Raja Vs Bharat : రైతుల పేరుతో భారీ స్కాం... ఎంపీ భరత్‌పై జక్కంపూడి వర్గీయుల తీవ్ర ఆరోపణలు
వైఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన వివాదం పెరిగి పెద్దదవుతోంది. పరుషోత్తమపట్నం రైతుల పరిహారాన్ని మార్గాని భరత్ కాజేసే ప్రయత్నం చేశారని జక్కంపూడి వర్గీయులు ఆరోపిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఏర్పడిన విభేదాల కారణం ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. నిన్నటి వరకూ ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇప్పుడు వారి తరపున వారి అనుచరులు రంగంలోకి వచ్చారు. ఎంపీ మర్గాని భరత్ పురుషోత్తమ పట్నం ప్రాజెక్ట్‌కు భూములిచ్చిన రైతుల డబ్బులను అన్యాయంగా కాజేయాలని ప్రయత్నించారని రైతుల పేరుతో కొంత మంది ప్రెస్‌మీట్ పెట్టి తీవ్రమైన ఆరోపణలు చేశారు. వారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పొగుడి... ఎంపీ మార్గాని భరత్‌పై ఆరోపణలు చేయడంతో పార్టీలోని గొడవల కారణంగానే ఈ స్కాంను బయట పెడుతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. Also Read : తెలంగాణ గీత దాటింది ..జరిమానా విధించండి.. కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ
రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి భూములిచ్చిన రైతులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు రావాల్సిన నష్టపరిహారాన్ని కాజేసేందుకు ఓ ప్రజాప్రతినిధి కుట్ర చేశారని ఆరోపించారు. కొందరు రైతులు ఎంపీ మార్గాని భరత్ రామ్ కలిశామని త్వరలోనే రూ. 50 లక్షల పరిహారం బ్యాంక్ ఖాతాల్లో జమవుతుందని చెబుతున్నారని వారు ఆరోపించారు. ఇటీవల సీతానగరంలో పనిచేస్తున్న అధ్యాపకుడు పులుగు దీపక్ కంబాలచెరువు వద్ద నున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒకే రోజు 50 అకౌంట్లు రైతులతో ప్రారంభింపచేశారని అన్నారు. ఒక్కో రైతు వద్ద నుంచి రూ.15 లక్షలు కమిషన్ వసూలు చేసేందుకు ఖాళీ చెక్కులను సైతం కొందరు రైతుల వద్ద నుంచి తీసుకున్నారన్నారని వారు తెలిపారు. అందుకే తమకు మార్గాని భరత్‌పై అనుమానం కలుగుతోందన్నారు.Also Read : పరిషత్ పీఠాల కోసం పోటీ ... వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తుల నిరసనలు !
తమకు అన్యాయం జరగకుండా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోరాడుతున్నారని అయితే ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. రైతులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన నష్టపరిహారాన్ని ఇప్పించేందుకు అమరావతి తీసుకెళ్లి రెవెన్యూ, లా సెక్రటరీలను కలిసి చర్చించడం జరిగిందన్నారు. రైతుల పరిహారాన్ని దోపిడీ చేసేందుకు ప్రయత్నించిన అంశంపై సిఐడి విచారణ జరిపి పాత్రధారులు, సూత్రధారులు ఎవరన్నది నిగ్గు తేల్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించి ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు పేరు రాకుండా చేయాలనే ప్రయత్నంతో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. Also Read : ఏపీపై రస్ అల్ ఖైమా ఇంటర్నేషనల్ కేసులు ! అసలు వివాదాలేంటి ? బాక్సైట్, వాన్‌పిక్ పెట్టుబడులే కారణమా ?
తెలుగుదేశం హయాంలో 4 నెలల్లో 1700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన టీడీపీ ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా భూములు తీసుకున్న విషయాన్ని కూడా ఎన్జీటీ కూడా ప్రస్తావించి ప్రభుత్వానికి జరిమానా కూడా విధించడం జరిగిందన్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఈ విధంగా మోసం చేయాలని ప్రయత్నించడం దారుణమని రైతులు మండిపడ్డారు. రైతుల ఆరోపణలపై మార్గాని భరత్ ఎలా స్పందిస్తారన్నదానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తి నెలకొంది.Also Read : పాపం.. ఆ బుడ్డోడి కుటుంబానికి మరో కష్టం.. నగదు చోరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి





















