AP Pensions: పెన్షనర్లకు గుడ్ న్యూస్, ఈ నెలాఖరుకే పింఛన్లు పంపిణీ చేయాలి- చంద్రబాబు ఆదేశం
Andhra Pradesh Pensions | ఏపీలో పింఛన్‌దారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. సెప్టెంబర్ ఒకటో తేదీన కాకుండా, ముందుగానే పింఛన్ పంపిణీ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Good News for Pensioners in Andhra Pradesh | అమరావతి: ఏపీ కేబినెట్ భేటీలో రివర్స్ టెండరింగ్ రద్దు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు నెలాఖరుకే సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఎవరైనా ఆగస్టు 31న పింఛన్ తీసుకోవడం వీలుకాకపోతే, సెప్టెంబర్ 2వ తేదీన అందించాలన్నారు.
చంద్రబాబు గత నెలలో లబ్ధిదారుల ఇంటికే నేరుగా వెళ్లి పింఛన్ నగదు అందించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. సెప్టెంబర్ నెలలోనూ ఏ సమస్యా లేకుండా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 28 విభాగాలలో లబ్దిదారులకు పెన్షన్ నగదు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఏప్రిల్ 1 నుంచి రూ.4000 పింఛన్ ఇస్తున్నారు. - వృద్దులు, వితంతువులు, డప్పు కళాకారులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్య కారులు, కళా కారులు, ట్రాన్స్ జెండర్స్ కు రూ.4000 పింఛన్ వస్తోంది. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు రూ.6000 పెన్షన్ ఇస్తుంది. దీర్ఘ కాలిక వ్యాధులు ఉండే వారికి రూ.15000కి పింఛన్ కాగా, ఈ విభాగంలో మొత్తం 24318 మంది పింఛను పొందుతున్నారు.
ఇటీవల సవరించిన పింఛన్లతో ఏపీ ప్రభుత్వంపై ప్రతినెలా రూ.819 కోట్ల అదనపు బారం పడింది. కూటమి ప్రభుత్వం ఒక్క రోజులో పింఛన్ దారులకు రూ.4,408 కోట్లు పంపిణీ చేయనుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం నెలకు రూ.1939 కోట్లు పింఛను కోసం ఖర్చు చేసింది. ఏపీలో సచివాలయ ఉద్యోగులతో పింఛను పంపిణీ చేపిస్తున్నారు.
Also Read: Pawan Kalyan: పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్, 12 వేల చీరలు పంపిన ఏపీ డిప్యూటీ సీఎం