AP Govt One Lakh Fine: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్.. రూ.లక్ష జరిమానా విధింపు...
ఏపీ ప్రభుత్వానికి కోర్టుల్లో షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు ఆదేశాలు అమలు చేయనుందుకు రూ. లక్ష జరిమానా విధించింది.
ఏపీ సర్కార్ కు ఈ మధ్య కోర్టుల నుంచి వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. దేవి సీ-ఫుడ్స్ లిమిటెడ్ కేసులో ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా ధిక్కరణ మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. గురువారం ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇటీవల ఏపీ ప్రభుత్వానికి కోర్టుల్లో వరుస షాక్ లు తగులుతున్నాయి. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం ఏపీ ప్రభుత్వానికి సర్వసాధారణం అయ్యింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదో కేసులో షాక్ లు తప్పడం లేదు.
టీటీడీ సభ్యుల నియామకంలో
రెండు రోజుల క్రితం ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. టీటీడీ పాలకమండలి నియామకంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నూతన పాలకమండలి నియమించగా ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని ప్రభుత్వం నియమించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారంటూ కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం వల్ల భక్తులపై భారం పడుతుందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. టీటీడీ బోర్డులో 80 మంది కన్నా ఎక్కువ మంది సభ్యులుగా ఉండటం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. నిబంధలకు విరుద్ధంగా నియమాలు చేపట్టారని పిటిషనర్ల తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. దీనితో ఏకీభవించిన కోర్టు ప్రత్యేక ఆహ్వానితుల నియామకం చెల్లదని తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన 568, 569 జీవోలను సస్పెండ్ చేసింది.
Also Read: TTD High Court : 50 మంది టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులకు షాక్ .. జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు
టీడీపీ నేతలపై కేసులు
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఘర్షణ, డీజీపీ కార్యాలయం వద్ద కూడా టీడీపీ నేతల నిరసనకు సంబంధించి పోలీసులు కేసులు పెట్టారు. టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ నేతలపై పెట్టిన కేసులపై విచారణ నిలిపి వేసి, సెక్షన్ 41 ఏ కింద నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ తీసుకోవాలని పోలీసులకు సూచించింది.
Also Read: ఆమె అమాయకురాలు అని చెప్పలేం.. మైనర్ గర్ల్ తో లైంగిక చర్యలో వ్యక్తికి శిక్ష రద్దు చేసిన హైకోర్టు
ఐఏఎస్ ల జైలు శిక్ష నిలుపుదల
2015 నాటి భూసేకరణకు సంబంధించిన ఒక కోర్టు ధిక్కరణ కేసులో పలువురు ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధించిన సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. బాధితులకు ఇప్పటికే పరిహారం అందినట్లు ఐఏఎస్‌లకు కోర్టుకు తెలపడంతో ఈ కేసులో తీర్పును సస్పెండ్ చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. 2015 నాటి భూసేకరణకు సంబంధించిన ఒక కోర్టు ధిక్కార కేసులో ఐఏఎస్ అధికారులకు కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌కు నాలుగు వారాల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా, ప్రస్తుత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌సింగ్ రావత్‌కి నెలరోజుల జైలు, రూ.2వేల జరిమానా, అప్పటి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు రెండు వారాల జైలుశిక్ష, రూ.1000 జరిమానా, అప్పటి మరో కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, ప్రస్తుత కలెక్టర్ ఎన్‌వీ చక్రధర్‌లకు రూ.2 వేలు జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం తీర్పు ఇచ్చారు. అప్పీల్‌కు వెళ్లేందుకు వీలుగా న్యాయమూర్తి తన తీర్పు అమలును నాలుగు వారాలు నిలుపుదల చేశారు.
Also Read: Supreme Court on Pegasus: పెగాసస్‌పై వచ్చేవారం కీలక ఆదేశాలు.. అందుకే ఆలస్యమైంది: సీజేఐ