2021 Yamaha R15: స్పోర్ట్స్ బైక్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్... కొత్త ఆర్15 వచ్చేసింది.. ధర ఎంతంటే?
జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ యమహా తన కొత్త ఆర్15 మోటార్‌సైకిల్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.1,67,800 నుంచి ఇది ప్రారంభం కానుంది.
యమహా తన కొత్త ఆర్15 మోటార్‌సైకిల్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. ఈ జపనీస్ బ్రాండ్ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్‌లో ఇది నాలుగో జనరేషన్ మోడల్. రెండు వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. స్టాండర్డ్, హయ్యర్ స్పెక్ ఎం వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆర్15 ధర రూ.1,67,800 కాగా, ఆర్15ఎం ధర రూ.1,77,800గా ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే. యమహా గత కొన్ని నెలల నుంచి తన కొత్త ఆర్15ను పరీక్షిస్తూనే ఉంది.
2021 యమహా ఆర్15 ఫీచర్లు
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆర్15 కంటే దీని లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఆర్15లో ఉండే ట్విన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను ఇందులో అందించారు. ఆర్7 తరహాలో సింగిల్ బై-ఫంక్షనల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్ ఇందులో ఉంది. ఎల్ఈడీ పైలట్ ల్యాంపులు కూడా ఇందులో యమహా అందించింది. దీని ఫ్యూయల్ ట్యాంక్ చూడటానికి అందంగా ఉండటంతో పాటు.. విండ్ స్క్రీన్ సైజు కూడా పెరిగింది. స్పోర్ట్స్ మోడల్ తరహాలో ఉండటంతో పాటు.. ఈ బైక్ కంఫర్టబుల్‌గా కూడా ఉంటుందని యమహా అంటోంది.
ఇందులో హైఎండ్ మోడల్ అయిన ఆర్15ఎంలో ప్రత్యేకమైన స్పోర్ట్స్ డిజైన్‌ను అందించారు. స్పెషల్ సీట్లు, గోల్డెన్ బైడర్ బ్రేక్ క్యాలిపర్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు. స్ట్రీట్, ట్రాక్ డిస్‌ప్లే మోడ్లు ఇందులో ఉండనున్నాయి. ఆర్15 వీ4.0లో యమహా వై-కనెక్ట్ సిస్టం కూడా ఉంది. దీని ద్వారా స్మార్ట్ ఫోన్‌ను కూడా బైక్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ సిస్టం ద్వారా కాల్, మెసేజ్ అలెర్ట్‌లు, ఫ్యూయల్ వివరాలు, ఇంజిన్ ఆర్‌పీఎం, యాక్సెలరేషన్ రేటు, మాల్‌ఫంక్షన నోటిఫికేషన్, లొకేట్ యువర్ బైక్, పార్కింగ్ రికార్డ్, రైడింగ్ హిస్టరీ వంటి వివరాలు ఇందులో ఉన్నాయి. కాంపిటీటర్ బైక్‌లకు గట్టిపోటీని ఇవ్వడానికి ఇందులో మంచి ఫీచర్లను కంపెనీ అందించింది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం కూడా ఉంది.
ఆర్15లో 155 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇందులో సిక్స్-స్పీడ్ గేర్ బాక్స్, స్లిప్, అసిస్ట్ క్లచ్ కూడా ఉన్నాయి. ఆర్15ఎం, రేసింగ్ బ్లూ వేరియంట్లలో మెరుగైన పెర్ఫార్మెన్స్ కోసం క్విక్ షిఫ్టర్ అనే ఫీచర్ కూడా అందించారు. బైడర్ క్యాలిపర్స్, డ్యూయల్ చానెల్ యాబ్స్ కూడా ఇందులో ఉన్నాయి.
2021 యమహా ఆర్15 ధర
ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన ఆర్15 మెటాలిక్ రెడ్ ధర రూ.1,67,800గా(ఎక్స్-షోరూం) ఉంది. ఆర్15 డార్క్ నైట్ ధర రూ.1,68,800గానూ(ఎక్స్-షోరూం), ఆర్15 రేసింగ్ బ్లూ ధర రూ.1,72,800గానూ(ఎక్స్-షోరూం) ఉంది. ఇక ఆర్15ఎం ధర రూ.1,77,800గానూ(ఎక్స్-షోరూం), ఆర్15ఎం మోటో జీపీ ఎడిషన్ ధర రూ.1,79,800గానూ(ఎక్స్-షోరూం) నిర్ణయించారు.
Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!