ ప్రక్షాళన కచ్చితంగా జరగాల్సిందేనని కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ ఆర్టీసీని రక్షించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేకసార్లు ఆర్థికంగా ఆదుకుందని, ఈ ఏడాది కూడా ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కింద రూ.3 వేల కోట్ల నిధులు కేటాయించామని గుర్తు చేశారు. ఇంత చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఆర్టీసీ మనుగడ సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.

‘‘ఇంకో 4 నెలల్లో ఆర్టీసీ లాభాల బాట పట్టేలా చూడాలి. ఏ మార్గంలో ఎక్కువ నష్టాలు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? అనే వాటిని క్షుణ్నంగా పరిశీలించాలి. వాటిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై లోతైన అధ్యయనం చేయాలి. అనంతరం ప్రణాళికలు అమలు చేయండి.’’ అని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. అధికారులు తక్షణమే రంగంలోకి దిగి యద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. 

Watch: Telangana: రూ.4 లక్షల కోట్లు ఖర్చు పెట్టారా.. గిదేంది మరి?: కొండా

కారణాలివీ..
కరోనా నష్టంతో పాటు పెరిగిన డీజిల్‌ ధరలు కూడా ఆర్టీసీ నష్టాలకు కారణం అవుతున్నట్లుగా అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. కార్యాలయాల్లో కూర్చొని పనిచేస్తే కుదరదని.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. అప్పుడే సంస్థ బాగుపడుతుందని అన్నారు. ఎప్పుడూ కార్యాలయంలోనే కూర్చుని చర్చించుకుంటే క్షేత్రస్థాయిలో సమస్యలు ఎలా తెలుసుకుంటారని కేసీఆర్ అన్నారు. 

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 97 డిపోల్లో అన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డిపోలు మరింత నష్టా్ల్లో ఉన్నాయి. అయితే, ఇందుకు గల కారణాలపై రిపోర్టులు తయారుచేసి సమర్పించాలని ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులను ఆదేశించారు.

Also Read: 2021 Yamaha R15: స్పోర్ట్స్ బైక్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్... కొత్త ఆర్15 వచ్చేసింది.. ధర ఎంతంటే?

Also Read: మరింత పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్‌లో ఇంకా.. వెండి కూడా అదే దారిలో..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

Tags: cm kcr VC Sajjanar tsrtc Bajireddy Govardhan TSRTC News TSRTC privatisation

సంబంధిత కథనాలు

Covid Updates: తెలంగాణలో తగ్గని కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 3,944 కేసులు, ముగ్గురు మృతి

Covid Updates: తెలంగాణలో తగ్గని కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 3,944 కేసులు, ముగ్గురు మృతి

Bandi Sanjay: సీఎంవో ఆదేశాలతో ఎంపీ అర్వింద్ పై దాడి... బీజేపీ భయపడే పార్టీ కాదు... బండి సంజయ్ కామెంట్స్

Bandi Sanjay: సీఎంవో ఆదేశాలతో ఎంపీ అర్వింద్ పై దాడి... బీజేపీ భయపడే పార్టీ కాదు... బండి సంజయ్ కామెంట్స్

Breaking News Live: శంషాబాద్ లో మద్యం మత్తులో కారు నడిపిన యువతి.. ముగ్గురికి తీవ్రగాయాలు 

Breaking News Live: శంషాబాద్ లో మద్యం మత్తులో కారు నడిపిన యువతి.. ముగ్గురికి తీవ్రగాయాలు 

Konda Movie: కొండా మూవీతో మళ్లీ తెరపైకి కొండా ఫ్యామిలీ... వరంగల్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు...

Konda Movie: కొండా మూవీతో మళ్లీ తెరపైకి కొండా ఫ్యామిలీ... వరంగల్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు...

Telangana Govt Vs Governer : ఎంపీ అర్వింద్‌కు ఫోన్ చేసి దాడిపై వాకబు చేసిన గవర్నర్ తమిళిశై ! ప్రభుత్వంతో పెరుగుతున్న దూరం.. బెంగాల్ తరహా పరిస్థితులు వస్తాయా ?

Telangana Govt Vs Governer :  ఎంపీ అర్వింద్‌కు ఫోన్ చేసి దాడిపై వాకబు చేసిన గవర్నర్ తమిళిశై ! ప్రభుత్వంతో పెరుగుతున్న దూరం..  బెంగాల్ తరహా పరిస్థితులు వస్తాయా ?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Nagarjuna: అవన్నీ పుకార్లే... నేను అలా అనలేదు! - నాగార్జున క్లారిటీ

Nagarjuna: అవన్నీ పుకార్లే... నేను అలా అనలేదు! - నాగార్జున క్లారిటీ